బయ్యారపు ప్రసాదరావు

బయ్యారపు ప్రసాదరావు డీజీపీ. గుంటూరు జిల్లా తెనాలి మండలం తేలప్రోలులో 1955 సెప్టెంబర్‌ 11న జన్మించారు. తండ్రి శ్రీనివాసరావు (కానిస్టేబుల్‌). తల్లి సుశీలమ్మ. ప్రాథమిక విద్యను నర్సరావుపేట ఉరవకట్టలోని మున్సిపల్‌ ఎలిమెంటరీ స్కూల్‌లో, ప్రాథమికోన్నత విద్యను తెనాలికి 20 కి.మీ దూరంలోని కొల్లూరు జిల్లా పరిషత్‌ హైస్కూల్లో పూర్తి చేశారు. విజయవాడలోని లయోలా కాలేజీలో ఇంటర్‌ పూర్తి చేశారు. బీఎస్సీ తరువాత 1977లో మద్రాస్‌ ఐఐటీ నుంచి ఎమ్మెస్సీ పట్టా పొందారు. 1979లో మొదటి ప్రయత్నంలోనే ఐపీఎస్‌కు ఎంపికయ్యారు. ఐపీఎస్‌గా నియమితులై పోలీసు అధికారిగా బాధ్యతలను నిర్వర్తిస్తూ కూడా ప్రసాదరావు ఉన్నత చదువులను అభ్యసించారు. కాంతి తరంగ సిద్ధాంతంపై పరిశోధనలు చేశారు. జాతీయ, అంతర్జాతీయ స్థాయి సదస్సుల్లో తన పరిశోధనలను ఆవిష్కరించారు. జవహర్‌లాల్‌ నెహ్రూ టెక్నికల్‌ యూనివర్సిటీ (జేఎన్‌టీయూ) హైదరాబాద్‌, విశాఖపట్నం యూనివర్సిటీలలో విజిటింగ్‌ ఫ్రొఫెసర్‌గా కూడా బాధ్యతలను నిర్వర్తించారు. ఫిజిక్స్ అంటే ఉన్న మక్కువతో ఆయన తరంగ సిద్దాంతం, బిగ్‌బ్యాంగ్ థియరీలపై రిసెర్చ్ చేస్తూనే ఉండేవారు.

బయ్యారపు ప్రసాదరావు
జననం(1936-09-08)1936 సెప్టెంబరు 8
తేలప్రోలు గ్రామం, తెనాలి మండలం, గుంటూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
మరణం2021 మే 11(2021-05-11) (వయసు 65)
అమెరికా
జాతీయత భారతదేశం
వృత్తిఐ.పి.ఎస్ (మాజీ డీజీపీ ఆంధ్రప్రదేశ్)
జీవిత భాగస్వామిసౌమిని
పిల్లలువికాస్(కొడుకు), సౌమ్య (కోడలు)
పురస్కారాలు1997లో పోలీస్‌ మెడల్, 2006లో రాష్ట్రపతి మెడల్‌

మరణం మార్చు

ఆయన 2013 సెప్టెంబరు 30 నాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డి.జి.పిగా బాధ్యతలు స్వీకరించారు. ఆయన 2021 మే 10వ తేదీన‌ గుండెపోటుతో అమెరికాలో మరణించాడు.[1] [2] ఐదుగురు సంతానంలో ప్రసాదరావు పెద్దవారు. ఆయనకు ముగ్గురు చెల్లెళ్లు, ఒక తమ్ముడు ఉన్నారు.

మూలాలు మార్చు

  1. Sakshi Education (11 May 2021). "మాజీ డీజీపీ ప్రసాదరావు కన్నుమూత". www.sakshieducation.com. Archived from the original on 15 మే 2021. Retrieved 15 May 2021.
  2. Andhrajyothy (11 May 2021). "విశ్రాంత డీజీపీ ప్రసాదరావు కన్నుమూత". www.andhrajyothy.com. Archived from the original on 15 మే 2021. Retrieved 15 May 2021.