ఫోమా బొహెమియా
ఫోమా బొహెమియా (ఆంగ్లం: Foma Bohemia) 1921 లో చెక్ రిపబ్లిక్ లోని హ్రాడెక్ క్రలోవే కేంద్రంగా పని చేసిన సంస్థ. మొదట ఫోటోకెమా గా ప్రారంభమైన సంస్థ 1995 లో ప్రైవేటు పరం కావటంతో ఈ పేరు స్థిరపడింది. బ్లాక్-అండ్-వైట్ ఫిలిం కు ఫోమా ప్రాశస్త్యం పొందిననూ చలనచిత్ర రంగానికి కావలసిన ఫిలిం, ఎక్స్-రే ఫిలిం, ఫోటోగ్రఫిక్ రసాయనాలను కూడా ఫోమా ఉత్పత్తి చేసేది.
ఫోమా బొహెమియా | |
---|---|
తరహా | |
స్థాపన | 1921 |
ప్రధానకేంద్రము | హ్రాడెక్ క్రలోవే, చెక్ రిపబ్లిక్ |
పరిశ్రమ | ఛాయాచిత్రకళ, |
ఉత్పత్తులు | ఫిలిం, ఫోటోగ్రఫిక్ రసాయనాలు, ఫోటోగ్రఫిక్ కాగితం, X-ray ఫిలిం |
వెబ్ సైటు | https://www.foma.cz/en/homepage |
చరిత్ర
మార్చు1919 లో ఇంజినీర్లు ఎవ్జెన్ షేయర్, జె. బార్టా ప్రేగ్-నస్లె లో ఫోటోగ్రఫిక్ ప్లేట్లు, ఐబిస్ పేరుతో విక్రయించటం మొదలు పెట్టింది. 1921 లో సంస్థ హ్రాడెక్ క్రాలోవె లో ఫోటోకెమా (Fotochema) గా పేరు మార్చబడింది.
తొలుత కేవలం ఫోటోగ్రఫిక్ ప్లేట్లు/రసాయనాలు ఉత్పత్తి చేయటం జరిగింది. 1931 లో బ్లాక్ అండ్ వైట్ ఫోటోగ్రఫిక్ కాగితం, 1933 లో ఫిలిం చుట్టలు, ఉత్పత్తి ప్రారంభమైంది. 1949 లో ఎక్స్-రే ఫిలిం, 1950 లో ముద్రణ రంగంలో వినియోగించబడే గ్రాఫిక్ ఫిలిం, సినిమాటోగ్రాఫిక్ ఫిలిం, స్ప్రాకెట్ రంధ్రాలు గల 35 ఎం ఎం ఫిలిం ల ఉత్పత్తి చేయటం ప్రారంభించింది.
1958 లో కలర్ ఫోటోగ్రఫిక్ కాగితాన్ని, 1964 కలర్ నెగిటివ్ ఫిలిం ను, 1971 లో కలర్ రివర్సల్ ఫిలిం ను, ఉత్పత్తి చేసింది. తమ పరిశోధన లో ఫోటోగ్రఫీ రంగంలో ఇతర ఉత్పత్తులను కూడా తయారు చేసింది.
1990 తర్వాత కేవలం బ్లాక్ అండ్ వైట్ ఫోటోగ్రఫిక్ ఉత్పత్తులపై దృష్టి కేంద్రీకరించింది. 1995 లో ప్రైవెటైజేషను తర్వాత ఫోమా బొహెమియా గా పేరు మార్చుకొంది. 1997 లో నాణ్యతా ప్రమాణాలలో ISO 9001 ను సాధించింది.
చిత్రమాలిక
మార్చు-
ఒక రైల్వే స్టేషనులో ఫోమా పాన్ 200 పై తీయబడ్డ సిల్హౌటే
-
గాజుల విక్రయం (కెమెరా: డయానా ఎఫ్+, ఫిలిం: ఫోమా పాన్ 200)
-
ఫోమా ఫిలిం పై మోషన్ బ్లర్
-
తగ్గించిన షట్టరు వేగంతో రాత్రి వేళ తీయబడిన రంగుల రాట్నం
మూలాలు
మార్చు- https://emulsive.org/articles/finding-film/finding-film-part-3-czeching-out-fomapan-tom-rayfield Archived 2019-04-05 at the Wayback Machine (ఫోమా బొహెమియా గురించి ఫిలిం ఫోటోగ్రఫీ బ్లాగు ఎమల్సివ్ వ్యాసం)
- https://www.lomography.com/magazine/172199-foma-fomapan-400-a-classic-film (ఫోమా బొహెమియా గురించి లోమోగ్రఫీ వెబ్ సైటు)
- http://www.filmsnotdead.com/introducing-a-new-film-foma-retropan-320-soft/ (ఫోమా బొహెమియా గురించి ఫిలిం ఈజ్ నాట్ డెడ్ వెబ్ సైటు)
బాహ్య లంకెలు
మార్చు- అధికారిక వెబ్-సైటు: http://www.foma.cz/en/homepage