బద్రీ నారాయణ్

తెలంగాణ రాష్ట్రానికి చెందిన చిత్రకారుడు, రచయిత, కథకుడు.

బద్రీ నారాయణ్ (1929, జూలై 22 - 2013, సెప్టెంబరు 23) తెలంగాణ రాష్ట్రానికి చెందిన చిత్రకారుడు, రచయిత, కథకుడు.[1]

బద్రీ నారాయణ్
జననం(1929-07-22)1929 జూలై 22
సికింద్రాబాద్, తెలంగాణ
మరణం2013 సెప్టెంబరు 23(2013-09-23) (వయసు 84)
బెంగళూరు, కర్ణాటక
జాతీయతభారతీయుడు

జననం మార్చు

నారాయణ్ 1929, జూలై 22న తెలంగాణ రాష్ట్రంలోని సికింద్రాబాదులో జన్మించాడు.[2] 13 సంవత్సరాల వయస్సులో తన తల్లిని కోల్పోయిన నారాయణ్, అమ్మమ్మ ఇంట్లో పెరిగాడు.

కళారంగం మార్చు

నారాయణ్ శిక్షణ లేకుండా పెయింటింగ్ వేయడం ప్రారంభించాడు. 1949లో తొలిసారిగా చిత్రకళా ప్రదర్శన నిర్వహించాడు. 1954లో సోలోగా చిత్రకళా ప్రదర్శన నిర్వహించాడు. దాదాపు 50కి పైగా సోలో ప్రదర్శనలు చేశాడు. పిల్లల పుస్తకాలకు చిత్రాలు గీశాడు. చిన్నచిన్న కథలు, పద్యాలు రాశాడు. ఇతడి గురించి ముంబై ఆల్ ఇండియా రేడియోలో డాక్యుమెంటరీ కూడా వచ్చింది.[3]

పురస్కారాలు మార్చు

  1. 1987: పద్మశ్రీ పురస్కారం
  2. 1990: మహారాష్ట్ర గౌరవ పురస్కారం

మరణం మార్చు

బద్రీ నారాయణ్ 2013, సెప్టెంబరు 23న అనారోగ్యం కారణంగా బెంగుళూరులోని ఒక ఆసుపత్రిలో మరణించాడు.

చిత్రకారుడిగా మార్చు

  • శాంతా రామేశ్వర్ రావు రచించిన మహాభారతం; బద్రి నారాయణ్ దృష్టాంతాలు. (1985, ఓరియంట్ లాంగ్‌మన్)
  • లక్ష్మీ లాల్ రచించిన రామాయణం, బద్రీ నారాయణ్ (1988, ఓరియంట్ లాంగ్‌మన్)

మూలాలు మార్చు

  1. "Paintings by Indian artists Purkhu and Badri Narayan will headline Neue Auctions' Feb. 20 online sale". ArtfixDaily (in ఇంగ్లీష్). Archived from the original on 2021-04-14. Retrieved 2022-01-27.
  2. "Badri Narayan and what it means to be a modern Indian artist". Mintlounge (in ఇంగ్లీష్). 2021-06-14. Archived from the original on 2022-01-07. Retrieved 2022-01-27.
  3. Das&, Soumitra. "Life of a modernist rooted in tradition". www.thehindubusinessline.com (in ఇంగ్లీష్). Archived from the original on 2021-04-21. Retrieved 2022-01-27.

బయటి లింకులు మార్చు