బాజెడాక్సిఫెన్/కాంజుగేటెడ్ ఈస్ట్రోజెన్స్

బాజెడాక్సిఫెన్/కంజుగేటెడ్ ఈస్ట్రోజెన్స్, అనేది డువేవీ మరియు డ్యువైవ్ బ్రాండ్ పేరుతో విక్రయించబడుతున్నాయి. ఇది మెనోపాజ్ తర్వాత రుతువిరతి, బోలు ఎముకల వ్యాధి లక్షణాలకు చికిత్స చేయడానికి ఉపయోగించే మిశ్రమ ఔషధం.[1] ఇది నోటి ద్వారా తీసుకోబడుతుంది.[2] దీన్ని స్వల్పకాలికంగా ఉపయోగించాలి.[2]

బాజెడాక్సిఫెన్/కాంజుగేటెడ్ ఈస్ట్రోజెన్స్
Combination of
Bazedoxifene Selective estrogen receptor modulator
Conjugated estrogens Estrogen
Clinical data
వాణిజ్య పేర్లు Duavee, Duavive
అమెరికన్ సొసైటీ ఆఫ్ హెల్త్ సిస్టం ఫార్మాసిస్ట్స్(AHFS)/డ్రగ్స్.కామ్ monograph
MedlinePlus a614004
లైసెన్స్ సమాచారము US Daily Med:link
ప్రెగ్నన్సీ వర్గం D (AU) X (US)
చట్టపరమైన స్థితి -only (US) Rx-only (EU) Prescription only
Routes By mouth
Identifiers
ATC code ?

సాధారణ దుష్ప్రభావాలలో కండరాల నొప్పులు, వికారం, అతిసారం, గుండెల్లో మంట, మైకము, నొప్పి ఉంటాయి.[1] ఇతర దుష్ప్రభావాలలో రక్తం గడ్డకట్టడం, స్ట్రోక్, ఎండోమెట్రియల్ క్యాన్సర్ ఉండవచ్చు.[1] గర్భధారణ సమయంలో దీనిని ఉపయోగించకూడదు.[2] ఇది బజెడాక్సిఫెన్, సెలెక్టివ్ ఈస్ట్రోజెన్ రిసెప్టర్ మాడ్యులేటర్, కంజుగేటెడ్ ఈస్ట్రోజెన్‌లను కలిగి ఉంటుంది.[3]

ఈ కలయిక 2013లో యునైటెడ్ స్టేట్స్, 2014లో యూరప్‌లో వైద్యపరమైన ఉపయోగం కోసం ఆమోదించబడింది.[1][4] యునైటెడ్ స్టేట్స్‌లో 2022 నాటికి ఒక నెల మందుల ధర దాదాపు 180 అమెరికన్ డాలర్లు.[5]

మూలాలు

మార్చు
  1. 1.0 1.1 1.2 1.3 "Selective Estrogen Receptor Modulators". LiverTox: Clinical and Research Information on Drug-Induced Liver Injury. National Institute of Diabetes and Digestive and Kidney Diseases. 2012. Archived from the original on 11 January 2022. Retrieved 8 January 2022.
  2. 2.0 2.1 2.2 "DailyMed - DUAVEE- conjugated estrogens/bazedoxifene tablet, film coated". dailymed.nlm.nih.gov. Archived from the original on 10 May 2021. Retrieved 8 January 2022.
  3. "Bazedoxifene Monograph for Professionals". Drugs.com (in ఇంగ్లీష్). Archived from the original on 19 April 2021. Retrieved 8 January 2022.
  4. "Duavive EPAR". European Medicines Agency (EMA). Archived from the original on 2020-06-10. Retrieved 2020-06-10.
  5. "Conjugated Estrogens and Bazedoxifene Prices, Coupons & Savings Tips - GoodRx". GoodRx. Archived from the original on 16 April 2016. Retrieved 8 January 2022.