బలరాంపూర్ సామూహిక అత్యాచారం
బలరాంపూర్ సామూహిక అత్యాచారం | |
---|---|
ప్రదేశం | బల్రాంపూర్, ఉత్తర ప్రదేశ్ |
భౌగోళికాంశాలు | 27°26′N 82°11′E / 27.43°N 82.18°E |
తేదీ | 29 సెప్టెంబరు 2020 |
దాడి రకం | అత్యాచారం, దాడి[1] |
మరణాలు | 1 |
Number of participants | 2 |
2020 సెప్టెంబర్ 29 న, ఉత్తర ప్రదేశ్ లోని బలరాంపూర్‌లో 22 ఏళ్ల దళిత విద్యార్థిపై సామూహిక అత్యాచారం జరిగింది. ఆమెను ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యం లోనే మరణించింది. [2] ఆమె కుటుంబం చెప్పిన దాని ప్రకారం, ఆమె ఇంటికి తిరిగి వస్తుండగా షాహిద్, సాహిల్ అనే ఇద్దరు వ్యక్తులు ఆమెను కిడ్నాప్ చేసి, అత్యాచారం చేశారు. అత్యాచారం తర్వాత కూడా ఆమెను దారుణంగా హింసించారని పోస్ట్‌మార్టం నివేదిక సూచించింది. [3] [4] ఆమె శరీరంపై కనీసం పది గాయాలు, ఆమె చెంప, ఛాతీ, మోచేతులు, ఎడమ తొడపై ఎనిమిది గీరుకుపోయిన గాయాలు, ఎడమ కాలు, మోకాలిపై రెండు రాపిడిగాయాలూ ఉన్నాయని పోస్ట్‌మార్టం నివేదిక పేర్కొంది. [5] ఇద్దరు ప్రధాన నిందితులను ఉత్తర ప్రదేశ్ పోలీసులు అరెస్టు చేశారు. బాధితుడి కుటుంబానికి ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఆర్థిక సహాయం చేసింది. [6]
సంఘటన, అరెస్టులు
మార్చుసెప్టెంబరు 29, మంగళవారం సాయంత్రం, బికామ్ రెండవ సంవత్సరం చదువుతున్న బాధితురాలు ఇంటికి తిరిగి వస్తుండగా ఈ సంఘటన జరిగింది. కాలేజీలో చేరడం కోసం 10 గంటలకు ఆమె వెళ్లిందని ఆమె తల్లి విలేకరులతో చెప్పింది. తిరిగి వస్తుండగా, కొంతమంది పురుషులు ఆమెను బలవంతంగా తమ కారులో ఎక్కించుకుని, ఆమెకు మత్తుమందులు ఎక్కించి, ఆమెపై అత్యాచారం చేశారు. ఆమె కాళ్లు విరగ్గొట్టి రిక్షాలో వెనక్కి పంపించారు.
ఆమె విషమ పరిస్థితిలో ఇంటికి తిరిగి వచ్చింది. తల్లిదండ్రులు ఆమెను సమీపంలోని ఆసుపత్రికి తరలిస్తూండగా ఆమె మార్గమధ్యంలో మరణించింది. ఆసుపత్రి నుండే పోలీసులకు ఫిర్యాదు చేసారు. బలరాంపూర్ పోలీసు సూపరింటెండెంట్ దేవ్ రంజన్ వర్మ ప్రకారం, "తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు చర్య తీసుకున్నారు. షాహిద్, సాహిల్ లను నిందితులుగా గుర్తించి వారిని అరెస్టు చేశారు".
దహనం
మార్చుసెప్టెంబరు 30వ తేదీ బుధవారం రాత్రి ఆమె కుటుంబ సభ్యులు, ఉత్తర ప్రదేశ్ పోలీసుల సమక్షంలో ఆమె అంత్యక్రియలు నిర్వహించారు. [7] [8]
మూలాలు
మార్చు- ↑ "UP: After Hathras, Another Dalit Woman Raped in Balrampur". The Wire. 1 October 2020. Retrieved 9 October 2020.
- ↑ "A second Dalit woman has died after alleged gang rape, sparking outrage and protests across India". Jessie Yeung and Esha Mitra. CNN. 1 October 2020. Retrieved 7 October 2020.
- ↑ Sanyal, Anindita; Pandey, Alok; Khan, Kamal (1 October 2020). "Amid Hathras Outrage, UP 22-Year-Old Drugged, Allegedly Gang Raped, Dies". NDTV. Retrieved 27 November 2020.
- ↑ Ghosh, Raya. "Hathras, Balrampur gangrapes: Alia Bhatt to Anushka Sharma, Bollywood reactions". India Today (in ఇంగ్లీష్). Retrieved 1 October 2020.
- ↑ "Balrampur victim had 10 injuries on body: postmortem report". The Indian Express (in ఇంగ్లీష్). 2 October 2020. Retrieved 2 October 2020.
- ↑ "Balrampur: Anger grows after new India 'gang rape' death". BBC News. Retrieved 7 October 2020.
- ↑ "Two held on charge of rape and murder of woman in U.P.'s Balrampur". The Hindu (in Indian English). Special Correspondent. 1 October 2020. ISSN 0971-751X. Retrieved 2 October 2020.
{{cite news}}
: CS1 maint: others (link) - ↑ "Balrampur rape-murder trial in fast-track court". The Times of India. 5 October 2020. Retrieved 7 October 2020.