తెనాలి

ఆంధ్ర ప్రదేశ్, గుంటూరు జిల్లా, తెనాలి మండలం లోని పట్టణం

ఈ వ్యాసం తెనాలి నగరం గురించి; తెనాలి మండలం గురించిన సమాచారం కోసం ఇక్కడ చూడండి.

  ?తెనాలి
ఆంధ్ర ప్రదేశ్ • భారతదేశం
మారుపేరు: ఆంధ్ర పారిస్
Martyrs' Memorial
Martyrs' Memorial
అక్షాంశరేఖాంశాలు: 16°14′34″N 80°38′24″E / 16.2428°N 80.6400°E / 16.2428; 80.6400Coordinates: 16°14′34″N 80°38′24″E / 16.2428°N 80.6400°E / 16.2428; 80.6400
కాలాంశం భాప్రాకా (గ్రీ.కా+5:30)
విస్తీర్ణం 1,64,937 కి.మీ² (63,683 చ.మై)[1]
జిల్లా(లు) గుంటూరు జిల్లా
జనాభా
జనసాంద్రత
16.58[2] (2011 నాటికి)
• 0/కి.మీ² (0/చ.మై)
భాష(లు) తెలుగు
శాసనసభ సభ్యుడు annabathuni sivakumar
పురపాలక సంఘం తెనాలి పురపాలక నంఘం
కోడులు
పిన్‌కోడు
టెలిఫోను

• 522201
• ++91-8644
వెబ్‌సైటు: http://manatenali.co.in/index.jsp


తెనాలి (Tenali), ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గుంటూరు జిల్లాలోని ఒక నగరం,అదే పేరుగల మండలానికి కేంద్రం.[1] ఈ నగరాన్ని ఆంధ్ర పారిస్' అని కూడా పిలుస్తారు.[3] ఈ నగరం ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంతంలొని ముఖ్యమైన నగరం.[4]

స్థల నామకరణసవరించు

తెనాలి లోని మూడు కాలువల వలన తెనాలికి ఆ పేరు వచ్చింది. మూడు కాలువలను హిందీ భాషలో తీన్ నాల్ అంటారు. మూడును తీన్ అనీ కాలువను నాల్ అనీ అంటారు. ఆ తీన్ నాల్ (తీన్నాల్) నే తర్వాత తెనాలి అన్నారు. తెనాలికి ప్యారిస్ నగరంలో వలే మెయిన్ రోడ్ కు రెండు వైపులా రెండు పెద్ద కాలువలు ఉన్నాయి. అందుకే తెనాలిని ఆంధ్రా ప్యారిస్ అని అంటారు. తెనాలి గుంటూరు జిల్లాలో రెండవ పెద్ద పట్టణం.

భౌగోళికంసవరించు

 
పినపాడు చెరువు

తెనాలి అక్షాంశ రేఖాంశాలు 16.25° N 80.58° E[5]. సముద్ర తలం నుండి ఎత్తు 11 మీటర్లు (36 అడుగులు). విజయవాడ, గుంటూరు, తెనాలి పట్టణాలు ఒకదానికొకటి 30 నుండి 40 కిలోమీటర్ల దూరంలో ఉండి ఒక సమత్రికోణం లా ఉంటాయి.

జనాభా గణాంకాలుసవరించు

2011 జనాభా లెక్కల ప్రకారం తెనాలి పట్టణ జనాభా 164,937. ఇందులో 81,427 మగవారు, 83,510 ఆడవారు ఉన్నారు. తెనాలి అక్షరాస్యత 75.56% (రాష్ట్రం సగటు 67.41%. 14,340 మంది ఆరు సంవత్సరాలకంటే చిన్నవారైన వారు ఉన్నారు.[1]

విశేషాలుసవరించు

జిల్లా కేంద్రమైన గుంటూరునుండి తెనాలికి 25 కి.మీ (16 మైళ్ళు). కృష్ణానది నుండి వచ్చే మూడు కాలువలు ఈ మండలం గుండా ప్రవహిస్తున్నయి. అందులో ఒక కాలువ పడవల కాలువ కాగా (ఒకప్పుదు ఈ కాలువ ఈ తాలూకాలో ముఖ్యమైన ప్రయాణ మార్గం) మిగిలిన రెండూ ఇక్కడ మంచి వరి పంటకు నీటి సదుపాయాన్ని అందిస్తున్నాయి. గుంటూరు, విజయవాడ, చెన్నై నగరాల రైలు మార్గాలను కలిపే ఒక ముఖ్యమైన రైల్వే జంక్షన్. తెనాలి నుండి నాటక, సినిమా రంగాలలోకి చాలా మంది కళాకారులు రావడం వల్ల దీనిని 'ఆంధ్రా పారిస్' (Andhra Paris) అని అంటుంటారు. కాంచనమాల, కొంగర జగ్గయ్య, గుమ్మడి వెంకటేశ్వరరావు, జమున, శారద, ఘట్టమనేని కృష్ణ, ఎ.వి.ఎస్. వంటి కళాకారులస్వస్థలం తెనాలి.వైకుంఠపురం అను అద్భుతమైన వెంకటేశ్వరస్వామి ఆలయం కలదు

ఆర్ధికంసవరించు

 
కొత్త రఘురామయ్య వ్యవసాయ మార్కెట్ యార్దు
 • సారవంతమైన నల్ల రేగడి నేల, మూడు కృష్ణా కాలువలు, ప్రధాన నగరాలకు దగ్గరగా ఉండడం వలన తెనాలి ముఖ్యమైన వ్యవసాయోత్పత్తి కేంద్రం, వ్యాపార కేంద్రం, కళాకేంద్రంగా అభివృద్ధి చెందింది. చెరకు, వరి, మామిడి ఈ ప్రాంతంలో ముఖ్యమైన పంటలు.
 • అలాగే తెనాలి బంగారు నగల వ్యాపారానికి కూడా పేరుగాంచింది. బంగారపు వ్యాపారానికి ప్రొద్దుటూరు తర్వాత ఆంధ్ర ప్రదేశ్లో అంతటి ప్రాధాన్యత కలది.
 • పట్టణంలో ప్రధాన వ్యాపార కేంద్రాలు - మెయిన్ రోడ్, బోస్ రోడ్, గాంధీ చౌక్.

శాసనసభ నియోజకవర్గంసవరించు

రవాణా సౌకర్యంసవరించు

 
తెనాలి రైల్వేస్టేషను
 
తెనాలి బస్ స్తాడ్ వద్ద ఉన్న విజయవాడ బస్సు

తెనాలి నుండి ఇతర ముఖ్య పటణాలకు తెనాలి బస్ స్టేషన్ నుండి బస్సులు నడపబడుచున్నవి.

చుట్టు ప్రక్కలుసవరించు

 
సత్యన్నారాయణ యూ.డి.ఎ లేక్ పార్క్, చినరావూరు, తెనాలి
 • దగ్గరలోని చిలువూరు ఆంధ్ర ప్రదేశ్లో మొదటి ఇంటర్ నెట్ గ్రామం. ఇచట 'కాట్రగడ్డ ఫొండేషను' వారు ప్రజలకు విశేష సేవలందిస్తున్నారు.
 • ఆషానెట్ అనే స్వచ్ఛంద సంస్థ చింతలపూడి గ్రామంలో నిర్వహించిన సంక్షేమ కార్యక్రమం మంచి ఫలితాలనిచ్చింది[7].
 • కంచెర్ల పాలెం ఒక చరిత్రాత్మకమైన గ్రామం. స్వాతంత్ర్య యోధులు, దానశీలులు ఇక్కడ జన్మించారు. వారి సహకారంతో మంచి గుడులు, సత్రాలు నిర్మించారు.
 • కూచిపూడిలో వాసిరెడ్డి వేంకటాద్రి నాయుడు నిర్మించిన శివాలయము మిగుల ప్రాచుర్యము చెందింది. గుడి గాలిగోపురము చాల ఎత్తయినది.

విద్యా సంస్థలుసవరించు

 
స్పెషల్ పురపాలక సంఘం ప్రాథమిక పాఠశాల, పినపాడు, తెనాలి
 
Government ST బాలికల వసతి గృహము

తెనాలి గుంటూరు జిల్లాలో ఒక విద్యా కేంద్రంగా ఉండేది. 20వ శతాబ్దపు మొదటి రోజుల్లో ఈ జిల్లాలో ఉన్న ఉన్నత పాఠశాలలలో తెనాలి తాలూకా ఉన్నత పాఠశాల పేరు గాంచింది. తెనాలి నుండి రేపల్లె వరకు గల చాల గ్రామాల నుండి స్నాతక విద్య (graduate course) కై చాల మంది విద్యార్థులు తెనాలి వచ్చేవారు. ఆయా ప్రదేశాలలో వివిధ కళాశాలల ఆవిర్భావముతో తెనాలి ప్రాముఖ్యత తగ్గింది. ముద్రాక్షర లేఖనం (టైపు రైటింగు), హ్రస్వ లేఖనం (షార్ట్ హేండు) ప్రాచుర్యంలో ఉన్న కాలంలో కొత్తపేటలో ఉన్న అనేక శిక్షణా శాలలు వివిధ గ్రామాలు, చిన్న పట్టణాలనుండి వచ్చే విద్యార్థులతో నిండి ఉండేవి.

చిరకాలముగా ఈ పట్టణములో ఉన్న విద్యాలయాలుసవరించు

 • asn degree college[8]
 • కె.ఎస్.ఎస్.మహిళా ఇంజనీరింగ్ కళాశాల.
 • తాలూకా జూనియర్ కళాశాల
 • వి.యస్.ఆర్ & ఎన్.వి.ఆర్ కళాశాల
 • జె.యం.జె మహిళా కళాశాల
 • దొడ్డపనేని ఇందిర జునియర్ కళాశాల.
 • మునిసిపల్ బాలుర, బాలికల ఉన్నత పాఠశాలలు.
 • కోగంటి శివయ్య ఉన్నత పాఠశాల
 • చెంచురామానాయుడు ఉన్నత పాఠశాల:- ఈ పాఠశాల 50వ వార్షికోత్సవాలు 2017, మార్చి-4న నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల వాణి పేరుతో ఈ పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీ వేజెళ్ళ ఉమామహేశ్వర్ రూపొందించిన, "రేపటి పౌరుల నేటి పత్రిక" వార్షిక సంచికను శాసనసభ్యులు శ్రీ ఆలపాటి రాజేంద్రప్రసాద్ ఆవిష్కరించారు. [14]
 • నన్నపనేని సీతారామయ్య-సరస్వతమ్మ పురపాలకసంఘ (ఎన్.ఎస్.ఎస్.ఎం) ఉన్నత పాఠశాల, ఐతానగర్:-తెనాలోని ఐతానగర్‌కు చెందిన శ్రీ నన్నపనేని శంకరరావు, కాంటెక్ సాఫ్ట్‌వేర్ సొల్యూషన్‌స్ అను సంస్థకు డైరెక్టరుగా ఉన్నారు. వీరు ఇటీవల కాలం చేసారు. వీరి కుమారుడు శ్రీ శ్రీధర్, తన తండ్రి ఙాపకార్ధం, ఈ పాఠశాలలో ఒక ఆడిటోరియం నిర్మాణానికి అవసరమైన 45 లక్షలను తాను విరాళంగా ఇవ్వడానికి సంసిద్ధతను వ్యక్తం చేయడమేగాక, మొదటి విడతగా పది లక్షల రూపాయలను చెక్కు ద్వారా 2017, ఫిబ్రవరి-19న, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ టక్కర్‌గారికి అందజేసినారు. [12]
 • నన్నపనేని పురపాలక ప్రాథమిక పాఠశాల, రజకపేట.
 • నెహ్రూ నికేతన్
 • శ్రీ సాయి విద్యా సంస్ఠలు
 • వివేక విద్యా సంస్థలు.
 • డాక్టర్ కెకెఆర్ గౌతం కాన్సెప్ట్ స్కూల్.
 • మాంటిస్సోరీ పాఠశాల
 • ఆక్స్ ఫర్డు
 • ఎన్.ఆర్.ఐ
 • శ్రీ యలవర్తి ఆంజనేయశాస్త్రి వేద సంస్కృత పాఠశాల.
 • కె.ఎల్.ఎన్.సంస్కృత కళాశాల
 • ఆపిల్ ఇంగ్లీష్ మీడియం స్కూల్
 
A.S.N.W Eng College, Burripalem Road Tenali.

తెనాలిలో పేరు పొందిన దేవాలయాలుసవరించు

 
వైకుంఠపురం గుడి
 • వైకుంఠ పురం (చిన్న తిరుపతి) :- పద్మావతీ సమేత శ్రీ వేంకటేశ్వర స్వామి వారి దేవస్థానము. దశాబ్దాలుగా తెనాలివారి తమదైన తిరుపతి. సుమారు నలభై సంవత్సరాల క్రితం ఒక పుట్టపై శయనించి ఉన్న వేంకటేశ్వరునికి దేవాలయనిర్మాణం జరిగింది. చుట్టుపక్కల గ్రామాల రైతులందరూ తమ మొదటి పంట (వరి) ని తెచ్చి, పాయసం (పరమాన్నం) వండి, దేవునికి నివేదన చేస్తారు. కేశఖండన తిరుపతి లాగానే సర్వసామాన్యం.
 • శ్రీ గోదా పద్మావతీ సమేత శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయం:- తెనాలి పట్టణంలోని అమరావతీ కాలనీలో ప్రభుత్వ ఆసుపత్రి వద్ద నూతనంగా నిర్మించిన ఈ ఆలయంలో విగ్రహ ప్రతిష్ఠా మహోత్సవాలు, 2017, మార్చి-6వతేదీ సోమవారం నుండి 15వ తేదీ బుధవారం వరకు నిర్వహించెదరు. [13]
 • భవన ఋషి, భద్రవతి మాత ఆలయం, షరప్ బజార్ తెనాలి.
 • విశ్వకర్మ దేవాలయం (కొత్తపేట )
 • శ్రీ మద్విరాట్ పోతులూరి వీర బ్రహ్మేంద్రస్వామి దేవాలయం (గాంధీ చౌక్)
 • దొంగ రాముడి గుడి:- ఒక్క రాత్రిలో దొంగతనంగా కట్టిన గుడి అట. అందుకే ఆ పేరు. మునిసిపల్ ఆఫీసు (గాడి బావి) వద్ద ఉంది. (ఆ గాడి బావి ఈనాడు కానరాదు.
 • కన్యకా పరమేశ్వరి మందిరం:- అమ్మవారి పేరుతో ప్రసిధ్ధమైన శివాలయం. రాజ రాజేశ్వరి అమ్మవారు కూడా వేంచేసి ఉన్నారు. పట్టణ వైశ్య సముదాయముచే నడపబడే ఈ దేవస్థానములో దసరా ఉత్సవము కనుల పండుగగా, పట్టణ సంస్కృతిని ప్రతిబింబించేదిగా ఉంటుంది.
 • పాత శివాలయం, గంగానమ్మ పేట.
 • శ్రీ పర్వతవర్ధనీసమేత రామేశ్వర స్వామి ఆలయం:- స్థానిక గంగానమ్మపేటలోని ఈ ఆలయం, అతి పురాతనమైనదిగా పేరుగాంచింది. త్రేతాయుగంలో పరశురామునిచే క్షత్రియ సంహారం అనంతరం, పాపపరిహారార్ధమై ప్రతిష్ఠించిన శివాలయాలలో ఈ క్షేత్రం గూడా ఒకటిగా విరాజిల్లుతోంది. కశ్యప ప్రజాపతికి దానంగా ఇవ్వబడిన ఆలయంగా ఈ ధామాన్ని చెబుతారు. ఈ దివ్య మందిరంలో శ్రీ పర్వతవర్ధనీ సమేత రామేశ్వర స్వామి కొలువుదీరి ఉన్నాడు. [1]
 • శ్రీ రుక్మిణీ సత్యభామా సమేత శ్రీ గోవర్ధనస్వామివారి ఆలయం:- ఈ ఆలయం స్థానిక నెహ్రూ రహదారిపై ఉన్నది
 • శ్రీ సువర్చలా సమేత పంచముఖ ఆంజనేయ స్వామి ఆలయం {పాత ఆంజనేయ స్వామి ఆలయం}:- తెనాలి పట్టణ నడిబొడ్డున షరాఫ్ బజారులోని ఈ ఆలయం 150 సంవత్సరాల క్రితం నిర్మితమైనది. దక్షిణ భారతదేశంలో నాలుగు ధ్వజస్తంభాలు గల ఏకైక ఆలయం ఇది. ఈ ఆలయంలో ప్రతి సంవత్సరం వైశాఖమాసంలో, హనుమజ్జయంతి సందర్భంగా, స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు, వైభవంగా నిర్వహించెదరు.
 • చిట్టి ఆంజనేయ స్వామి గుడి.ఈ గుడీ శ్రీ రామ నవమీ ఉత్సవాలకి ప్రసిద్ధి.
 • శ్రీ బాలాత్రిపుర సుందరీ సమేత శ్రీ చంద్రమౌళీశ్వరస్వామివారి ఆలయం:- ఈ ఆలయం స్థానిక మారీసుపేటలో ఉంది.
 • అమ్మవారి దేవాలయం, సుల్తానాబాదు.
 • శ్రీ షిర్డీ సాయిబాబా మందిరం:- స్థానిక మారీసుపేటలోని ఈ ఆలయ 15వ ప్రతిష్ఠా మహోత్సవం, 2015, నవంబరు-22వ తేదీ ఆదివారంనాడు వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బాబాను పంచామృతాలతో అభిషేకించారు. ఈ కార్యక్రమానికి భక్తులు పెద్దసంఖ్యలో విచ్చేసారు. [10]
 • మార్వాడి గుడి (జైన దేవాలయం)
 • వేణుగోపాల స్వామి గుడి
 • గంగానమ్మ గుడి:- తెనాలి మారీస్ పేటలోని ఆర్.ఆర్.నగర్ లోని ఈ ఆలయంలో అమ్మవారి 30వ వార్షిక కొలుపులు, 2015, సెప్టెంబరు-6వ తేదీ ఆదివారంనాడు వైభవంగా నిర్వహించారు. [9]
 • అప్పలస్వామి మందిరం
 • పేరంటాలమ్మ గుడి (ఐతానగర్)
 • శ్రీ బసవమందిరం:- ఈ మందిరం తెనాలిలోని నందులపేటలో, వినాయకుని గుడి వీధిలో ఉన్న ఈ మందిరాన్ని 1924లో నిర్మించారు. ఈ మందిర వ్యవస్థాపకులు కీ.శే.శ్రీమతి సోము రాజమ్మ గారు. [11]

శ్రీరామ నవమి సందర్భముగా వసంత నవరాత్రోత్సవాలు జరుగుతాయి. ఈ సమయంలో సుమారు ఒక కి.మీ. పొడవైన పందిరి (చిట్టి ఆంజనేయ స్వామి గుడి నుండి దొంగ రాముడి గుడి వరకు) వేసి చాల ఘనంగా జరుపుతారు. భద్రాచలం తరువాత అంత ఘనంగా చేస్తారని ప్రతీతి. ఇది కాక తెనాలిలో సంవత్సరం పొడవునా పెక్కు ధార్మిక, సాంస్కృతిక ఉత్సవాలు జరుగుతూనే ఉంటాయి. 1511లో కృష్ణదేవరాయలు విజయయాత్రలో భాగంగా తెనాలి ప్రాంతాన్ని సందర్శించారు. ఆ కాలంలో లక్ష్మీవల్లభుడైన గోవర్ధనస్వామి విగ్రహం తెనాలి నగరంలో ప్రతిష్ఠించినట్లు తెనాలి కైఫియ్యత్తులు తెలుపుతోంది. తన విజయయాత్ర సందర్భంగా రాయలు గోవర్ధనస్వామిని దర్శించుకుని అక్కడ ఓ శాసనాన్ని వేయించారు. గోవర్ధనస్వామి పేరిట శాసనం వేయడంతో పాటు ఆయనకు తేలప్రోలు గ్రామాన్ని దానంగా ఇచ్చారు. రాయలు వేసిన శాసనంలో రాయలు, తిమ్మరుసు చేసిన దానధర్మాల వివరాలతో పాటు తెనాలి ప్రాశస్థ్యాన్ని కూడా అభివర్ణించారు. తుంగభద్ర, కృష్ణవేణి నదుల మధ్యనున్న తెనాలి అని సంబోధించిన ఆయన జిల్లాలో నాదెండ్ల, కొండెపాడు లనూ దానం ఇచ్చినట్లు లిఖించారు.[1] ఈనాడు గుంటూరు జిల్లా ఎడిషన్; 2013, జూలై-15; 15వపేజీ.[2] ఈనాడు గుంటూరు సిటీ; 2015, నవంబరు-23; 33వపేజీ.

ప్రసిద్ధులుసవరించు

మరికొన్ని విశేషాలుసవరించు

 • ఆంధ్ర ప్రదేశ్ ప్రాంతంలో మొదటి ముద్రణా యంత్రాలయం "కాకుమాను ప్రెస్" (జానకిరాం బైండింగ్ వర్క్స్) 1930లో స్ధాపించబడినది బ్రహ్మంగారి కాలజ్ఞానం అనే పుస్తకం ప్రచురించబడింది. కాకుమాను జానకీరాం,కాకుమాను అంజయ్య ప్రెస్ స్థాపకులు
 • తెనాలి లింగాకర్షక బుట్టల తయారీకి కూడా ప్రఖ్యాతి చెందివది. రాష్ట్రవ్యాప్తంగా, దేశవ్యాప్తంగా ఈ ఊరి నుండి లింగాకర్షక బుట్టలు సరఫరా జరుగుతుంది
 • తెనాలికి 1901 ముందు వరకూ తాలూకా హోదా లేదు. అప్పట్లో రేపల్లె తాలూకాలో తెనాలి ఉపతాలూకాగా ఉండేది. 1901 నుండి తెనాలికి తాలూకా హోదా కల్పించిన తర్వాత, అందులో రేపల్లె ఉపతాలూకాగా మారింది. 1909 లో తెనాలి రెవెన్యూ డివిజనుగా మారిన తర్వాత, తిరిగి రేపల్లెకు తాలూకా హోదా కల్పించారు.[9]
 • తెనాలికి చెందిన శ్రీ సి.హెచ్.వెంకటరమణ కొన్నేళ్ళుగా ఒడిషా రాష్ట్రంలోని బరంపురంలో స్థిరపడ్డారు. వీరి భార్య శ్రీమతి కె.మాధవి ఉన్నత విద్యావంతురాలు. ఇటీవల జరిగిన ఎన్నికలలో బరంపురం నగరానికి తొలి మహిళా మేయర్ గా ఎన్నికైనారు.[10]
 • తెనాలికి చెందిన సూర్యశిల్పశాలకు చెందిన యువశిల్పకళాకారుడు శ్రీ కాటూరి రవిచంద్ర (తండ్రి-వెంకటేశ్వరరావు), 2013 నవంబరు 7 నుండి ముంబైలోని ఐ.ఐ.టి.ఆవరణలో, దండి సత్యాగ్రహ ట్రస్టు ఆధ్వర్యంలో జరుగనున్న అంతర్జాతీయ స్థాయి వర్కుషాపునకు ఎన్నికైనారు. ఈ వర్కుషాపులో, మహాత్మాగాంధీ ఉప్పుసత్యాగ్రహానికి సంబంధించిన శిల్పాల ప్రదర్శన జరుగును. శ్రీ రవిచంద్ర శిల్పరంగంలో ఎం.ఎఫ్.యే చేశారు.
 • తెనాలి పట్టణం నడిబొడ్డున ఐదున్నర ఎకరాలలో విస్తరించియున్న "పినపాడు చెరువు" పట్టణానికి ఒక అద్భుతమైన సహజ వనరు. కేవలం చెరువుగా ఉంటే దీనికి ఇంత ప్రత్యేకత ఉండదు. అయితే చెరువుకు మధ్యలో సహజంగా ఉండే ద్వీపం (ఐలండ్) గుర్తింపును తెసికొని వచ్చింది. ఇది పట్టణంలోని పురాతన చెరువులలో ఒకటి. [8]
 • రామకృష్ణ మనోహర ఆశ్రమం, సుల్తానాబాదు.
 • శ్రీ వాసవి గోసేవా సమితి, బుర్రిపాలెం రోడ్డు.
 • శ్రీ కాకుమాను శంకరుని ధర్మసత్రం, బోస్ రోడ్.
 • మదర్ థెరెస్సా వృద్ధాశ్రమం, ఐతానగర్.
 • శ్రీరామ విలాస సభ 1921లో తెనాలిలో స్థాపించబడింది.[11]

శాస్త్రి పెన్ వర్క్స్సవరించు

ఒకప్పుడు పెన్ను అంటే ఫౌంటెన్ పెన్'. పూర్వం రెండు మూడు వరుసలు రాయగానే ఇంకు సీసాలో ముంచి వ్రాసేవారు. కాలక్రమేనా సిరాలో ముంచే అవసరం లేకుండా నిబ్ వెనుక ఇంకు రిజర్వాయర్ ఉండేలా పెన్నుని అమెరికా వారు ఆవిష్కరించారు. దీనినే ఫౌంటెన్ పెన్ అంటారు. భారతదేశ వ్యాప్తంగా అనేక చోట్ల వీటి తయారీ జరిగేవి. తెనాలికి ఫౌంటెన్ పెన్నుల తయారీలో ఘన చరిత్ర ఉంది. స్వాతంత్ర్యానికి పూర్వం రాజమండ్రిలోని "రత్నం" పెన్స్ ప్రజాదరణ పొందాయి. ఆ తర్వాత తెనాలి పెన్నులదే రాజ్యం. తెనాలి ఉత్పత్తులైన "సోలార్", "అశోక", "ప్రసాద్" పెన్నులు దశాబ్దాల పాటు విశేష ఆదరణ పొందాయి. తెనాలిలో పౌంటెన్ పెన్స్ తయారీకి ఆధ్యుడు వి.ఎస్.శాస్త్రి. తొలుత ఫాన్సీ షాపు వ్యాపారంతో ప్రారంభించి, పెన్నులు రిపేరు చేస్తూ, క్రమంగా వాటి తయారీపై దృష్టిపెట్టారాయన. 1946లో "శాస్త్రి పెన్ వర్క్స్"ను స్థాపించారు. "సోలార్" బ్రాండ్ పేరుతో పౌంటెన్ పెన్నులు తయారీ చేపట్టారు. పెన్నులకు కావలసిన క్లిప్పులు, పాళీలు, నాలికలను ఇక్కడే రూపొందించేవారు. ఆ రోజుల్లో ఆయన వద్ద 33 మంది వర్కర్లు ఉండేవారు. సోలార్ పెన్ను ధర 1953లో రూ.21 ఉండేది. అనేక మంది జాతీయ నాయకులు ఈ యూనిట్ ను సందర్శించి మెచ్చుకున్నారు. ఈ యూనిట్ 1960లో మూత పడింది.[12]

మూలాలుసవరించు

 1. 1.0 1.1 1.2 "District Census Handbook - Guntur" (PDF). Census of India. pp. 14, 46. Retrieved 28 August 2015.
 2. "Census 2011". The Registrar General & Census Commissioner, India. Retrieved 1 August 2014. Cite web requires |website= (help)
 3. Samuel Jonathan, P (12 November 2008). "Big Cinema comes to Andhra Paris". The Indian Express. Retrieved 1 April 2016.
 4. "Urban Footprints in APCRDA Region". APCRDA. Retrieved 27 June 2016.
 5. Falling Rain Genomics, Inc - Tenali
 6. "MLA". AP State Portal. మూలం నుండి 8 అక్టోబర్ 2014 న ఆర్కైవు చేసారు. Retrieved 13 October 2014. Cite web requires |website= (help)
 7. http://www.ashanet.org/projects/project-view.php?p=675
 8. Wald, Abraham. (2013). Sequential Analysis. Dover Publications. ISBN 1-306-32856-X. OCLC 868280879.
 9. ఈనాడు గుంటూరు రూరల్ జులై 20, 2013.
 10. ఈనాడు గుంటూరు రూరల్, 1 అక్టోబరు 2013. 1వ పేజీ.
 11. నాటక సమాజ దిక్సూచి శ్రీరామ విలాస సభ, (నాటకం-అమరావతీయం), డా. కందిమళ్ళ సాంబశివరావు, ఆంధ్రజ్యోతి, గుంటూరు ఎడిషన్, 23 జనవరి 2017, పుట.14
 12. సాక్షి, 24 డిసెంబరు, 2016 - మీకు తెలుసా - పౌంటెన్ పెన్నుల తయారీకి ఆధ్యుడు వీ ఎస్ శాస్త్రి

బయటి లింకులుసవరించు

వికీమీడియా కామన్స్‌లో కి సంబంధించిన మీడియా ఉంది.
"https://te.wikipedia.org/w/index.php?title=తెనాలి&oldid=2908254" నుండి వెలికితీశారు