ఫిలిప్పైన్ ఎయిర్‌లైన్స్

పిలిప్పైన్స్ ఎయిర్ లైన్స్ (పి.ఎస్.ఈ.: పి.ఎ.ఎల్), అనేది ఫిలిప్పీన్స్ దేశంలో ఇది ప్రధాన వైమానిక సంస్థగానే కాకుండా చారిత్రంగా అందరికీ తెలిసిన పేరు. పాసే నగరం లోని పి.ఎన్.బి. సెంటర్ లో దీని ప్రధాన కార్యాలయం ఉంది. ఈ ఎయిర్ లైన్ 1941లో ప్రారంభమైంది. ఇది ఆసియాలో అతి పురాతన, మొదటి వాణిజ్యపరమైన వైమానిక సంస్థ.[1]

Philippine Airlines
IATA
PR
ICAO
PAL
Callsign
PHILIPPINE
స్థాపితమునవంబరు 14, 1935 (1935-11-14) (as Philippine Aerial Taxi Company)
ఫిబ్రవరి 26, 1941 (1941-02-26) (as Philippine Air Lines)
కార్యకలాపాల ప్రారంభంమార్చి 15, 1941 (1941-03-15)
HubsNinoy Aquino International Airport
Secondary hubsMactan-Cebu International Airport
దృష్టి సారించిన నగరాలుKalibo International Airport
m:en:Frequent-flyer program
  1. Mabuhay Miles
m:en:Airport lounge
  1. Mabuhay Lounge and partner lounges
SubsidiariesPAL Express
Fleet size55 excl. subsidiaries
77 inc. subsidiaries
గమ్యస్థానములుPhilippine Airlines destinations
సంస్థ నినాదముYour Home in the Sky
మాతృసంస్థLT Group Inc.
ప్రధాన కార్యాలయముPNB Financial Center, Pres. Diosdado Macapagal Avenue, CCP Complex, Pasay City, Philippines
కీలక వ్యక్తులు
  • Lucio Tan
ఆదాయముIncrease Philippine peso
స్థూల ఆదాయమ్Increase Philippine peso
ఉద్యోగులుapprox. 5,000
వెబ్‌సైటుwww.philippineairlines.com

చరిత్ర

మార్చు

పి.ఎ.ఎల్. సంస్థలను 1941లో దేశానికి సేవ చేసే ఓ పవిత్ర కార్యం కోసం ప్రారంభించారు. ప్రపంచ యుద్ధం నడుస్తోన్న సమయంలో ఎయిర్ లైన్ బీచ్ మోడల్ 18 విమానాలను వాడింది.

ఇది అధికారికంగా 1986 నుంచి వ్యాపార పరమైన కార్యకలాపాలు నిర్వహిస్తోంది. సరికొత్త విమానాలను ఉపయోగిస్తూ, బలమైన కనెక్టవిటీ ఉన్న ఈ ఎయిర్ లైన్ ప్రస్తుతం ప్రపంచంలోని ఉత్తమ వైమానిక సంస్థల్లో ఒకటిగా గుర్తింపు పొందింది. [2]

గమ్యాలు

మార్చు

పిలిప్పైన్స్ ఎయిర్ లైన్స్ కార్యకలాపాలు ప్రాథమిక స్థావరం (నినోయ్ అక్వినో అంతర్జాతీయ విమానాశ్రయం), ద్వితీయ స్థావరం (మక్టాన్-సెబూ అంతర్జాతీయ విమానాశ్రయం) నుంచి సాగుతాయి. వీటిలో ఎక్కువ మార్గాల్లో జరిగే కార్యకలాపాలు నినోయ్ అక్వినో అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి జరుగుతాయి. ఈ ఎయిర్ లైన్ విమానాలు ఆసియా-ఫసిపిక్, ఉత్తర అమెరికా, ఆస్ట్రేలియా లోని గమ్యాలకు నడుస్తుంటాయి.

పిలిప్పైన్స్ ఎయిర్ లైన్స్ ప్రస్తుత విమానాలు

మార్చు

2015 ఏప్రిల్ నాటికి పిలిప్పైన్స్ ఎయిర్ లైన్స్ విమానాల వివరాలు ఈ విధంగా ఉన్నాయి.: [3]

పిలిప్పైన్స్ ఎయిర్ లైన్స్ విమానాలు
విమానం సేవలో ఆర్డర్లు ప్రయాణికులు సూచనలు
జె వై+ వై మొత్తం
ఎయిర్ బస్ ఎ320-200 10 12/12/2015 138 144 150 156 ఎయిర్ బస్ ఎ321-200, ఎయిర్ బస్ ఎ321నియో మార్చబడును రెండు A320 విమానాలను 2015 చివరినాటికి ఎలిజెయింట్ ఎయిర్ కు అమ్మనున్నారు.
ఎయిర్ బస్ ఎ321నియో 30 టి.బి.ఎ. ఎయిర్ బస్ ఎ321నియో విమానాలు 2017 నుంచి 2024 వరకు డెలివరీ చేయబడుతాయి. 2015 మార్చి 29 నాటి నివేదిక ప్రకారం అదనంగా మరో రెండు ఆర్డర్లు 2024 నాటికి డెలివరీ చేయబడుతాయి.
ఎయిర్ బస్ ఎ321-200 17 7 12 18 169 199
ఎయిర్ బస్ ఎ330-300 15 0 18 39 27 375 323 414 368 పి.ఎ.ఎల్. 5 మోనో తరగతి A330-300 విమానాలను 2015 చివరి నాటికి మార్చుకుంటుంది..
ఎయిర్ బస్ ఎ340-300 6 36 12 218 282 254 294
బోయింగ్ 777-300ఇ.ఆర్ 6 42 35 0 18 328 310 370 363
మొత్తం 54 37

క్యాబిన్ సేవలు

మార్చు

ప్రాచీన వైమానిక సంస్థల్లో ఒకటైన పిలిప్పైన్స్ పాత విలువలకు ఆధునికత జోడించి తన సేవలను అందిస్తూ ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది విమాన ప్రయాణికుల హృదయాలను కొల్లగొట్టింది. ఈ విమానాల్లో మబుహే తరగతి (వ్యాపార), ఫియెస్టా తరగతి (సాధారణ) అనే రెండు రకాల విభిన్న తరగతులుంటాయి. ఈ విమానాల్లో వినోదంతో పాటు భోజన సదుపాయాలు ఉంటాయి. వీటితో పాటు ల్యాప్ టాప్ ఛార్జింగ్ పాయింట్, యు.ఎస్.బి. పోర్ట్ సీటుకు అందుబాటులో ఉంటాయి. సాధారణ తరగతిలో టచ్ స్క్రీన్ టీవీ, మొత్తటి సీట్లు ఉంటాయి. పిలిప్పైన్స్ విమానాల్లో ప్రయాణించే వారికి ఆన్ లైన్ చెక్-ఇన్ సదుపాయం కూడా ఉంది. సాధారణ తరగతిలో 15 నుంచి 20 కిలోల బరువున్న బ్యాగేజీని, వ్యాపార తరగతి వారికి 30-35 కిలోల బరువును తమ వెంట తీసుకెళ్లవచ్చు. [4]

ప్రమాదాలు-సంఘటనలు

మార్చు

పిలిప్పైన్స్ ఎయిర్ లైన్స్ 1941లో ప్రారంభమైనప్పటి నుంచి కొన్ని ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. ఎక్కువ శాతం ప్రమాదాలు విమానంలో ఏర్పడిన సాంకేతిక లోపాల వల్లే జరిగాయి. కొని పి.ఎ.ఎల్. జెట్ విమానాలు కూడా ప్రమాదాలకు గురయ్యాయి. చెప్పుకోదగిన ప్రమాదం అల్ ఖైదా ఉగ్రవాద కార్యకలాపాల వల్ల పిలిప్పైన్స్ ఎయిర్ లైన్స్ విమానం 434లో పేలుడు సంభవించింది.

మూలాలు

మార్చు
  1. "Softer oil prices, higher sales keep PAL in the black in Q1". Business World Online. 19 May 2015. Archived from the original on 5 జనవరి 2016. Retrieved 19 May 2015.
  2. "History". Philippine Airlines. 19 May 2015. Archived from the original on 28 జూన్ 2013. Retrieved 19 May 2015.
  3. "Philippine Airlines". Cleartrip. 19 May 2015. Archived from the original on 6 జూలై 2014. Retrieved 19 May 2015.
  4. "Cabin Services". Philippine Airlines. 19 May 2015. Archived from the original on 30 ఏప్రిల్ 2015. Retrieved 19 May 2015.