బయోలాజికల్ ఇ
బయోలాజికల్ ఇ. లిమిటెడ్ (ఆంగ్లం: Biological E. Limited, ) (బయోఇ అని కూడా పిలుస్తారు) తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాదులో ఉన్న భారతీయ బయోటెక్నాలజీ, బయోఫార్మాస్యూటికల్ కంపెనీ. ఇది వ్యాక్సిన్ ఉత్పత్తి రంగంలో తక్కువ-ధరలతో ప్రత్యేకత సంతరించుకుంది.[2]
రకం | ప్రైవేట్ కంపెనీ |
---|---|
పరిశ్రమ | బయోటెక్నాలజీ, బయోఫార్మాస్యూటికల్స్ |
స్థాపన | 1953 |
స్థాపకుడు | దాట్ల వెంకట కృష్ణం రాజు |
ప్రధాన కార్యాలయం | జూబ్లీ హిల్స్, హైదరాబాదు, తెలంగాణ, భారతదేశం |
కీలక వ్యక్తులు | మహిమా దాట్ల (మేనేజింగ్ డైరెక్టర్)[1] |
ఉద్యోగుల సంఖ్య | 2500 |
వెబ్‌సైట్ | www |
కరోనా టీకాల తయారీ కోసం అమెరికాకు చెందిన అంతర్జాతీయ అభివృద్ధి సంస్థ (డీఎఫ్‌సీ) నుంచి 50 మిలియన్ డాలర్ల సహాయంతో కార్బెవాక్స్ టీకాను తయారుచేసారు. వీటికి 5 నుంచి 12 ఏళ్ల పిల్లలకు అత్యవసర వినియోగానికి జాతీయ ఔషధ నియంత్రణ సంస్థ (డీజీసీఐ) అనుమతి లభించింది.[3] జీనోమ్ వ్యాలీలో కూడా తన కార్యకలాపాలును ప్రారంభించింది.
చరిత్ర
మార్చుఈ సంస్థను 1953లో డాక్టర్ డి.వి.కె. రాజు, జి.ఎ.ఎన్. రాజు కలిసి బయోలాజికల్ ప్రొడక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ ప్రారంభించారు. భారతదేశంలో బయోలాజికల్ ఉత్పత్తులను తయారు చేసిన మొదటి ప్రైవేట్ రంగ సంస్థలలో ఇది ఒకటి.[4] ఇది భారతదేశంలో హెపారిన్ ఉత్పత్తిని ముందుగా చేసింది.[5]
1960వ, 70వ దశకాలలో బయోలాజికల్ ఇ దగ్గు, డైజెస్టివ్ ఎంజైమ్‌లలో సూత్రీకరణల (formulations) ను అభివృద్ధి చేసింది. యాంటీ-టెటానస్ సీరమ్‌ను తయారు చేయడం ప్రారంభించింది. క్షయ వ్యాధి (Tuberculosis) కి మందులు, అలాగే టిటి, డిటిపి వ్యాక్సిన్‌లను కూడా మొదలుపెట్టింది.[6]
బయోలాజికల్ ఇ తక్కువ-ధర వ్యాక్సిన్‌ల తయారీలో ప్రఖ్యాతిగాంచింది. ఈ కంపెనీ 2008లో దాని ప్రధాన వ్యాక్సిన్ ఉత్పత్తి అయిన పెంటావాలెంట్ (DTP Hib HepB) తయారీని ప్రారంభించింది.[6] అంతర్జాతీయ అభివృద్ధి, సహాయ సంస్థలయిన డబ్ల్యూ.హెచ్.ఒ, యునిసెఫ్, బి.ఎమ్.జి.ఎఫ్ వంటి వాటికి బయోలాజికల్ ఇ వ్యాక్సిన్‌ల ప్రధాన సరఫరాదారు.[6]
కోవిడ్-19 వ్యాక్సిన్ అభివృద్ధి
మార్చుకరోనా వైరస్ (COVID-19) మహమ్మారి సమయంలో వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేయడానికి బేలర్ కాలేజ్ ఆఫ్ మెడిసిన్, టెక్సాస్ చిల్డ్రన్స్ హాస్పిటల్, డైనవాక్స్ టెక్నాలజీస్ లతో బయోలాజికల్ ఇ ఒప్పందం కుదుర్చుకుంది.[7][8] కార్బెవాక్స్[9] (Corbevax) /బయో ఇ కోవిడ్-19 వ్యాక్సిన్ 2021లో నెలకు 75 నుండి 80 మిలియన్ డోస్‌లను తయారు చేసింది. క్వాడ్ (Quadrilateral Security Dialogue) చొరవతో 2022 చివరి నాటికి ఒక బిలియన్ డోస్‌లకు ఉత్పత్తి చేరుకుంటుందని అంచనా వేసారు.[10][11] 2020 ఆగస్టులో ఈ కంపెనీ తన హైదరాబాదు ఫెసిలిటీ యూనిట్లో రెండో వ్యాక్సిన్ తయారు చేయడానికి జాన్సన్ & జాన్సన్‌తో ఒప్పందం కుదుర్చుకుంది.[12] 2021 ఫిబ్రవరిలో ఏటా 600 మిలియన్ డోస్‌ల సింగిల్-డోస్ జాన్సెన్ వ్యాక్సిన్ (Janssen COVID-19 vaccine) ను ఉత్పత్తి చేస్తామని ప్రకటించింది.[13][14]
మూలాలు
మార్చు- ↑ "Hyderabad's Biological E: The Dark Horse In India's Vaccine Race". Forbes India (in ఇంగ్లీష్). Retrieved 24 May 2021.
- ↑ "Biological E cuts children's vaccine price by 30%". thehindubusinessline.com/. Retrieved 19 April 2013.
- ↑ "బయోలాజికల్-ఇ మరో రూ.1800 కోట్ల పెట్టుబడి". web.archive.org. 2022-07-25. Archived from the original on 2022-07-25. Retrieved 2022-07-25.
{{cite web}}
: CS1 maint: bot: original URL status unknown (link) - ↑ "Biological E Limited" (PDF). icra.in. Retrieved 13 March 2012.
- ↑ "Setting up manufacturing facilities for Pneumococcal Conjugate Vaccine" (PDF). www.tdb.gov.in. Technology Development Board. Retrieved 25 April 2021. This article incorporates text from this source, which is in the public domain.
- ↑ 6.0 6.1 6.2 "Setting up manufacturing facilities for Pneumococcal Conjugate Vaccine" (PDF). www.tdb.gov.in. Technology Development Board. Retrieved 25 April 2021. This article incorporates text from this source, which is in the public domain.
- ↑ Leo, Leroy (16 November 2020). "Biological E initiates human trials of vaccine". mint.
- ↑ "Coronavirus | Biological E. inks pacts with Johnson & Johnson, Baylor College of Medicine on vaccine". The Hindu (in Indian English). 13 August 2020. Retrieved 21 March 2021.
- ↑ Bharadwaj, Swati (3 June 2021). "Bio E to get Rs 1,500 crore advance from government to reserve 30 crore doses of Corbevax". The Times of India (in ఇంగ్లీష్). Archived from the original on 3 June 2021. Retrieved 2021-06-03.
- ↑ "Meet Bio E: India's Oldest Private Vaccine Maker Making 1 Billion Covid Doses". IndiaTimes (in Indian English). 2021-05-02. Retrieved 24 May 2021.
- ↑ "Biological E covid vaccine: Biological E set for Covid vaccine rollout by August". The Times of India (in ఇంగ్లీష్). Retrieved 24 May 2021.
- ↑ "Biological E to manufacture Janssen's Covid-19 vaccine". www.pharmaceutical-technology.com. Retrieved 24 May 2021.
- ↑ "Biological E looking to make 600 million Johnson and Johnson vaccine shots a year". The Times of India (in ఇంగ్లీష్). Retrieved 21 March 2021.
- ↑ Leo, Leroy (20 March 2021). "Biological E: The mass producer of Johnson & Johnson vaccine". mint (in ఇంగ్లీష్). Retrieved 21 March 2021.