ఫోర్ట్రాన్ అనగా ప్రొసీజర్ ఓరియంటెడ్ కంప్యూటర్ ప్రోగ్రామింగ్ భాష. ఫార్ములా ట్రాన్సిలేషన్ అనే పదం నుంచి దీని పేరు పెట్టడం జరిగింది. ఇది సంక్లిష్టమైన గణిత సమస్యలను, సైన్సు కు సంభందించిన సమస్యలను పరిష్కరించడానికి చక్కగా సరిపోతుంది. 1950లో IBM వారు సైన్సు, ఇంజనీరింగ్ అప్లికేషన్లలో వాడుకోవడానికి వీలుగా తయారు చేశారు. దీని ప్రధానా సృష్టికర్త జాన్ బాకస్. మొట్టమొదటి ఫోర్ట్రాన్ కంపైలర్ కోసం 18 నెలల సమయం వెచ్చించారు.