ఫెర్యులా అపియాసి కుటుంబంలో సుమారు 170 రకాల పుష్పించే మొక్కల జాతి. ఇది మధ్యధరా ప్రాంతంలో తూర్పు నుండి మధ్య ఆసియా ప్రాంతానికి చెందినది. ఇది ఎక్కువగా శుష్క వాతావరణంలో పెరుగుతుంది. అవి 1-4 మీటర్ల ఎత్తు వరకు పెరుగుతున్న బలిసిన, బోలుగా, కొంతవరకు రసమైన కాండంతో కూడిన గుల్మములు గల శాశ్వత మొక్కలు. ఆకులు రెమ్మలుగా చక్కగా విభజించబడ్డాయి, పువ్వులు సాధారణంగా పసుపు రంగులోనూ, అరుదుగా తెల్లగా ఉంటాయి. పూలు పెద్ద గొడుగుల ఆకారంలో ఉత్పత్తి అవుతాయి. ఈ జాతికి చెందిన చాలా మొక్కలను, ముఖ్యంగా ఎఫ్. కమ్యునిస్‌ను "జెయింట్ ఫెన్నెల్" అని పిలుస్తారు. అయినప్పటికీ అవి పూర్తి అర్థంలో అర్థంలో ఫెన్నెల్ కాదు[1].[2] దీనిలో ఇంగువ (Asafoetida) ముఖ్యమైనది.

ఫెరులా
Ferula communis2.jpg
Ferula communis
Scientific classification
Kingdom:
(unranked):
(unranked):
(unranked):
Order:
Family:
Genus:
ఫెరులా

జాతులు

See text.

Ferula foetida

కొన్ని జాతులుసవరించు

 • ఫెర్యులా అస్సాఫోటిడా - ఇంగువ
 • ఫెరులా కాస్పికా
 • ఫెరులా కమ్యూనిస్ - జెయింట్ ఫెన్నెల్
 • ఫెర్యులా కోనోకాలా
 • ఫెర్యులా డైవర్సివిటాటా
 • ఫెర్యులా ఫోటిడా
 • ఫెరులా గుమ్మోసా, సిన్. గల్బనమ్
 • ఫెర్యులా హెర్మోనిస్
 • ఫెరులా కరేలిని
 • ఫెర్యులా లింకి
 • ఫెర్యులా లాంగిఫోలియా
 • ఫెరులా మార్మరికా
 • ఫెరులా మోస్చాటా, సిన్.
 • ఫెర్యులా నార్తెక్స్ - ఫెర్యులా
 • ఫెర్యులా ఓరియంటాలిస్
 • ఫెర్యులా పెర్సికా
 • ఫెర్యులా షైర్
 • ఫెర్యులా స్జోవిట్జియానా

మూలాలుసవరించు

"https://te.wikipedia.org/w/index.php?title=ఫెరులా&oldid=3174496" నుండి వెలికితీశారు