బంగారు ముంగిస
బంగారు ముంగిస అనే ఈ చిన్న పురాణ కథల పుస్తకం కరుణ శ్రీ జంధ్యాల పాపయ్య శాస్త్రి గారి కలము నుండి వెలువడిన పురాణ కథల సంపుటి. ఈ పుస్తకం గుంటూరు ది చిల్డ్రన్స్ బుక్ హౌస్ వారి చేత ముద్రించబడి అమ్మబడింది. ఈ పుస్తకములో వివిధ పురాణాల నుండి సంగ్రహించబడిన ఆరు పురాణ కథలు ఉన్నాయి. ఒక్కొకథకి ఒక్కో శీర్షిక పేరు పెట్టారు.
పుస్తకములొ వివరించడిన కథలు
మార్చు- అగ్ని పరీక్ష - ఇందులో అష్టావక్రుడి బ్రహ్మచర్య నిష్ఠకి వదాన్య మహర్షి పెట్టిన పరీక్షకి సంబంధించిన కథ
- మునిమూల్యం - చ్యవన మహర్షి,జాలరులు, నహుష రాజు వృత్తాంతం. జాలరులు నదిలో తపస్సు చేసుకొంటున్న చ్యవన మహర్షిని నహుషుడు వద్దకు తీసుకొని వెళ్తారు.
- జీవనదానం -నాడిఘంగుడు కథ
- తపోబలం - చ్యవన మహర్షి - సుకన్య వివాహ వృత్తాంతం - ఈ కథ దేవి భాగవతం నుండి గ్రహించబడింది
- భీష్మ ప్రతిజ్ఞ - భీష్ముడు తన తండ్రి శంతన మహారాజుకి సత్యవతికి వివాహాం చేయడం కోసం చేసిన ప్రతిజ్ఞ వైనం
- బంగారు ముంగిస కథ : పుస్తక శీర్షికకి సంబంధించిన కథ బంగారు ముంగిస.
బంగారు ముంగిస కథ
మార్చుయుధిష్టరుడు అశ్వమేధ యాగం చేస్తున్నప్పుడు ఒక బంగారు ముంగిస అక్కడకు వచ్చి సక్తుప్రస్థుడు దానగుణానికి సంబంధించిన విశేషాలు చెబుతుంది ఈ ఇతిహాసం జైమిని భారతంలో నుండి గ్రహించబడింది.[1]
మూలాలు
మార్చు- ↑ Latha, Suma (2020-03-11). "Vaartha Online Edition చెలి". Vaartha (in అమెరికన్ ఇంగ్లీష్). Archived from the original on 2022-10-06. Retrieved 2022-10-06.