బదనికవేరు
మర్రి మొదలగు చెట్లకు వేర్లు చెట్టు పై భాగాన పుట్టి భూమిలో పాతుకొనేందుకు భూమి వైపుకు సాగుతాయి, ఇటువంటి వేర్లను ఆగంతుకవేర్లు లేక ఊడలు అంటారు. కాని తీగజాతి చెట్లు ఇతర చెట్ల పైకి పాకి పై భాగాన పుట్టిన వేర్లతో ఆ చెట్టును మరింత బలంగా పట్టుకునేందుకు ఉపయోగించుకుంటాయి, అటువంటి వేర్లను బదనికవేర్లు అంటారు. మిరియాల తీగకు ఊడల వలె వేళ్లు పుట్టినను అవి భూమిలోనికి దిగవు. అవి విస్తారముగా పొడవుగా కూడా పెరుగవు. తీగ దేని మీద ప్రాకుచున్నదో దానినే అంటి పెట్టుకొని ఉండి తీగను క్రిందికి పడిపోకుండా చూచుకుంటుంది. బదనిక మొక్కల వేరులు భూమిలోనికి దిగక, బదనిక మొక్క ఏ చెట్టు మీద పెరుగుచున్నవో ఆ చెట్టు లోపలికి వేరులు చొచ్చుకొని పోయి, అవి సంపాదించుకున్న ఆహార పదార్థములని ఇవి తస్కరిస్తాయి. ఇట్లు పరాన్న భక్కులగుటయే వీని పని, వీనినే బదనిక వేరులు అంటారు.[1]
ఇవి కూడా చూడండి
మార్చుమూలాలు
మార్చు- ↑ "వేర్లలో రకాలు - haustorial roots". Archived from the original on 2005-09-06. Retrieved 2015-08-18.
ఆధారాలు
మార్చు- P.M. Kirk; P.F. Cannon; D.W. Minter; J.A. Stalpers (30 November 2008). Dictionary of the Fungi. CABI. p. 306. ISBN 978-0-85199-826-8. Retrieved 25 October 2012.