బరాక్ క్షిపణి కుంభకోణం
భారతదేశం, ఇజ్రాయిల్ నుండి బరాక్ 1 క్షిపణి వ్యవస్థల కొనుగోలుకు సంబంధించి జరిగిన అవినీతి కేసు, బరాక్ క్షిపణి కుంభకోణం. సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సిబిఐ) ఈ కేసును దర్యాప్తు చేసింది. సమతా పార్టీ మాజీ కోశాధికారి ఆర్‌కె జైన్‌తో సహా పలువురిని అరెస్టు చేశారు.[1] సిబిఐ ఈ కేసును దర్యాప్తు చేసి, 2006 అక్టోబరు 10న ప్రథమ సమాచార నివేదిక (ఎఫ్‌ఐఆర్) దాఖలు చేసింది. రాజకీయ నాయకులు రక్షణ మంత్రి జార్జ్ ఫెర్నాండెజ్, జయా జైట్లీ, ఆర్‌కె జైన్‌లు ఆయుధాల వ్యాపారి అయిన మాజీ భారత నేవీ అధికారి సురేష్ నందా నుండి చంచాలు అందుకున్నారని ఆరోపించారు.
2013 డిసెంబరు 24న, ఏడేళ్లకు పైగా దర్యాప్తు చేసిన తర్వాత, ఆరోపణలకు ఆధారాలు లభించనందున కేసును మూసివేయాలని సిబిఐ నిర్ణయించింది.[2][3][4]
నేపథ్యం
మార్చుబరాక్ క్షిపణి వ్యవస్థను ఇజ్రాయెల్ ఎయిర్‌క్రాఫ్ట్ ఇండస్ట్రీస్ (IAI), రాఫెల్ ఆర్మమెంట్ డెవలప్‌మెంట్ అథారిటీ ఆఫ్ ఇజ్రాయెల్‌లు సంయుక్తంగా అభివృద్ధి చేశాయి.[5] 2000 అక్టోబరు 23న, మొత్తం $199.50 మిలియన్ల వ్యయంతో ఏడు బరాక్ వ్యవస్థలను, $69.13 మిలియన్ల వ్యయంతో 200 క్షిపణులనూ కొనుగోలు చేసేందుకు భారత ప్రభుత్వం ఒప్పందాలపై సంతకం చేసింది. క్షిపణి పనితీరును పరిశీలించేందుకు ఇజ్రాయెల్‌ను సందర్శించిన బృంద సభ్యులతో పాటు, డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్‌కు అధిపతిగా ఉన్న APJ అబ్దుల్ కలాంతో సహా అనేక సమూహాలు అభ్యంతరాలు వ్యక్తం చేసినప్పటికీ ఈ ఒప్పందం జరిగింది. కొన్ని అభ్యంతరాలు పద్ధతికి సంబంధించినవి అయినప్పటికీ, ఈ అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకోలేదని నావికాదళ చీఫ్ అడ్మిరల్ సుశీల్ కుమార్ ఆరోపించారు.
పాత్రికేయుడు సందీప్ ఉన్నితన్ ప్రకారం, "1999 నాటికి, డిఆర్‌డిఓ అభివృద్ధి చేస్తున్న త్రిశూల్ క్షిపణి మోహరింపు (డిఆర్‌డిఓ దీని అభివృద్ధిని నిలిపివేసింది) కనుచూపు మేరలో లేదు. నౌకాదళం బరాక్ క్షిపణి కొనాలనుకుంది. 1999 కార్గిల్ మోహరింపు సమయంలో, శత్రు క్షిపణుల దాడి నుండి తమ యుద్ధనౌకలను రక్షించగల ఏకైక క్షిపణి విధ్వంసక క్షిపణి ఇదే."[6]
ఆపరేషన్ వెస్ట్ ఎండ్
మార్చు2001లో, తెహెల్కా నిర్వహించిన స్టింగ్ ఆపరేషన్ "ఆపరేషన్ వెస్ట్ ఎండ్"లో, ప్రభుత్వం చేసిన 15 రక్షణ ఒప్పందాలు కొన్ని రకాల లంచాలు ఉన్నాయని, బరాక్ క్షిపణి ఒప్పందం వాటిలో ఒకటనీ ఆరోపించింది.[7] రహస్య తెహెల్కా పాత్రికేయుడు, ఆర్కే జైన్ ల మధ్య జరిగిన సంభాషణల లిఖితపత్రాలను బట్టి జైన్, సురేష్ నందా నుండి కోటి రూపాయల లంచం తీసుకున్నట్లు తేలింది.[8]
దర్యాప్తులు
మార్చువాజ్పేయి ప్రభుత్వం దీనిపై విచారణకు కమిషన్‌ను ఏర్పాటు చేసింది. 2004 భారత సార్వత్రిక ఎన్నికల తర్వాత, మన్మోహన్ సింగ్ UPA ప్రభుత్వం 2004 అక్టోబరులో కమిషన్ ఇచ్చిన పాక్షిక నివేదికను తిరస్కరించి, ఈ కేసును దర్యాప్తు చేయడానికి సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (CBI)ను నియమించింది.[9] CBI 2006 అక్టోబరు 9న ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ (FIR) నమోదు చేసింది. ఆ సమయంలో భారత రక్షణ మంత్రిగా ఉన్న జార్జ్ ఫెర్నాండెజ్, మాజీ నేవీ చీఫ్ అడ్మిరల్ సుశీల్ కుమార్‌లకు ఈ కుంభకోణంలో ప్రమేయం ఉందని పేర్కొంది. భారత డిఫెన్స్ రీసెర్చ్ & డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ బరాక్ సిస్టమ్ దిగుమతిని అడ్డుకోవాలని చివరి దాకా భావించిందని ఎఫ్‌ఐఆర్ పేర్కొంది. ఈ ఖర్చులో మూడు శాతం ఫెర్నాండెజ్, జయ జైట్లీలకు లంచంగా ఇచ్చారని, తనకు 0.5 శాతం ఇచ్చారని తెహెల్కాకు RK జైన్ చెప్పినదాన్నే FIR పునరుద్ఘాటించింది. తెహల్కా టేపుల ప్రకారం, మధ్యవర్తి సురేష్ నందా వారికి ఈ కమీషన్లు చెల్లించాడు.[5]
సురేశ్ నందా, అతని కుమారుడు సంజీవ్ నందా, మరో ఇద్దరిని 2008 మార్చి 9న సెక్షన్ 120-బి (నేరపూరిత కుట్ర), సెక్షన్ 201 (సాక్ష్యాలు అదృశ్యమయ్యేలా చేసిన నేరం కింద) కింద "2007లో ఐటి (విచారణలు) డిప్యూటీ డైరెక్టర్ అశుతోష్ వర్మ ప్రాంగణంలో జరిగిన ఐటీ దాడులలో నివేదిక బరాక్ కేసులో నివేదికను తొల్క్కిపెట్టేందుకు అతనికి రూ. 10 కోట్లు ముట్టజెప్పిన అంశానికి సంబంధించిన నేరపూరిత సాక్ష్యాలను వెలికితీసింది."[6][10]
2013 డిసెంబరు 24న, ఏడేళ్లకు పైగా దర్యాప్తు చేసిన తర్వాత, ఆరోపణలపై ఎటువంటి ఆధారాలు లభించనందున, CBI ఈ కేసును మూసివేసి, కోర్టులో నివేదికను దాఖలు చేసింది.[2][3] దానికి ఒకరోజు ముందు, డిసెంబరు 23న, ఎకె ఆంటోనీ నేతృత్వంలోని రక్షణ మంత్రిత్వ శాఖ అదనంగా 262 బరాక్ క్షిపణుల సేకరణకు ఆమోదం తెలిపింది.[4] బిజెపి ప్రతిస్పందిస్తూ, "2001లో అప్పటి బిజెపి నేతృత్వంలోని ఎన్‌డిఎ ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేయడానికి దీన్ని తెహల్కా 'సృష్టించింది'. "తప్పుడు సాక్ష్యాలను సృష్టించినందుకు" తెహెల్కాపై సిబిఐ చర్య తీసుకోవాలని డిమాండ్ చేసింది.[11][5]
మూలాలు
మార్చు- ↑ "Jain arrested five years after Tehelka expose". Zee News (in ఇంగ్లీష్). 2006-02-27. Retrieved 2023-12-29.
- ↑ 2.0 2.1 "CBI files closure report - firstpost". 24 December 2013. Retrieved 24 December 2013.
- ↑ 3.0 3.1 "CBI files closure report". Retrieved 24 December 2013.
- ↑ 4.0 4.1 "Government clears way for Israeli-made Barak missiles". 24 December 2013. Retrieved 7 January 2014.
- ↑ 5.0 5.1 5.2 V. Venkatesan (3 November 2006). "Dubious deal". Frontline. Archived from the original on 25 October 2007. Retrieved 16 June 2007.
{{cite news}}
: CS1 maint: unfit URL (link) - ↑ 6.0 6.1 "The Barak backfire". India Today (in ఇంగ్లీష్). Retrieved 2023-12-29.
- ↑ Chauhan, Neeraj (11 December 2013). "CBI closes Barak scandal case for lack of evidence". The Times of India. Retrieved 7 December 2014.
- ↑ "Tehelka Tapes (transcript)". Tehelka.com. p. 21. Archived from the original on 20 July 2006. Retrieved 17 August 2006.
- ↑ "20 years on, Jaya Jaitly, retired General get 4 years jail for graft". The Times of India. 2020-07-31. ISSN 0971-8257. Retrieved 2023-12-29.
- ↑ "Nandas, IT official and CA arrested". The Hindu. Chennai, India. 9 March 2008. Archived from the original on 14 March 2008. Retrieved 9 March 2008.
- ↑ "CBI should act against Tehelka, says BJP". The Times Of India. 11 December 2013. Archived from the original on 7 జనవరి 2014. Retrieved 7 January 2014.