బత్తుల కామాక్షమ్మ
బత్తుల కామాక్షమ్మ (జ:1886 - మ:1969) ప్రముఖ సంఘ సేవకురాలు.[1][2]
జీవిత విశేషాలు
మార్చుఈమె రాజమండ్రిలో వెంకటరత్నం, సీతాయమ్మ దంపతులకు జన్మించింది. ఈమెకు బాల్యంలోనే వైధవ్యం ప్రాప్తించగా తన జీవితాన్ని మానవ సేవకు అంకితం చేశారు. ఈమె ఆంధ్ర విశ్వవిద్యాలయము నుండి విద్వాన్ పరీక్ష ఉత్తీర్ణురాలయ్యారు. ఈమె తీర్థయాత్రలు నిర్వహించి సుమారు 1200 కిలోమీటర్లు ప్రయాణించి బదరీ యాత్ర చేసారు. వీనిద్వారా దేశంలో ప్రబలంగా ఉన్న నిరక్షరాస్యతను గుర్తించారు. రాజమండ్రి కేంద్రంగా ఈమె విద్యావ్యాప్తికి, స్త్రీల అభివృద్ధికి కృషిచేశారు. కాకినాడలో 1920 లో ఆంధ్రదేశ వైశ్య స్త్రీలసదనము స్థాపించారు. ఈమె సాగించిన నిస్వార్థ సేవకు గాను 1941 సంవత్సరంలో గృహలక్ష్మి పత్రికవారు గృహలక్ష్మి స్వర్ణకంకణం పతకాన్ని ఇచ్చి సన్మానించారు. రాజమండ్రి పౌరులు ఈమెకు షష్టిపూర్తి సందర్భంగా గొప్ప ఉత్సవాన్ని జరిపి శ్రీ కామాక్షి విజయ సంచిన అనే పేరుతో ప్రచురించారు.[3]
ఈమె 1969 ప్రాంతంలో పరమపదించారు.