బాఘ్మార
బాఘ్మార, మేఘాలయ రాష్ట్రంలోని దక్షిణ గారో హిల్స్ జిల్లా ముఖ్య పట్టణం, జిల్లా ప్రధాన కార్యాలయం. తుర పట్టణం నుండి 113 కి.మీ.ల దూరంలో ఉన్న ఈ ప్రదేశం, బంగ్లాదేశ్ సరిహద్దులో ఉంది. ఇక్కడ సోమేశ్వరి నది ఉంది. గారో గిరిజన భాషలో దీనిని సిమ్సాంగ్ నది అని కూడా పిలుస్తారు.
బాఘ్మార | |
---|---|
పట్టణం | |
Coordinates: 25°12′32″N 90°37′42″E / 25.2089793°N 90.6284523°E | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | మేఘాలయ |
జిల్లా | దక్షిణ గారో హిల్స్ |
జనాభా (2011) | |
• Total | 13,131 |
భాషలు | |
Time zone | UTC+5:30 (భారత కాలమానం) |
పిన్‌కోడ్ | 794 102 |
టెలిఫోన్ కోడ్ | 91 03639 |
Vehicle registration | ఎంఎల్ - 09 |
ఈ పట్ణానికి సుమారు 45 కిలోమీటర్ల దూరంలో ఉన్న సిజు గుహకు ఈ పట్టణం మీదుగానే వెళ్ళాలి. బల్పక్రం జాతీయ ఉద్యానవనం ఈ పట్టణానికి 66 కి.మీ.ల దూరంలో ఉంది. ఇక్కడ బస్సులు, జీపులలతో రవాణా సౌకర్యం ఉంది. ఈ ప్రాంతంలో చేపలు అధికంగా లభిస్తాయి. ఈ ప్రాంతం బంగ్లాదేశ్‌తో సముద్ర వాణిజ్య సంబంధాన్ని కలిగి ఉంది.
చరిత్ర
మార్చుబాంగ్ లాస్కర్, ఒక బెంగాల్ పులి మధ్య జరిగిన పోరాటం నుండి ఈ ప్రాంతానికి "బాఘ్మార" అనే పేరు వచ్చింది. బాంగ్ లాస్కర్ ఈ ప్రాంతంలో ఒక పులిని చంపాడు. ఇందులో బాగ్ అంటే "పులి" అని, మారా అంటే "మరణించించడం" అని అర్థం. బాంగ్ లాస్కర్ జ్ఞాపకార్థంగా ఈ పట్టణం మధ్యలో ఒక సమాధి కూడా నిర్మించబడింది. ఈ స్థలాన్ని గతంలో "బరోకర్" అని కూడా పిలిచేవారు. అంటే 12 ప్రవాహాలు ("బారో" అంటే 12, "కర్" అంటే ప్రవాహం) అని అర్థం.
జనాభా
మార్చు2011 భారత జనాభా లెక్కల ప్రకారం,[1] ఈ పట్టణంలో 8,643 జనాభా ఉంది. ఈ జనాభాలో 53% మంది పురుషులు, 47% మంది స్త్రీలు ఉన్నారు. పట్టణ సగటు అక్షరాస్యత 70% కాగా, ఇది జాతీయ సగటు 59.5% కంటే ఎక్కువగా ఉంది. ఈ అక్షరాస్యతలో 55% మంది పురుషులు, 45% మంది స్త్రీలు ఉన్నారు. ఈ మొత్తం జనాభాలో 16% మంది 6 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు గలవారు ఉన్నారు. 2011 భారత జనాభా లెక్కల ప్రకారం, బాఘ్మార మున్సిపాలిటీ జనాభా 13,131 మందికి పెరిగింది.[2]
పర్యాటక ప్రాంతాలు
మార్చు- బల్పక్రం జాతీయ ఉద్యానవనం
- సిజు గుహ
- పిచర్ ప్లాంట్
- సిమ్సాంగ్ నది
- చిట్మాంగ్ కొండ
- పిచర్ ప్లాంట్ అభయారణ్యం
- బంగ్లాదేశ్ వ్యూ
- సీతాకోకచిలుక స్పాట్
- బాఘ్మార-బల్పక్రం అటవీ రిజర్వ్
- నెంగ్కాంగ్ గుహ
మూలాలు
మార్చు- ↑ "Census of India 2001: Data from the 2001 Census, including cities, villages and towns (Provisional)". Census Commission of India. Archived from the original on 2004-06-16. Retrieved 2021-01-02.
- ↑ "Census 2011 - Baghmara, Meghalaya". Retrieved 2021-01-02.