బంజారా మహిళల ఢావ్లో
బంజారా మహిళల ఢావ్లో ఈ ఢావ్లో[1] [2]వినడానికి రాగ యుక్తంగా చేసె మధురమైన శబ్ధాల సమ్మేళనము.ఢావ్లో అనగా బంజారా లంబాడీ మహిళల కన్నీటి గాథలు అని అర్థం.బంజారా లంబాడీ మహిళల హృదయాల లోతుల్లోంచి కరుణభరితమైన బాధ చెరువులా ముంచి కళ్ళలో నీళ్ళు కట్టలు తెంచుకుని జీవనదిలా ప్రవహించే రాగ మధురమైన కన్నీటి భరితమైన గానమునే ఢావ్లో అని అంటారు.ఈ ఢావ్లో బంజారా లంబాడీ గిరిజన మహిళల తరతరాల నుండి వస్తున్న కన్నీటి జాన పద సాహిత్య సంపద.
Native name | బంజారా ఢావ్లో |
---|---|
Genre | బారతీయ బంజారా ఢావ్లో |
Instrument(s) | (మైకులో సామూహికంగా గాని,ఇద్దరు గాని పాటలు పాడుతు ఏడుస్తారు) Band |
Origin | Banjara Visada Gitalu ,Andhra Pradesh,Telangana State, India, తెలంగాణ,ఆంధ్రప్రదేశ్ ఇండియా |
ఢావ్లో ప్రత్యేకత
మార్చుబంజారా లంబాడీ మహిళలు వారి సంస్కృతి సంప్రదాయాలను ప్రతిబింబించే విధంగా మహిళలు సుఖ దుఃఖాలను కీర్తిస్తూ జ్ఞాపకాలను నెమరు వేస్తూ మధురమైన పాటలను నేటి తరానికి అందిస్తూ సమాజంలో గొప్ప కవయిత్రిలుగా,గొప్ప గాయినిలుగా బంజారా చరిత్రలో జానపద సాహిత్యాన్ని కాపాడుతూ తరతరాలకు అందిస్తున్నారు.
ఢావ్లో చేసె సందర్భాలు
మార్చుఈ ఢావ్లో బంజారా మహిళలు (యాడిలు) పాడుతూ ఏడుస్తారు[3].ఢావ్లో మహిళలు వివిధ సందర్భాలలో వివిధ రకాల పాటలు పాడుతూ ఢావ్లో చేస్తారు. ఢావ్లో పెళ్లిలో గాని ఏదైనా విషాద సంఘటనలు, ప్రమాదాలు,విపత్తులు సంభవించినప్పుడు గాని, అత్తారింట్లో ఆడ పడుచుల వేధింపులు భరించలేక గాని,దూరప్రాంతపు బందువులు వచ్చినప్పుడు గాని, తాండ వదిలి కూలినాలికి, బతుకుదెరువు కోసం వెళ్ళినప్పుడు గాని,పెళ్ళి సమయంలో పెళ్ళి కూతురుని అప్పగింతలు చేసెటప్పుడు గాని,పెళ్ళి కూతురు తన అమ్మనాన్న ఇంటికి వచ్చినప్పుడు గాని, పెళ్లి కూతురు ఇంటికి తన అమ్మా,నాన్న,అక్కా,చెల్లెళ్ళు,అన్నాదమ్ములు వెళ్ళినప్పుడు గాని,వరుని ఇంట్లో పెళ్ళివిందు కార్యక్రమంలో వరుని ఇంటి నుండి బయటకు తీసుకోని వచ్చే క్రమంలో గాని, ఈ లంబాడీ యాడీలు ఢావ్లో చేస్తూంటే రాళ్ళకంటే కఠినమైన మనుషుల మనస్సును కరిగించే శక్తి ఈ ఢావ్లోలో ఉంటుందని అనవచ్చును. లంబాడీ యాడీలు తన కొడుకు, కూతురు, తమ్ముడు, చెల్లెలు, అన్నయ్య, అక్కయ్య, అమ్మానాన్న, ఇలా బంధువులందర్ని తలచుకొని ఏడుస్తూ వినడానికి రాగయుక్తంగా చేసే మధురమైన శబ్ధాల సమ్మేళనమే ఈ ఢావ్లో.
ఢావ్లో ప్రాముఖ్యత
మార్చుబంజారా సంస్కృతిలో గోర్ బంజారా మహిళల హృదయాల కన్నీటి గానం ఢావ్లోకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఈ గోర్ బంజారాల మహిళల ఢావ్లో చాలా బాగుంటుంది. ఢావ్లో ఉయ్యాలా లా ప్రారంభమై చివరి ఎత్తు స్థానం వరకు చేరి మళ్ళీ యథాస్థితికి ఉయ్యాల ఏ విధంగా వచ్చునో అదే విధంగా ప్రారంభం, ముగింపు కూడా అంతే అద్భుతంగా ఉంటుంది.మహిళల గొంతులో ఎన్నెన్నో భావాలు, ఆవేదనలు, మరెన్నెన్నో సాదక భాధలను స్వరంతో ప్రతిఫలించిన ధ్వనులను ఎప్పటికీ మర్చిపోలేని రీతిలో ఉంటుంది.ఇంత ప్రాధాన్యతను కలిగిన ఈ ఢావ్లో మనిషి పుట్టిన దగ్గర్నుంచి చనిపోయే వరకూ జరుపుకునే వివిధ రకాల వేడుకల్లో విషాద ఘటనలో ఢావ్లో చేసెటప్పుడు తమ సంబంధీకుల మెడ పట్టి పాడుతూ ఏడ్వడం ఈ లంబాడీ సంస్కృతిలో ఒక భాగం అని చెప్పవచ్చును.ఈ బంజారా సమాజంలో కాబోయే పెళ్లి కూతురుకు పెళ్లి పది పదిహేను రోజుల ముందు నుంచే సాయింత్రం అందరూ తాండ వాసులు భోజనాలు ముగించుకుని పెళ్లి జరిగే అమ్మాయి ఇంటికి తాండలోని,మహిళలు, అమ్మాయిలు,యువతులందరు వెళ్ళుతారు.అందులో కొందరు పాటలు పాడుతుంటే మరికొందరు వధువును ఢావ్లో నేర్పిస్తారు.ఇలా రోజు సాధన చేసి పెళ్లి జరిగే రోజు వరకు వధువుకి ఈ ఢావ్లో కంఠస్థం చేయిస్తారు.వధువు పెళ్ళి మండలంలో వరునితో మూడు ముళ్లు కట్టిన తర్వాత తన భర్త చేతిలో చెయ్యి వేసి ఏడు అడుగులు వేసే సమయ సందర్భంలో వధువు ఢావ్లో ఇలా పాడుతారు. భావేజో ! వరాణే పతియాఓరే,హతేమాయి,హతకడి పగెమాయి పగబేడి ఘాలదేన బాజు హూబరెగి మారోణి భావజో...!! అని వధువు ఢావ్లో చేస్తుంది. వధువు తాను ఇన్ని రోజులు కలిసి మెలిసి ఉన్న తన వదినమ్మతో తన ఆవేదన, భావాలను పూర్వాపరాలను స్మరిస్తూ మదిలోని భావాన్ని వ్యక్తం చేస్తూ నాకు ఇక వరుని చేతిలో ఇచ్చి అప్పజెప్పి పక్కకు జరిగినావు. అని వదినమ్మతో చెపుతూ తన చెల్లెలు తమ్ములు, అన్నాలను పొగడ్తలతో ముంచుతు ఢావ్లో పాడుతుంటే శరీరంలోని రోమాలు నిక్కబొడుచుకొని ఆ బాధాలకు తాళలేక వధువు స్నేహితురాలు,పెళ్లి మండపంలో ఉన్న బందువులు, తాండలోని మహిళలు,యువతులు ఏడుస్తూ భావోద్వేగానికి గురి అవుతారు.
ఢావ్లోలో సంబోధన
మార్చుమహిళలు ఢావ్లో చేసేటప్పుడు మర్యాద పూర్వకంగా సంబోధిస్తూ నాన్నకు - బాపుఓరే / బావెలో /నాయెక నసాబి బాపుఓ అని, అమ్మకు-యాడియెజే అన్నదమ్ములకు- వీరేణా, చెల్లెళ్ళులకు- జావేణో,కొడుకులకు -లడేక, కూతురుకు - లడేకి,వదినమ్మకు-భావేజో,భర్తకు-సాయేబా ఈ విధంగా అందరినీ గౌరవంగా సంబోధిస్తూ ఢావ్లో చేస్తారు.బాధకు ఓదార్పు భార్య ప్రేమను పంచుకునే భర్త ఇలా భార్యాభర్తల బంధం జన్మజన్మల అనుబంధం అంటారు.తనకు పోషించే భర్త మరణించిన తర్వాత భార్య సౌభాగ్యానికి సంతోషానికి గుర్తుగా నిలిచే సింధూరం (టికో) మంగళ సూత్రం ఇప్పటి పుస్త్యా, అప్పటి ఘూగరి కాళ్ళమట్టెలు(చటకి) విడిచి కేవలం సాధారణ దుస్తులు ధరించి మిగిలిన జీవితమంతా మరణించిన భర్తకు గుర్తు చేసుకుంటూ సాయేబా కతిదెక ఓతో తారిమురతే కతి దికాఏని సాయేబా... అని చనిపోయిన భర్తను గుర్తు చేస్తూ అర్థనాధ దుఃఖ స్వరంతో ఢావ్లో చేస్తూంటే ఏడ్వని వారు ఉండరు. మహిళలు ప్రతి వేడుకల్లో ఏదో ఒక సందర్భంలో ఏడ్వడం పురుషుల కంటే మహిళలే కన్నీళ్లు ఎక్కువగా కార్చడం అంటే ఏడ్వడం వలన వారి బాధలు కన్నీళ్లు రూపంలో ధారాళంగా ప్రవహిస్తుంది.కాబట్టి పురుషుల కంటే మహిళలకు హృదయ ఘాతం తక్కువ శాతం ఉంటుందని బంజారా పెద్దల విశ్వాసము.
సజీవంగా ఉంది
మార్చుబంజారా మహిళల జాన పద సాహిత్య సంపద ఢావ్లో నేటికీ సజీవంగానే ఉంది అనేదాట్లో ఎటువంటి సందేహాలు లేదు.
మూలాలు
మార్చు- ↑ telugu, NT News (6 ఆగస్టు 2021). "ఢావ్లో కథల పుస్తకం ఆవిష్కరణ". www.ntnews.com. Retrieved 19 మార్చి 2024.
- ↑ "ఢావ్లో బంజారా మహిళల కన్నీటి గాథలు- రచయిత రాథోడ్ శ్రావణ్". saakshara.in (in ఇంగ్లీష్). Retrieved 8 ఏప్రిల్ 2024.
- ↑ "ట్రావెలాగ్స్ | నెచ్చెలి" (in అమెరికన్ ఇంగ్లీష్). 9 అక్టోబరు 2020. Retrieved 15 మార్చి 2024.