ఫైలిన్ తుఫాను

(ఫిలాన్ తుఫాను నుండి దారిమార్పు చెందింది)

ఫైలిన్ తుఫాను 2013 సంవత్సరంలో బంగాళాఖాతంలో ఏర్పడిన భయంకరమైన తుఫాను. దీని ప్రభావం ఒడిషా, దక్షిణాంధ్ర కోస్తా తీరంపై వుంటుందని భారత వాతావరణ సంస్థ తెలియజేసింది. ఇది భారతదేశంలో విధ్వంసకారక తుపానుల్లో 74 వదిగా అధికారులు తెలిపారు. ఫైలిన్ తుఫాన్ అక్టోబరు 12 న సాయంత్రం 6 గంటల 25 నిమిషాలకు గోపాల్‌పూర్ వద్ద తీరాన్ని దాటింది.

ఫైలిన్ తుఫాను
cyclone
ప్రస్తుత తుఫాను స్థితి
As of: 0830 IST (0300 UTC), 12 అక్టోబర్ 2013
ప్రదేశం17.8°N, 86.0°E
About 280 కి.మీ. (170 మై.) SSE of పరదీప్, ఒడిషా
About 200 కి.మీ. (120 మై.) SE of గోపాల్‌పూర్, ఒడిషా
About 200 కి.మీ. (120 మై.) ESE of కళింగపట్నం, ఆంధ్ర ప్రదేశ్
చలనంNW at 7 kn (13 km/h; 8.1 mph) తుపాను స్థితి
గాలులుGusts: 295 km/h (185 mph)
పీడనం936 hPa (mbar); 27.64 inHg

తుఫాన్ కదలిక

మార్చు
 
ఫైలిన కదలిక రేఖాచిత్రం

అక్టోబరు 4 న జపాన్ వాతావరణ కేంద్రం థాయ్ లాండ్ గల్ఫ్ లో ఏర్పడిన అల్పపీడనాన్ని గమనించడం ప్రారంభించింది. ఇది వియత్నాంలోని హోచిమిన్ నగరానికి పడమరగా 400 కి.మీ. దూరంలో పుట్టింది.[1][2] ఇది తదుపరి రోజులలో మలయ్ పెనిన్సులా, అండమాన్ దీవులు, బంగాళా ఖాతంలోనికి ప్రవేశించింది. దీనికి ఫైలిన్ అని నామకరణం చేశారు.[3][4] అక్టోబరు 12న, బలహీన పడటం ప్రారంభించి భారత తూర్పుతీరం వైపుకి కదిలింది..[5][6]. తుఫాన్ ఒడిషా లోని గోపాల్ పూర్ వద్ద,20:30 – 21:30 IST (15:00 – 16:00 UTC) మధ్య తీరాన్ని దాటింది.[7][8].

నష్టం

మార్చు
  • 12 వతేదీ సాయంత్రం 6 నుండి 12 వరకూ తీరందాటుతుందని భారత వాతావరణ శాఖ తెలిపింది.
  • వర్షాల వలన తీరప్రాంత, పల్లపు గ్రామాలు నీట మునిగాయి
  • శ్రీకాకుళం తీరప్రాంత గ్రామాలను ఖాళీ చేయించారు.

తుఫాను తీవ్రత వలన జరగబోయే ప్రమాదాలుగా ఊహిస్తున్నవి

మార్చు

దీని మూలంగా భారీ నుంచి అతి భారీ వర్షాలతో విరుచుకుపడే ప్రమాదం కనిపిస్తోంది. తుఫాను ప్రభావంతో కోస్తాంధ్రలోని తొమ్మిది జిల్లాల్లో వర్షాలు కురవనున్నాయి. అందులోనూ ఉత్తరాంధ్రలోని మూడు జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. శ్రీకాకుళం జిల్లా తీరాన్ని తుఫాను వణికించే ప్రమాదం కనిపిస్తోంది. ఈ తుఫాను దెబ్బకు అంతకుముందుగానే ఏర్పడిన అల్పపీడన ద్రోణి మరింత చురుగ్గా కదులుతూ రాష్ట్రవ్యాప్తంగా ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిపిస్తోంది. నిజానికి... ఈ తుఫాను వాయుగుండంగా ఉండగానే బుధవారం మధ్యాహ్నం అండమాన్ దీవుల్లోని మాయాబందర్ వద్ద తీరం దాటింది. ఆ తర్వాత తిరిగి సముద్రంలో ప్రవేశించి బుధవారం సాయంత్రానికే తుఫానుగా మారింది. దీనికి 'ఫైలిన్' అని పేరు పెట్టారు. ఈ తుఫాను శనివారం రాత్రికి ఉత్తర కోస్తాలోని కళింగపట్నం, ఒడిసాలోని పారాదీప్‌ల మధ్య తీరం దాటుతుందని భారత వాతావరణ శాఖ పేర్కొంది. "తుఫాను తీరం దాటే సమయంలో తీరంలో గంటకు 175 నుంచి 185 కిలోమీటర్ల వేగంతో ప్రచండ గాలులు వీస్తాయి. సముద్రంలో అలలు 10 నుంచి 11 మీటర్ల ఎత్తున ఎగిసిపడే అవకాశం ఉంది. ఇది గురువారం ఉదయానికే పెను తుఫానుగా మారుతుంది అని వాతావరణ శాఖ హెచ్చరించింది.

"తుఫాను తీరానికి 500 కిలోమీటర్ల దూరంలో ఉండగానే చేపలవేట నిలిపివేయాలి. రైళ్లు, రోడ్డు మార్గాల్లో ప్రయాణాలను నియంత్రించాలి. ప్రసార వ్యవస్థ పూర్తిగా దెబ్బతింటుంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి అని హెచ్చరించింది. ఈ మేరకు బుధవారం రాత్రి విశాఖపట్నం, మచిలీపట్నం, నిజాంపట్నం, కృష్ణపట్నంలలో రెండో నెంబర్ ప్రమాద హెచ్చరిక ఎగురవేశారు. కాకినాడ, గంగవరం రేవుల్లో రెండో నెంబర్ హెచ్చరికతోపాటు సెక్షన్ సిగ్నల్-3 ఎగురవేశారు. తుఫాను ముప్పు నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం 'హై అలర్ట్' ప్రకటించింది. బుధవారం సీఎం కిరణ్ సంబంధిత శాఖల మంత్రులు, అధికారులతో అత్యవసరంగా సమావేశమయ్యారు. తీరప్రాంత జిల్లాల కలెక్టర్లను అప్రమత్తం చేశారు. హెలికాప్టర్లు, బోట్లు సిద్ధంగా ఉంచుకోవాలని ఆదేశించారు. అవసరమైతే ఎన్‌డీఆర్ఎఫ్ బృందాల సహాయం తీసుకోవాలని సూచించారు. ఒక నెలకు సరిపడా నిత్యావసర వస్తువులను నిల్వ చేసి ఉంచాలని విద్యుత్ అధికారులు అప్రమత్తంగా ఉండాలని చెప్పారు.

'ఫైలిన్' తుఫానువల్ల దక్షిణ ఒడిసాకు ఆనుకుని శ్రీకాకుళం జిల్లాలో ఉన్న 180 కిలోమీటర్ల పొడవైన తీరానికి తీవ్ర ముప్పు పొంచి ఉందని నిపుణులు చెబుతున్నారు. 15 ఏళ్ల క్రితం ఉత్తర కోస్తా తీరాన్ని తుఫాను తాకినప్పుడు శ్రీకాకుళం జిల్లాలోని ఉద్దానం ప్రాంతం బాగా దెబ్బతింది. అప్పటి నష్టం నుంచి రైతులు ఇప్పటికీ పూర్తిగా కోలుకోలేదు. ఫైలిన్ తుఫాను కళింగపట్నం, పారాదీప్ మధ్య తీరం దాటుతుందని వాతావరణ శాఖ అంచనా వేస్తున్నప్పటికీ సముద్ర తీరానికి సమీపిస్తున్న కొద్దీ వాయవ్యంగా పయనిస్తుందని అంచనా.

అధికార చర్యలు

మార్చు

తుఫానును ఎదుర్కోవడానికి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. ఆహార పదార్ధాలు, నీళ్లు, మందులు అందుబాటులో ఉంచటం, తుపాను తాకిడి ప్రమాదం ఉందని భావించిన ప్రాంతాల నుంచి లక్ష మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించటం జరిగింది. లోతట్టు ప్రాంతాల ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలిపోవాలని విజ్ఞప్తి చేయడం జరిగింది. పరిస్థితి పర్యవేక్షణకు జిల్లాల కలెక్టర్లుకు సహాయంగా ప్రత్యేకాధికారులను నియమించింది.[9]

తుఫాను నేపథ్యంలో ముఖ్యమంత్రి విజ్ఞప్తి మేరకు, బుధవారం అర్ధరాత్రి సీమాంధ్ర ప్రాంతానికి చెందిన డిప్యూటీ కలెక్టర్లు, విద్యుత్ ఉద్యోగులు సమ్మెను పక్కనపెట్టి విధుల్లో చేరారు.

ఇవి కూడా చూడండి

మార్చు

మూలాలు

మార్చు
  1. "JMA WWJP25 Warning and Summary October 4, 2013 18z". Japan Meteorological Agency. October 4, 2013. Archived from the original on 2013-10-06. Retrieved October 10, 2013.
  2. "What is Cyclonic Storm Phailin?". Bihar Prabha. October 10, 2013. Archived from the original on 2013-10-10. Retrieved October 11, 2013.
  3. Joint Typhoon Warning Center (October 9, 2013). "Tropical Cyclone 02B Warning 3". United States Navy, United States Airforce. Archived from the original on 2013-10-10. Retrieved October 10, 2013.
  4. Regional Specialised Meteorological Center New Delhi, India (October 9, 2013). "Cyclone Warning For Indian Coast, BOB 04/2013/09" (PDF). India Meteorological Department. Archived from the original (PDF) on 2013-10-10. Retrieved 2013-10-13.
  5. Joint Typhoon Warning Center (October 12, 2013). "Tropical Cyclone 02B (Phailin) Warning 14 October 12, 2013 03z". United States Navy, United States Airforce. Archived from the original on 2013-10-12. Retrieved October 12, 2013.
  6. Joint Typhoon Warning Center (October 12, 2013). "Tropical Cyclone 02B (Phailin) Warning 15 October 12, 2013 15z". United States Navy, United States Airforce. Archived from the original on 2013-10-12. Retrieved October 12, 2013.
  7. Regional Specialised Meteorological Center New Delhi, India (October 12, 2013). "Tropical Cyclone Phailin Advisory Number 27 October 12, 2013 18z" (PDF). India Meteorological Department. Archived from the original (PDF) on 2010-04-06. Retrieved October 12, 2013.
  8. తీరం దాటిన ఫైలిన్:ఒడిషాలో ఆరుగురు మృతి
  9. భయం వద్దు, చర్యలు తీసుకున్నాం: తుఫానుపై సిఎం

బయటి లింకులు

మార్చు