బరా ఇమాంబారా (ఆంగ్లం: Bara Imambara) లక్నో లో ఉన్న ఒకానొక ఇమాంబారా. దీనిని 1784లో అవధ్ నవాబు అయిన అసఫ్-ఉద్-దౌలా నిర్మించారు. దీనినే అసాఫీ ఇమాంబారా అని కూడా అంటారు. లక్నోలో ఉన్న పర్యాటక ఆకర్షణలలో ఇది కూడా ఒకటి.

బరా ఇమాంబారా లో మొహర్రం చిత్రపటం

కూర్పు మార్చు

బరా ఇమాంబారా పరిసరాలలో ఒక పెద్ద అస్ఫీ మాసీదు, ఒక బౌలి (పారే నీటిని నిల్వ ఉంచే ఒక బావి) కలవు. ఇమాంబారా లోపల ఒక పద్మవ్యూహం ఉన్నది. ఇమాంబారా పై అంతస్తును చేరటానికి 1024 దారులు ఉన్ననూ, తిరిగి క్రిందకు వచ్చేందుకు ఒకే దారు ఉన్నదని అంటారు.

1785లో ఏర్పడ్డ తీవ్ర కరువు వలన అక్కడి ప్రజలకు భృతి కల్పించేందుకు అసఫ్-ఉద్-దౌలా బరా ఇమాంబారాను కట్టించాడు. దీని నిర్మాణం 1791 వరకు సాగింది. నిర్మాణానికి పది లక్షల వరకు ఖర్చు అయ్యింది.

నిర్మాణ శైలి మార్చు

బరా ఇమాంబారా నిర్మాణ శైలి, వాస్తు పరిణతి పొందిన మొఘల్ శైలికి నిదర్శనం.

దీనిని నిర్మించటానికి జరిగిన పోటీలో ఢిల్లీకి చెందిన కిఫాయత్ ఉల్లా అనే నిర్మాత గెలుపొందాడు.

ఈ భవనం నుండి దగ్గరే ఉన్న గోమతి నదికి, ఫైజాబాద్ కు, అలహాబాద్, ఆగ్రా, ఢిల్లీలకు స్వరంగ మార్గాలు ఉన్నాయి.

మూలాలు మార్చు