ఫిఫా ప్రపంచకప్ - 2018

ఫిఫా ప్రపంచకప్ - 2018 ఈ ప్రపంచకప్ ఫుట్ బాల్ క్రీడకు సంబంచింది. ఈ టోర్నీ నాలుగు సంవత్సరాల కొకసారి ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇంటర్నేషనల్‌ ఫుట్‌బాల్‌ అసోసియేషన్‌నిర్వహిస్తుంది . 2018 జూన్‌ 14 నుంచి జులై 15 వరకు రష్యాలో ఈ పోటీలు జరుగాయి. 32 దేశాలు ఈ పోటీల్లో తలపడ్డాయి. ఈ ప్రపంచకప్‌ మస్కట్‌ జబివాకా ను ఎంపిక చేశారు. ఈ టోర్నీలో ఐస్‌లాండ్, పనామా దేశాలు అరంగేట్రం చేసాయి. ఇది 21వ ఫుట్‌బాల్‌ ప్రపంచకప్‌.[1]

ఇప్పటి వరకు అత్యధిక సార్లు పాల్గొన్న దేశం బ్రెజిల్. ఈ దేశమే ఐధు సార్లు ఈ టోర్నీని గెలుచుకుంది. 1958 తర్వాత మొట్టమొదటి సారి ఇటలీ దేశం ఈ ప్రపంచ కప్‌కు అర్హత కాలేదు. ఈ ప్రపంచ కప్‌ 32 రోజుల పాటు 11 నగరాల్లోని 12 మైదానాలలో జరుగింది. ఈ ప్రపంచ కప్‌ ఇప్పటివరకు విజేతలుగా గెలిచింది బ్రెజిల్‌, జర్మనీ, ఇటలీ, అర్జెంటీనా, ఉరుగ్వే , స్పెయిన్, ఫ్రాన్స్, ఇంగ్లండ్‌ దేశాలు మాత్రమే. ప్రస్తుత ప్రపంచకప్‌ ద్వారా ఫిఫా పొందిన ఆదాయం దాదాపు 6.1 బిలియన్‌ డాలర్లు (రూ 41,153 కోట్లు)

చరిత్ర

మార్చు

ఫీఫా 1904 లో స్థాపించబడ్డాక మొదటిసారి ఒలింపిక్స్ కి బయట స్విట్జర్లాండులో 1906లో అంతర్జాతీయ క్రీడా పోటీలను నిర్వహించజూసింది, కానీ అది ఆశించినంతగా విజయం సాధించలేక పోయింది. 1908 లండన్ లో జరిగిన వేసవి ఒలింపిక్స్ లో మొట్టమొదటి అంతర్జాతీయ ఫుట్‌బాల్ పోటీలు జరిగాయని చెప్పవచ్చు. దీనిలోనూ తరువాతి 1912 స్టాక్ హోమ్ లో జరిగిన ఒలింపిక్స్ లోనూ కూడా బ్రిటన్ బంగారు పతకాలను గెలుచుకుంది. ఇవన్నీ కూడా ఔత్సహిక (అమెచ్యూర్) క్రీడలుగానే పరిగణిస్తారు. 1914 లో, ఫీఫా వేసవి ఒలింపిక్స్ ని ఔత్సాహిక ఆటగా గుర్తించింది. తద్వారా 1920 లో తొలిసారి ప్రపంచ వ్యాప్తంగా 14 దేశాలు (13 యూరోపియన్ దేశాలూ, ఈజిప్ట్ తో పాటు) పోటీ పడ్డ ఒలింపిక్ పోటీలో బెల్జియం విజేతగా నిల్చింది. ఆ తరువాత రెండు ఒలింపిక్స్ 1924, 1928 లోనూ ఉరుగ్వే విజయకేతనం ఎగరవేసింది. 1924లోనే ఫీఫా ఆధ్వర్యంలో వృత్తిపరమైన క్రీడాకారుల శకం కూడా ప్రారంభమైంది.

రెండో ప్రపంచ యుద్ధానికి ముందఱి ప్రపంచకప్

మార్చు
 
Estadio Centenario, 1930 లో మోన్టేవీడియో, ఉరుగ్వే లోని తొలి ప్రపంచ కప్ వేదిక

ఫుట్‌బాల్ ఆట ఒలింపిక్స్ లో సంతరించుకున్న ప్రాధాన్యత దృష్ట్యా 1928 నుండి ఫీఫా వృత్తిపరమైన ఆటలపోటీల పై కృషిచేసింది. తమ స్వాతంత్ర్య శతాబ్ది జరుపుకుంటూన్న సందర్భంలో రెండుసార్లు ఒలింపిక్స్ ఫుట్‌బాల్ బంగారు పతకాలను అప్పటికే అందుకున్న ఉరుగ్వే 1930లో తొలి ప్రపంచ కప్ పోటీలకు ఆతిథ్యమిచ్చింది. కానీ అంతదూర ప్రయాణమైన అమెరికా ఖండానికి జట్టుని పంపించడాన్ని, ఉరుగ్వేని తొలిసారి ఎంపిక చేయడాన్ని కూడా అంతగా నచ్చుకోని (ముఖ్యంగా యూరోపియన్) సభ్యదేశాలు పెద్దగా సుముఖత చూపలేదు. చివరికి పోటీలు 2 నెలల్లో ఉన్నాయనగా ఫీఫా అధ్యక్షుడు రిమెట్ తీసుకున్న చొఱవవల్ల బెల్జియం, ఫ్రాన్స్, రొమేనియా, యుగోస్లేవియాలు మాత్రం తమ జట్లను ఈ పోటీలకు పంపించాయి. మొత్తం పాల్గొన్న 13 దేశాలలో 7 దక్షిణ అమెరికా దేశాలు, 4 యూరోపియన్ దేశాలు, మిగిలిన రెండూ ఉత్తర అమెరికా నుండి వచ్చినవి. 93,000 మంది ప్రత్యక్ష ప్రేక్షకుల సమక్షంలో పొరుగుదేశం అర్జెంటీనాను ఓడించి, ఉరుగ్వే ఈ మొట్టమొదటి బహుమానాన్ని కైవశం చేసుకుంది.[2]

1932లో లాస్ ఏంజెల్స్ లో జరిగిన ఒలింపిక్స్ లో ఫుట్‌బాల్ ఆటను చేర్చలేదు. అమెరికా సంయుక్త రాష్ట్రాలలోలో ఈ ఆటకు అంతగా ప్రజాదరణ లేకపోవడమే దీనికి కారణం. అటుతరువాతి సంవత్సరాలలో యుద్ధవాతావరణం నెలకొనడం వల్ల, 1938, 1946 సంవత్సరాలలో ఐరోపా కి వెళ్ళిన ఏకైక దక్షిణ అమెరికా దేశం బ్రెజిల్ మాత్రమే. 1942 లో నాజీ జర్మనీ ఆతిథ్యమీయ తలపెట్టిన ఒలింపిక్స్ రద్దయ్యాయి.

ప్రారంభ వేడుక

మార్చు

లుజ్నికి స్టేడియంలో ఆరంభ వేడుకలు ప్రారంభమయ్యాయి.

ముగింపు వేడుక

మార్చు

పాల్గొనే దేశాలు

మార్చు

ఈ టోర్నీలో మొత్తం 32 దేశాలు తలపడ్డాయి. ఈ టోర్నీలో కొత్తగా ఐస్‌లాండ్, పనామా దేశాలు పాల్గొన్నాయి. ఫైనల్లో ఫ్రాన్స్ 4-2 తో క్రొయేషియాను ఓడించి కప్పును కైవసం చేసుకుంది.

మూలాలు

మార్చు
  1. "తెలుసుకోండి: 2018 ఫిఫా వరల్డ్ కప్ మస్కట్‌గా 'జబివాక'". Retrieved 16 May 2018.
  2. "FIFA World Cup Origin" (PDF). FIFA.com. Fédération Internationale de Football Association. Archived from the original (PDF) on 24 సెప్టెంబరు 2015. Retrieved 19 November 2007.