బస్సెయిన్ ఒప్పందం

బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ మరియు బాజీ రావ్ II మధ్య ఒప్పందం

 

బస్సెయిన్ ఒప్పందం
బస్సెయిన్ ఒప్పందం
ఈస్టిండియా కంపెనీ అధికారుల ముందు, ఒప్పందంపై సంతకం చేస్తున్న బాజీరావు 2
సందర్భంస్వీయ రక్షణార్థం పూనా నుండి పారిపోయిన మరాఠా సామ్రాజ్య పీష్వా ఈ ఒప్పందంపై సంతకం చేసాడు
సంతకించిన తేదీడిసెంబరు 31, 1802 (1802-12-31)
సంతకీయులు

బస్సేన్ ఒప్పందం అనేది ఇంగ్లీషు ఈస్టిండియా కంపెనీకి, మరాఠా సమాఖ్య పీష్వా అయిన బాజీ రావ్ II కూ మధ్య కుదిరిన ఒప్పందం. ఇది పూనా యుద్ధం తర్వాత 1802 డిసెంబరు 31న బస్సేన్ (ప్రస్తుత వసాయి) వద్ద కుదిరింది. మారాఠా సామ్రాజ్య పతనంలో నిర్ణయాత్మకమైన మలుపు ఇది. 1818లో మారాఠా సామ్రాజ్యం లోని భూభాగాలను ఈస్టిండియా కంపెనీ స్వాధీనం చేసుకుంది.

1803 మే 13 న, బాజీ రావ్ II ఈస్టిండియా కంపెనీ సంరక్షణలో పీష్వాగా పునరుద్ధరించబడ్డాడు. మరాఠా రాష్ట్రం బ్రిటిషు వారి సామంతుగా మారింది. ఈ ఒప్పందం భారత ఉపఖండంలో కంపెనీ పాలన విస్తరణకు దారితీసింది. అయితే, ఈ ఒప్పందం మరాఠాల అధిపతులందరికీ ఆమోదయోగ్యం కాలేదు. ఫలితంగా రెండవ ఆంగ్లో-మరాఠా యుద్ధం జరిగింది.

ఒప్పందం నిబంధనలు

మార్చు

ఒడంబడిక లోని నిబంధనలు క్రింది వాటిని కలిగి ఉన్నాయి: [1]

  1. దాదాపు 6,000 మంది సైనికులతో కూడిన బ్రిటిషు దళం శాశ్వతంగా పేష్వా వద్ద ఉంటుంది.
  2. 26 లక్షల ఆదాయం ఉన్న జిల్లాల ఆదాయంలో ఈస్టిండియా కంపెనీకి వాటా చెల్లించాలి.
  3. కంపెనీని సంప్రదించకుండా పేష్వా మరే ఇతర ఒప్పందాన్ని కుదుర్చుకోరాదు.
  4. కంపెనీని సంప్రదించకుండా పేష్వా యుద్ధం ప్రకటించకూడదు.
  5. పేష్వా చేసిన ఏదైనా ప్రాదేశిక క్లెయిమ్‌లు కంపెనీ మధ్యవర్తిత్వానికి లోబడి ఉంటాయి.
  6. సూరత్ బరోడాలను పీష్వా వదులుకోవాలి
  7. పీష్వా తన సేవ నుండి యూరోపియన్లందరినీ మినహాయించాలి.
  8. బ్రిటిషు వారితో సంప్రదింపులు జరిపాకే తన విదేశీ సంబంధాలను కొనసాగించాలి.

ఇవి కూడా చూడండి

మార్చు

మూలాలు

మార్చు
  1. Naravane, M.S. (2014). Battles of the Honorourable East India Company. A.P.H. Publishing Corporation. p. 66. ISBN 9788131300343.