బట్టేల్‌గుట్ట కోట

బట్టేల్‌గుట్ట కోట అనేది తెలంగాణ రాష్ట్రం, రంగారెడ్డి జిల్లా, బాలాపూర్ మండలం, బడంగ్‌పేట్ గ్రామం, సుబ్రమణ్యం కాలనీలోని గుట్టపై ఉన్న కోట. నిజాం కాలంలో సరిహద్దు రక్షణ కోసం పోలీసు పహరా నిమిత్తం నిర్మించిన వృత్తాకారపు కోట ఇది.[1]

బట్టేల్‌గుట్ట కోట
బడంగ్‌పేట్
బాలాపూర్ మండలం
రంగారెడ్డి జిల్లా
తెలంగాణ
రకముకోట, పార్కు
స్థల సమాచారం
సాధారణ ప్రజలకు ప్రవేశానుమతిఅవును
స్థల చరిత్ర
వాడిన వస్తువులురాతి

చర్రిత

మార్చు

వందల ఏళ్ళ క్రితం సైనిక స్థావరానికి నిలయంగా ఉన్న బడంగ్‌పేట చుట్టూ పెద్ద కోట బురుజులు, గ్రామ ప్రధాన కూడలిలో నిజాం నాకా ఉండేది. ఇక్కడ వజ్రాలు, వైఢూర్యాలు అమ్ముకునే వారని పూర్వీకులు చెబుతుండేవారు. గ్రామ ప్రధాన కూడలిలో ఉన్న నిజాం నాకాను కొంతకాలంపాటు బడంగ్‌పేట గ్రామ పంచాయతీ కార్యాలయానికి ఉపయోగించారు.

అభివృద్ధి పనులు

మార్చు

దీనిని పర్యాటక ప్రాంతంగా మార్చేందుకు తెలంగాణ ప్రభుత్వం 1.10 కోట్ల రూపాయలు కేటాయించి గుట్ట చుట్టూ పచ్చని చెట్లు, పూల మొక్కలు, పార్కు మధ్యలో గౌతమ బుద్ధుడి విగ్రహం, గుట్ట చుట్టూ ఫెన్సింగ్‌, వాకింగ్‌ ట్రాక్‌లు, పార్కులో వివిధ రకాల జంతువులు-పక్షుల విగ్రహాలు, యోగా కేంద్రం ఏర్పాటు చేసింది.[2]

మూలాలు

మార్చు
  1. ABN (2021-03-01). "బట్టేల్‌గుట్ట.. ఇక బ్యూటీఫుల్‌..!". Andhrajyothy Telugu News. Archived from the original on 2022-12-14. Retrieved 2022-12-14.
  2. telugu, NT News (2022-12-12). "గోల్కొండలా..బట్టేల్‌గుట్ట కోట..!". www.ntnews.com. Archived from the original on 2022-12-12. Retrieved 2022-12-14.