ఫిత్రా : ఈ పదానికి అర్థం, మానవునిలో గల ప్రాకృతిక ధర్మం. అనగా, తనతోపాటు ఇతరులకూ సంతోషాన్నివ్వడం. ఈ ప్రాకృతిక ధర్మం ప్రతి మనిషిలోనూ వుంటుంది. ఈ ధర్మం ప్రకారం, మానవుడి, దైవ మార్గాన, భాగ్యములేని వారికి, ధన రూపేణా భాగ్యము కల్పించడం. ప్రముఖంగా, ఈ ఫిత్రాను రంజాన్ పండుగనాడు, పేదలకు, అభాగ్యులకు ఇచ్చే దానం. ఇతి ప్రతి ముస్లిం ఇవ్వవలసిన కనీస దానం. ఈ దానం, రంజాన్ పండుగకు మూడు రోజుల మునుపునుండి ఇవ్వవచ్చును. అలా ఇచ్చినపుడు, పేదలూ పండుగ చేసుకునే వాతావరణం ఏర్పడుతుంది. దేవుడి పట్ల కృతజ్ఞతగా .. పేదలకు దానం చేసే ఈవిధానంలో గోధుమలు గానీ , ఆహారధాన్యాలను గానీ, ధనాన్ని గానీ పంచిపెడతారు. ఈ దానం కుటుంబంలోని సభ్యులందరి తరపున పేదలకు అందజేస్తారు. మానవతా రూపంలో చూసిన యెడల ఇదొక సామాజిక బాధ్యత గల దానం. అభాగ్యులకు, పేదవారికి చేసే దానం.

ప్రవక్త ప్రవచనంసవరించు

హృదయంలో కలిగే చెడు తలంపులు, ఆలోచనలు, నోటినుంచి వెలువడే అసత్యాలు, పనికిమాలిన మాటలు వంటి పొరపాట్లు అన్నీ ఫిత్రాదానం వల్ల క్షమించబడతాయి ' అన్నారు ముహమ్మద్ ప్రవక్త.

ఇవీ చూడండిసవరించు

మూలాలుసవరించు

  • J.M. Cowan (1994), The Hans Wehr Dictionary of Modern Written Arabic
  • John Esposito (2003), The Oxford Dictionary of Islam
  • M. Masud (1996), Islamic Legal Interpretation: Muftis and Their Fatwas
  • Imam Ali, Nahjul Balagha: Sermons, Letters & Sayings of Imam Ali
  • Al-Kulayni, al-Usul mina ‘l-Kãfi, vol. 2, p. 13; al-Bukhãri, Sahih, vol. 2 (Beirut: Dãr al-Fikr, 1401) p. 104

బయటి లింకులుసవరించు

"https://te.wikipedia.org/w/index.php?title=ఫిత్రా&oldid=2958900" నుండి వెలికితీశారు