ద్విపద

ద్విపద తెలుగువారి చింతమనమైన ఆస్తి. తెలుగువారి పల్లె పదాలూ, స్త్రీల పదాలూ లాంటివి ద్విపద గణాలన
పద్య విశేషాలు
వృత్తాలు
ఉత్పలమాల, చంపకమాల
మత్తేభం, శార్దూలం
తరళం, తరలము
తరలి, మాలిని
మత్తకోకిల
స్రగ్ధర, మహాస్రగ్ధర
ఇంద్రవజ్రము, ఉపేంద్రవజ్రము
లయగ్రాహి, లయవిభాతి
జాతులు
కందం, ద్విపద
తరువోజ
అక్కరలు
ఉప జాతులు
తేటగీతి
ఆటవెలది
సీసము

ద్విపద తెలుగు ఛందస్సులో ఒకానొక జాతి పద్యరీతి. పద్యం కంటే ద్విపద సామాన్య ప్రజలకు మరింతగా చేరువవుతుంది. తెలుగు సాహిత్యంలో భారత, భాగవత, రామాయణాలు ద్విపద కావ్యాలుగా రచించబడ్డాయి.

లక్షణములుసవరించు

ఇంద్ర గణములు మూఁ డిన గణంబొకటి
చంద్రాస్య ! ద్విపదకుఁ జను చెప్పరేచ

ద్విపదకు ద్విపదకుఁ దెగ జెప్పవలయు
నెపుడు సంస్కృతమున నితర భాషలను

యతుల లోపలఁ బ్రాసయతి దక్క సకల
యతులు చెల్లును బ్రయో గాతి సారమున

ద్విపద తో ద్విపద సంధిల నేకశబ్ద
మపుడు రెంటను గూర్ప నది యయుక్తంబు


  • ఈ పద్యానికి రెండు పాదాలు మాత్రమే ఉంటాయి (అందుకే దీనిని ద్విపద అంటారు)
  • ప్రతిపాదములోనీ మూడు ఇంద్ర గణాలు, ఒక సూర్య గణము ఉంటుంది.

యతిసవరించు

యతి: మూడవ గణం యొక్క మొదటి అక్షరం.

ప్రాససవరించు

ప్రాస: ప్రాస ఉన్న ద్విపదను సామన్య ద్విపద, అదే ప్రాస లేకుండా ద్విపద వ్రాస్తే దానిని మంజరీ ద్విపద అని పిలుస్తారు.

ఉదాహరణలుసవరించు

గోన బుద్దారెడ్డి రచించిన రంగనాథ రామాయణము.

||ద్విపద ||

అపరిమిత ప్రీతినా భగీరథుని

తపమిచ్చమెచ్చనే కందర్ప సంహరుని


గణాలు లెక్కిస్తే... అపరిమి =ఇంద్ర గణము తప్రీతి = ఇంద్ర గణము నాభగీ = ఇంద్ర గణము రథుని = సూర్య గణము

యతి అక్షరాలు పరిమిత ప్రీతినా భగీరథుని

ప్రాస "ప" అక్షరమ్.

మూలాలుసవరించు

"https://te.wikipedia.org/w/index.php?title=ద్విపద&oldid=2672425" నుండి వెలికితీశారు