ఫిలిప్ హ్యాండ్స్

దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్

ఫిలిప్ ఆల్బర్ట్ మైబర్గ్ హ్యాండ్స్ (1890, ఏప్రిల్ 14[1] – 1951, ఏప్రిల్ 27) దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్. దక్షిణాఫ్రికా క్రికెట్ జట్టు తరపున 1913 నుండి 1924 వరకు ఏడు టెస్టులు ఆడాడు.

ఫిలిప్ హ్యాండ్స్
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు
ఫిలిప్ ఆల్బర్ట్ మైబర్గ్ హ్యాండ్స్
పుట్టిన తేదీ(1890-03-18)1890 మార్చి 18
క్లార్‌మాంట్, కేప్ టౌన్, కేప్ కాలనీ
మరణించిన తేదీ1951 ఏప్రిల్ 27(1951-04-27) (వయసు 61)
ప్రీస్, ఆరెంజ్ ఫ్రీ స్టేట్, దక్షిణాఫ్రికా
బ్యాటింగుకుడిచేతి వాటం
బౌలింగుకుడిచేతి వాటం
బంధువులు
అంతర్జాతీయ జట్టు సమాచారం
జాతీయ జట్టు
తొలి టెస్టు1913 13 December - England తో
చివరి టెస్టు1924 26 July - England తో
కెరీర్ గణాంకాలు
పోటీ Test First-class
మ్యాచ్‌లు 7 52
చేసిన పరుగులు 300 2,034
బ్యాటింగు సగటు 25.00 25.11
100లు/50లు 0/2 3/10
అత్యధిక స్కోరు 83 119
వేసిన బంతులు 37 138
వికెట్లు 0 5
బౌలింగు సగటు 16.80
ఒక ఇన్నింగ్సులో 5 వికెట్లు 0
ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు 0
అత్యుత్తమ బౌలింగు 3/9
క్యాచ్‌లు/స్టంపింగులు 3/– 20/–
మూలం: CricketArchive, 2022 13 November

జననం, కుటుంబం

మార్చు

హ్యాండ్స్ 1890, ఏప్రిల్ 14న సర్ హ్యారీ హ్యాండ్స్ - లేడీ అలెట్టా హ్యాండ్స్ దంపతులకు కేప్ టౌన్‌లోని క్లేర్‌మాంట్‌లో జన్మించాడు. ఇతని అన్నయ్య రెజినాల్డ్ హ్యాండ్స్ కూడా దక్షిణాఫ్రికా తరపున టెస్ట్ క్రికెట్ ఆడాడు. ఇతని తమ్ముడు కెన్నెత్ కూడా ఒక క్రికెటర్, అయినప్పటికీ అతను టెస్ట్ క్రికెట్ ఆడలేదు.

వృత్తిరంగం

మార్చు

తన సోదరుల వలె, ఇతను రోండెబోష్‌లోని డియోసెసన్ కళాశాలలో, 1908లో రోడ్స్ స్కాలర్‌గా ఆక్స్‌ఫర్డ్ వరకు చదువుకున్నాడు. మొదట్లో లా డిగ్రీ ప్రారంభించి, అకౌంటింగ్‌కి మారాడు.[2]

రాయల్ గారిసన్ ఆర్టిలరీలో పనిచేస్తున్నాడు.[2] మొదటి ప్రపంచ యుద్ధంలో డిఎస్ఓ, ఎంసి అవార్డులు పొందాడు, మేజర్ స్థాయికి చేరుకున్నాడు.[3][4]

క్రికెట్ రంగం

మార్చు

1913–14లో ఇంగ్లండ్‌పై అత్యధిక టెస్ట్ స్కోరు 83 పరుగులు చేశాడు. 105 నిమిషాల్లో 98 పరుగులు చేసిన హార్డ్-హిట్టింగ్ బ్యాట్స్‌మన్.[3] 1924లో ఇంగ్లండ్‌లో పర్యటించాడు, కానీ విజయవంతం కాలేదు.[3]

ఇతను 1951, ఏప్రిల్ 27న ప్యారీస్, ఆరెంజ్ ఫ్రీ స్టేట్‌లో మరణించాడు.[4]

మూలాలు

మార్చు
  1. "South Africa, Church of the Province of South Africa, Parish Registers, 1801-2004," database with images, FamilySearch (https://familysearch.org/pal:/MM9.3.1/TH-1942-23589-14765-34?cc=1468076 : accessed 19 January 2016), South Africa > Cape of Good Hope > Cape Town, Claremont, St Saviour > Baptisms 1910-1926 > image 302 of 396; William Cullen Library, Wits University, Johannesburg.
  2. 2.0 2.1 Schulze, Heinrich (1999). South Africa's Cricketing Lawyers. [South Africa]: Halfway House. pp. 106–109. ISBN 9780620250498.
  3. 3.0 3.1 3.2 Wisden 1952, p. 956.
  4. 4.0 4.1 "Philip Albert Myburgh Hands".

బాహ్య లింకులు

మార్చు