బంగారు రంగప్పతెలుగు కవి. ఇతడు సా.శ 1770 లో జన్మించాడు. పిల్లలమర్రి పరిసర ప్రాంతాలలో పెరిగాడు. ఇతడు అనేక ద్విపద కావ్యాలు రాశాడు. అందులో బేతాళ చరిత్ర రంగప్పకు మంచి పేరు సంపాదించి పెట్టింది. పద్మనాయకులలో రేచర్ల గోత్రానికి ఆద్యుడైన బేతాళరెడ్డి జీవిత విశేషాలతో కూడిన కథే ఈ బేతాళ చరిత్ర. తొలుత సంస్కృతంలో ఇదే చరిత్రను అన్నసముద్రం చినవీరయ్య అనే ఆయన వ్రాశాడు. ఈ గ్రంథాన్ని ఆధారంగా చేసుకొని, రంగప్ప తెలుగులో బేతాళ చరిత్రను రచించాడు. బేతాళ రెడ్డి పరాక్రమాలు, ఆలయ నిర్మాణాలను కీర్తిస్తూ వ్రాసిన ద్విపద కావ్యం ఇది. కాకతీయ సామ్రాజ్య పతనానంతరం, ఢిల్లీ సుల్తానులను, బహ్మనీ సుల్తానులను అరికట్టి తెలంగాణను పాలించిన వారు రేచెర్ల పద్మనాయకులు. వీరిలో బేతాళ రెడ్డి కూడా ఒకడు.[1]

ప్రస్తుతం బేతాళ చరిత్ర ద్విపద కావ్యం ప్రతులను పరిశోధకులు సేకరించి హనుమకొండ పరిశోధక మండలిలోనూ, అలాగే హైదరాబాదులోని లక్ష్మణరాయ పరిశోధక మండలిలోనూ భద్రపరిచారు.

మూలములు మార్చు

మూలాలు మార్చు

  1. ఆరుద్ర, సమగ్ర ఆంధ్ర సాహిత్యం మూడవ భాగం పేజీ 463, తేది: 2019-11-12