ఇమాంబారా
ఇమాంబారా షియా ముస్లింలు ముహర్రం జ్ఙాపకార్థ సమావేశ స్థలంగా ఉపయోగించబడే భవనం. దీనినే అషుర్ఖానా అని కూడా వ్యవహరిస్తారు. హుస్సేనియా అని కూడా అంటారు. హుస్సేనియా, మసీదు కంటే విభిన్నంగా ఉంటుంది. ఈ పేరు పన్నెండు ఇమామ్‌లలో మూడవవాడు, ఇస్లామిక్ ప్రవక్త ముహమ్మద్కు మనవడూ అయిన హుస్సేన్ ఇబ్న్ అలీ నుండి వచ్చింది. 680 అక్టోబరు 10 న మొహమ్మద్ ప్రవక్త మనవడు, షియాల ఇమాం అయిన హుసేన్ ఇబ్న్ ఆలీని ఇరాక్లో జరిగిన కర్బాలా యుద్ధంలో ఉమయ్యద్ క్యాలిఫ్ సంహరించాడు. అతడి బలిదానాన్ని షియాలు ప్రతి సంవత్సరం ముహర్రం నెల 10 వ రోజైన అషూరా నాడు జరుపుకుంటారు. [1] హుస్సేనియాలలో అషూరాతో సంబంధం లేని ఇతర వేడుకలు కూడా ఉన్నాయి. [2] జుమువా (శుక్రవారం సమ్మేళన ప్రార్థన) ఉండకపోవచ్చు కూడా.
దక్షిణ ఆసియాలో హుస్సేనియాను ఇమాంబారా, అషూర్‌ఖానా అని అంటారు. ఆఫ్ఘనిస్తాన్ లోను, మధ్య ఆసియా లోనూ దీనిని తక్యాఖానా అని పిలుస్తారు. బహ్రెయిన్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, లలో మాతం అంటారు.
చరిత్ర
మార్చు[[దస్త్రం:Bara_Imambara_Lucknow.jpg|alt=|thumb|190x190px|[[లక్నో|లక్నోలో[permanent dead link]]] ఒక పెద్ద హుస్సేనియా]] ఇరాన్లో సఫావిడ్ పాలించిన కాలం నుండి, షియాలు మతపరమైన సంతాప వేడుకలను నిర్వహించేందుకు నడవాలు, పైకప్పు గల ప్రదేశాలు మాత్రమే కాకుండా హోసెనియాలు, తకియేలు కూడా వాడేవారు. [3] హోస్సేనియాకు వివిధ పరిమాణాలలో కొన్ని గదులు, ఆర్కేడ్‌లూ ఉండేవి. వీధులలోను, సందుల్లోను అషూరా దగ్గరపడిన రోజులలో, ప్రజలు గోడలకూ, పైకప్పులకూ నల్ల రంగు వేసి, రంగురంగుల లైట్లతో వాటిని ప్రకాశవంతం చేసేవారు.[4]
కొన్ని ముఖ్యమైన ఇమాంబారాలు
మార్చు- ఇరాన్‌లోని జంజన్‌లో ఉన్న హోస్సేనిహ్ అజామ్ జంజన్ మసీదు
- లక్నోలో ఉన్న బారా ఇమాంబారా
- లక్నోలో చోటా ఇమాంబారా
- హుగ్లీ ఇమాంబారా, హుగ్లీ (WB) లో
- నిజామత్ ఇమాంబర, ముర్షిదాబాద్‌లో
- హైదరాబాద్‌లోని బాద్‌షాహి అశుర్‌ఖానా
- ఇరాన్‌లోని టెహ్రాన్‌లో ఉన్న హోస్సేనియే ఎర్షాద్
- హుస్సేని ఇమాంబర అసిమ్ రాజా అబ్ది, 100/46 లో, కల్నల్ గంజ్ కాన్పూర్,
- లక్నోలో ఇమాంబారా ఘుఫ్రాన్ మాబ్
- కరారి అలహాబాద్‌లోని ఇమాంబర్‌గా మిర్ విలాయత్ హుస్సేన్
ఇవి కూడా చూడండి
మార్చు
మూలాలు
మార్చు- ↑ మూస:Iranica
- ↑ Hussainiahs and Takkiahs mashreghnews.ir
- ↑ Zoka, Yahya. History of Royal Citadel in Tehran and guide to Golestan Palace, (تاریخچه ساختمانهای ارگ سلطنتی تهران و راهنمای کاخ گلستان), vol 1. p. 283.
- ↑ Ansari Qomi. Iran's endowments in Iraq, ( موقوفات ايرانيان در عراق), vol 2. pp. 74–82.