బక్ దివేచా
రమేష్ విఠల్దాస్ 'బక్' దివేచ (1927 అక్టోబరు 18 - 2003 ఫిబ్రవరి 19) భారతీయ టెస్ట్ క్రికెట్ ఆటగాడు . దివేచా ఫాస్ట్-మీడియం లేదా ఆఫ్-బ్రేక్‌లలో బౌలింగ్ చేసే రైట్ ఆర్మ్ బౌలరు, ఉపయోగకరమైన బ్యాటరు.
దస్త్రం:RV Divecha.jpg | ||||||||||||||||||||||||||||||||||||||||
వ్యక్తిగత సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
పూర్తి పేరు | రమేష్ విఠల్‌దాస్ దివేచా | |||||||||||||||||||||||||||||||||||||||
పుట్టిన తేదీ | కడక్‌వాడి, మహారాష్ట్ర | 1927 అక్టోబరు 18|||||||||||||||||||||||||||||||||||||||
మరణించిన తేదీ | 2003 ఫిబ్రవరి 19 ముంబై, మహారాష్ట్ర | (వయసు 75)|||||||||||||||||||||||||||||||||||||||
బ్యాటింగు | కుడిచేతి వాటం | |||||||||||||||||||||||||||||||||||||||
బౌలింగు |
| |||||||||||||||||||||||||||||||||||||||
అంతర్జాతీయ జట్టు సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||
జాతీయ జట్టు | ||||||||||||||||||||||||||||||||||||||||
తొలి టెస్టు (క్యాప్ 57) | 1951 డిసెంబరు 30 - ఇంగ్లాండ్ తో | |||||||||||||||||||||||||||||||||||||||
చివరి టెస్టు | 1952 నవంబరు 28 - పాకిస్తాన్ తో | |||||||||||||||||||||||||||||||||||||||
కెరీర్ గణాంకాలు | ||||||||||||||||||||||||||||||||||||||||
| ||||||||||||||||||||||||||||||||||||||||
మూలం: CricketArchive, 2022 సెప్టెంబరు 3 |
దివేచా గుజరాతీ కుటుంబంలో జన్మించాడు. [1] 1942లో విల్సన్ కాలేజీలో చదువుతున్నప్పుడు క్విట్ ఇండియా ఉద్యమంలో అరెస్టయ్యాడు. ప్రభుత్వం అతనిపై నేరారోపణలేమీ చెయ్యలేదు. ఆ తర్వాత రాజకీయాల్లో చురుకుగా పాల్గొనలేదు. అతని తండ్రి VJ దివేచా క్లబ్ క్రికెటర్, బాంబే క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు, బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియాకు వైస్ ప్రెసిడెంటుగా చేసాడు.
ఆక్స్‌ఫర్డ్‌లోని వోర్సెస్టర్ కాలేజీలో చదువుతున్నప్పుడు దివేచా, ఆక్స్‌ఫర్డ్ యూనివర్శిటీ కోసం నాలుగు సీజన్‌ల పాటు క్రికెట్ ఆడాడు. 1950, 1951లో బ్లూస్ సంపాదించాడు. అతను 1948లో ఆస్ట్రేలియన్‌లకు వ్యతిరేకంగా నార్తాంప్టన్‌షైర్ తరపున ఆడాడు. అలాగే ఆక్స్‌ఫర్డ్‌షైర్ తరపున మైనర్ కౌంటీస్ క్రికెట్ ఆడాడు.
దివేచా 1952లో ఇంగ్లండ్‌లో పర్యటించి 50 వికెట్లు పడగొట్టాడు. అతను సర్రే [1] పై హ్యాట్రిక్ సాధించాడు. తర్వాతి మ్యాచ్‌లో గ్లామోర్గాన్ [2] పై 74 పరుగులకు 8 వికెట్లు తీసి కెరీర్‌లో అత్యుత్తమ గణాంకాలు సాధించాడు. అతను 1951-52, 1952లో ఇంగ్లండ్‌తో, 1952-53లో పాకిస్తాన్‌తో టెస్టులు ఆడాడు, కానీ వాటిలో సాధించినది పెద్దగా లేదు.
భారత దేశీయ క్రికెట్‌లో దివేచా కెరీర్ ఇంగ్లండ్‌లో ఆడినదానితో పోలిస్తే చాలా తక్కువ. 1951-52లో బొంబాయి తరఫున ఒక రంజీ ట్రోఫీ, 1954-55లో మధ్యప్రదేశ్ తరఫున ఒకటి, 1962-63లో సౌరాష్ట్ర తరఫున నాలుగు మ్యాచ్‌లు ఆడాడు. ఈ ఆరు మ్యాచ్‌ల్లో 27.50 సగటుతో 22 వికెట్లు తీశాడు. అతను క్రికెట్ నుండి త్వరగా రిటైరయ్యాక, అతను ప్రముఖ గోల్ఫ్ ఆటగాడు అయ్యాడు.
దివేచా ఆక్స్‌ఫర్డ్‌లో ఎంఏ చదివారు. అతను బర్మా షెల్, మహీంద్రా & మహీంద్రాల్లో ఎగ్జిక్యూటివ్‌గా పనిచేసాడు.
దివేచా దీర్ఘకాలంగా అల్జీమర్స్ వ్యాధితో బాధపడి మృతి చెందాడు.
ప్రస్తావనలు
మార్చు- ↑ Guha, Ramachandra (2005). The States of Indian Cricket: Anecdotal Histories (in ఇంగ్లీష్). Permanent Black. p. 42. ISBN 978-81-7824-108-1.
- ^ Richard Cashman, Patrons, Players and the Crowd (1980), p. 87
- ^ Obituary in Wisden Cricketer's Almanack 2004
- Obituary in Indian Cricket 2004
- Christopher Martin-Jenkins, The Complete Who's Who of Test Cricketers