పెట్టుబడి
పెట్టుబడి అంటే ఏదైనా ఆస్తిని, కాలక్రమంలో దాని విలువ పెంచుకోవడం కోసం అట్టే కేటాయించి ఉంచడం. ఆర్థిక శాస్త్రంలో పెట్టుబడి ముఖ్య లక్ష్యం ప్రతిఫలం రాబట్టడం. అయితే ఈ ప్రతిఫలం లాభమూ కావచ్చు, నష్టమూ కావచ్చు. పెట్టుబడి పెట్టేవారు పెట్టుబడిదారులు. వీరు ఎక్కువ రిస్క్ ఉన్న పెట్టుబడి పెడితే ఎక్కువ ప్రతిఫలం ఆశిస్తారు. అలాగే తక్కువ రిస్క్ ఉన్న పెట్టుబడి పెడితే తక్కువ ప్రతిఫలం ఆశిస్తారు.
పెట్టుబడి దారులు తాము పెట్టిన పెట్టుబడి కొంత కానీ లేదా పూర్తిగా కానీ నష్టపోయే అవకాశం ఉంది. పెట్టుబడి దారులు ముఖ్యంగా కొత్తగా అందులోకి అడుగు పెట్టేవారికి పెట్టుబడుల్లో వైవిధ్యం చూపించమని ఆర్థికవేత్తలు చెబుతారు. ఎందుకంటే ఒక రంగంలో నష్టాలు ఎదురైనా ఇతర రంగాలు అభివృద్ధి చెందుతుంటే నష్టాన్ని కొంతవరకు నివారించవచ్చు.
ప్రముఖ పెట్టుబడి దారులుసవరించు
వారెన్ బఫెట్ ప్రపంచవ్యాప్తంగా ప్రముఖ పెట్టుబడి దారుల్లో ఒకడు. 2013 ఫోర్బ్స్ మ్యాగజైన్ లో ఈయన ఫార్చూన్ 400 మంది ధనవంతుల జాబితాలో రెండవస్థానం పొందాడు.[1] ఈయన ఎన్నో ఇంటర్వ్యూలలోనూ, వ్యాసాల్లోనూ దీర్ఘకాలిక పెట్టుబడులు ఎలా ఉండాలో ఎన్నో సలహాలు ఇచ్చాడు.
భారతదేశంలో రాధాకిషన్ దమానీ, రాకేష్ ఝున్‌జున్‌వాలా ప్రముఖ పెట్టుబడి దారులుగా పేరు గాంచారు.[2]
మూలాలుసవరించు
- ↑ "Forbes 400: Warren Buffett". Forbes Magazine. Retrieved 1 March 2013.
- ↑ "Top 10 Indian Share Market Investors". 5paisa (in ఇంగ్లీష్). Retrieved 2022-09-21.