బంజారా నృత్యం, బంజారా లంబాడీ, సుగాలి గిరిజనుల జీవనంలో నృత్యాలు, ఆటలు, పాటలు ఒక భాగము.నృత్యం ఆంధ్రప్రదేశ్, [1] తెలంగాణలలో గిరిజనులకు తరతరాల నుండి లభించిన పురాతన వారసత్వ సంపద.బంజారాలు హస్త భంగిమల్లో చేసే నృత్యకళ. మహిళలు, పురుషులు వేరు వేరుగా నృత్యాలు చేస్తారు[2].

బంజారా నృత్యం (Banjara dance)
Native nameబంజారా నృత్యం
Genreబారతీయ బంజారా నృత్యం
Instrument(s)
  • Drums (డప్పులు)
  • D.J
OriginBanjara Dance,Andhra Pradesh,Telangana State, India , తెలంగాణ,ఆంధ్రప్రదేశ్ ఇండియా

నృత్యం ప్రత్యేకత

మార్చు
 
2015, ఆగస్టు 15న హైదరాబాదులోని గోల్కొండ కోటలో తెలంగాణ ప్రభుత్వం నిర్వహించిన భారత స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలలో తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో బంజారా కళాకారుల ప్రదర్శన
 
2015, ఆగస్టు 15న గోల్కొండ కోటలో తెలంగాణ ప్రభుత్వం నిర్వహించిన భారత స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలలో తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో బంజారా కళాకారుల ప్రదర్శన

నృత్యం చేసే ముందు ఏ నృత్యం చేయాల్నో ఆలోచించి నిర్ణయానికి వచ్చి అందరు గుండ్రంగా వృత్తాకారంలో నిలబడుతారు.నృత్యానికి నేతృత్వం వహిస్తున్న వారు చెప్పినట్లు నృత్యాలు చేస్తారు.నృత్య బృందంలో పదిహేను నుండి ఇరువై ఐదు వరకు గాని దాని కంటే ఎక్కువ మంది కూడా ఉంటారు.ఎక్కువ శాతం నృత్యాలు కుడివైపు నుండి ప్రారంభిస్తారు.వీరు ప్రతి పండుగ ల్లో,పెళ్ళిల్లో, సేవాలాల్ జయంతి ఉత్సవాల్లో, నృత్యాలు చేస్తూ ఆనందాన్ని పొందుతారు. లంబాడీ ,స్త్రీలు దాదాపు తొమ్మిది, పది పద్ధతుల్లో డప్పు దరువుకు‌ అనుగుణంగా నెమ్మదిగా ఊగుతున్న కదలికలోను రెండు హస్తాలు పైకి క్రిందికి చేస్తూ నృత్యాలు చేస్తారు.

నృత్యంలో రకాలు

మార్చు

నృత్యంలో•ఝాంజ్కాళీ•లంగ్డీపాయి•డోడ్‌పాయి,•మోరేరో, •ఎక్హతేర్,•దిహతేరో మొదలగు నృత్యాలు చేస్తారు.లంబాడీలలో డప్పు లంబాడీలు ఢాలియ్యా అనే ఉప జాతి వారు డప్పులు వాయిస్తారు. పెళ్ళిలు,పండుగలు,దేవాలయాల్లో కార్య పద్ధతులకు అనుగుణంగా డప్పు వాయిస్తారు.డప్పు లంబాడీలు కాళ్ళకు గజ్జెలు కట్టుకొని డప్పు కొట్టుకుంటూ చేసే నృత్యం శ్రోతలను రంజింప చేసి ఆకట్టుకుంటుంది.

మహిళల నృత్యం

మార్చు

బంజారా మహిళలు నృత్యాలు చేసేటప్పుడు  వృత్తాకారంలో  నిలబడి మద్యలో డప్పు వాయించే వాడు,వారి వెంట వచ్చిన చిన్న చిన్న పిల్లలు నిలబడుతారు.ఇంకో రకం దీర్ఘ చతురస్ర ఆకారంలో‌ చేసే నృత్యం డప్పు వాయించే వాడి ముందు నిలబడి పాటలు పాడుతూ వెనుకకు వెళ్ళి ఆ తర్వాత ఆగి మళ్ళీ పాటలు పాడుతూ నృత్యాలు చేస్తూ డప్పు వాయించే వాడి వద్దకు చేరుకుంటారు. ఇలా వెనుక ముందు తిరుగుతున్న కదలికలో రెండు హస్తాలతో నృత్యాలు చేస్తారు దీనినే నేమలి(మోరేరో) నృత్యం అంటారు.మహిళలు పండుగ లేదా ఏదైనా ఉత్సవాల్లో పాల్గొనేందుకు చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ సాంప్రదాయ దుస్తులను ధరిస్తారు. తీజ్ పండుగ ముగింపు సందర్భంగా తీజ్ గంపలను, పవిత్రమైన జలకలశమును మధ్యలో ఉంచి దాని చుట్టూ వలయాకారంలో నిలబడుతారు డీ.జే పాటల  పైన గాని లేదా డప్పుల పైన గాని పాటలు పాడుతూ క్రిందికి వంగి రెండు చేతులతో చప్పట్లు కొట్టి మళ్ళీ పైకి లేచి చేతులు చాపుతూ మళ్ళీ చప్పట్లు కొట్టుతు శబ్దానికి అనుగుణంగా  స్టెప్పులు వేస్తు పాటలు పాడుతుంటే మిగిలిన వారు పాటలను ఆలపిస్తు నృత్యం చేస్తారు. ప్రారంభంలో వీరు వీరి కులదేవత లైన సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్, జగదాంబ దేవిని తలచూ కుంటు పాటలు పాడుతూ వివిధ నాట్య భంగిమలో నృత్యాలు చేస్తారు.

లెంగీ నృత్యం

మార్చు

లెంగీ నృత్యం లంబాడీ,సుగాలి గిరిజనులు హోళిపండుగ సందర్భంగా మహిళలు, పురుషులు లెంగీ నృత్యాలు ప్రదర్శిస్తారు.లెంగీ నృత్యాలు చేసేటప్పుడు డప్పు వాయించే వాడు  మద్యలో ఉండి  నృత్యాలు చేసే వారు చుట్టురా ఉంటారు.అందులో సగం మంది ముందు పాటలు పాడుతారు  తర్వాత మిగిలిన సగం మంది లెంగీ పాటలు పాడుతూ నృత్యాలు చేస్తారు. నృత్య కళాకారులు రంగు రంగుల ఏకరూప దుస్తులు ధరించి కాళ్ళుకు గుజ్జెలు కట్టి చేతుల్లో  రుమాలు గాని కట్టెగాని పట్టు కుంటారు.వివిధ భంగిమల్లో వీరు నృత్యాలు చేస్తారు. ఈ నృత్యంలో పోటీలు నిర్వహించి బహుమతులు కూడా ప్రధానం చేస్తారు.అతి పురాతన మైన నృత్యాలలో లెంగీ నృత్యం ఒకటి ఇది వినోదాన్ని పంచే అందమైన నృత్యకళ.

మూలాలు

మార్చు
  1. Singh, Mahima. "Lambadi Dance – Banjara Folk Dance of Andhra Pradesh – Vasudhaiva Kutumbakam" (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2024-03-10.
  2. web_master (2022-02-08). "Lambadi Dance". TeluguISM - Telugu Traditions (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2024-03-10.