బయోగ్యాస్
బయోగ్యాస్ తరగని శక్తి వనరు. బయోగ్యాస్ ప్రధానంగా పశువుల పేడ, మురుగు నీరు, పంటల అవశేషాలు, కూరగాయల వ్యర్థ పదార్థాలు, నీటి మొక్కలు, పౌల్ట్రీ వ్యర్థ పదార్థాలు, పందుల ఎరువు మొదలైన వాటివల్ల తయారవుతుంది. మొక్కలు, జంతువుల శరీరాల్లోని పదార్థాలని జీవ ద్రవ్యరాశి అంటారు. ఈ జీవులు చనిపోయినపుడు వాటిలోని జీవ ద్రవ్యరాశిని గృహావసరాలకు ఇంధనంగా ఉపయోగించవచ్చు.
ఎలా తయారవుతుంది?
మార్చుజంతువుల, మొక్కల వ్యర్థ పదార్థాలు అనయిరోబిక్ సూక్ష్మజీవులచే నీటి సమక్షంలో తేలికగా క్షయీకరింపబడతాయి. ఈ ప్రక్రియలో మీథేన్, కార్బన్ డై ఆక్సైడ్, హైడ్రోజన్ సల్ఫైడ్ మొదలైన వాయువులు యేర్పడతాయి. ఈ వాయులువ మిశ్రమాన్ని బయోగ్యాస్ అంటారు. ఉత్తమ ఇంధనమైన మీథేన్ దీనిలో సుమారు 65% ఉంటుంది. గ్యాస్ పొయ్యిలలో ఉష్ణానిచ్చుటకు బయోగ్యాస్ ని ఇంధనంగా వాడవచ్చు.
ఉపయోగాలు
మార్చు- వీధి దీపాలు వెలిగించటానికి
- యంత్రాలు నడపడానికి
- వంటలకు
- దీపాలకు, యాంత్రిక శక్తికి, వ్యవసాయానికి, గ్రామీణ పరిశ్రమలకు అవసరమైన విద్యుత్ తయారీకి
గ్రామాలలో ఎలా తయారు చేయవచ్చు
మార్చునిత్యము జంతువుల పేడ నీరు మిశ్రమాన్ని బయోగ్యాస్ ప్లాంట్ లో పోస్తారు. నిరంతరాయంగ బయోగ్యాస్ ను పొందడానికి నిర్ణీత క్రమం ప్రకారం వ్యర్థ జీవ ద్రవ్యరాశిని బయోగ్యాస్ ప్లాంట్ లో వెయ్యాలి. మానవ విసర్జికాలను కూడా దీనిలోకి పంపించవచ్చు. ఉత్పత్తి అయిన బయోగ్యాస్ ను పైపుల ద్వారా వినియోగదారులకు అందిస్తారు. కొన్ని ప్రాంతాలలో పెద్ద బయోగ్యాస్ ప్లాంట్ల లోనికి ఇండ్ల లోని మురుగు నీటిని కూడా పంపిస్తారు. ఈ విధంగా చేయడం వల్ల మన కవసరమయ్యే గ్యాస్ ను పొందడమే కాకుండా జల కాలుష్యాన్ని నివారించవచ్చు. పెద్ద పెద్ద పట్టణాలలో మురుగునీరు నదుల్లోకి వదులుతున్నారు. మురుగు నీటి నుండి పుష్కలంగా లభించే బయోగ్యాస్ (84% మీధేన్) ను విద్యుదుత్పాదనకు వినియోగించవచ్చు.
ఇతర ఉపయోగాలు
మార్చుబయోగ్యాస్ పొగలేని మంటతో హెచ్చు ఉష్ణాన్ని ఇస్తుంది. గ్రామాల్లో బయోగ్యాస్ ప్లాంట్ల వల్ల పారిశుధ్యము మెరుగుపడి పర్యావరణ కాలుష్యం తగ్గుతుంది. గృహోపయోగానికి ఇది సౌలభ్య ఇంధనం. వాయువు విడుదలైన తర్వాత ఉప ఫలంగా అడుగున మిగిలెడి ద్రవ పదార్థం ఎక్కువగా నైట్రోజన్, పాస్ఫరస్ సంయోగ పదార్థాలున్న మంచి పోషక ఎరువు. బయోగ్యాస్ వాడటం వల్ల శిలాజ ఇంధనాలు, కట్టెలు మీద ఆధార పడటం తగ్గుతుంది.
యితర లింకులు
మార్చు- Online Gas Booking
- European Biogas Association
- American Biogas Council
- Spanish Biogas Association / Asociación Española de Biogas
- Biogas Video Book
- Biogas Videos on YouTube
- An Introduction to Biogas, University of Adelaide
- Biogas from manure and waste products - Swedish case studies
- The largest danish plant Lemvig Biogas – renewable energy and a sound economy
- An overview of biogas purification technologies
- Biogas Bonanza for Third World Development
- Biogas China
- Small Scale Biogas Plants
- Biogas Wiki with a lot of useful information about basic principles and documentation from projects of various sizes Archived 2012-05-03 at the Wayback Machine
- Micro Biogas Production in Kenya