ద్రవ్య సంబంధమైన కొలమానానికి కొన్ని దేశాలలో వాడబడుతున్న సాధారణ నామం రూపీ. భారతదేశానికి సంబంధించిన రూపీని తెలుగులో రూపాయి అంటారు. భారతదేశం పాటు పాకిస్తాన్, శ్రీలంక, నేపాల్, మారిషస్, సీషెల్స్, మాల్దీవులు, ఇండోనేషియా ద్రవ్య కొలమానానికి సాధారణ నామంగా రూపీని ఉపయోగిస్తున్నారు. పూర్వం బర్మా, ఆఫ్గనిస్తాన్లలో కూడా ద్రవ్య కొలమానానికి రూపీని సాధారణ నామంగా ఉపయోగించారు. చారిత్రాత్మకంగా రూపీని మొట్టమొదట సుర్ సామ్రాజ్యం యొక్క స్థాపకుడు షేర్ షా సూరి 16 వ శతాబ్దంలో పరిచయం చేశాడు. ఈ రూపీ పదం రుపయా అనే పదం నుండి వచ్చింది. వెండి నాణెం యొక్క సంస్కృత పదం రుపయా.

అధికారిక ద్రవ్యం యొక్క పేరు రూపీగా ఉన్న దేశాలు
షేర్ షా సూరి క్రీస్తుశకం 1540-1545లో విడుదల చేసిన మొదటి రూపాయి
French East India Company-issued rupee in the name of Mohammed Shah (1719-1748) for Northern India trade, cast in Pondicherry.
Indonesian rupiah

ఇవి కూడా చూడండి

మార్చు

మూలాలు

మార్చు
"https://te.wikipedia.org/w/index.php?title=రూపీ&oldid=3889226" నుండి వెలికితీశారు