ఎండోమెట్రియల్ క్యాన్సర్
ఎండోమెట్రియల్ క్యాన్సర్ అనేది ఎండోమెట్రియం నుండి ఏర్పడే క్యాన్సర్. [1] ఎండోమెట్రియం అంటే గర్భాశయం లేదా గర్భాశయం గోడ (లైనింగ్). ఇది శరీరంలోని ఇతర భాగాలకు వ్యాప్తి చేసే సామర్థ్యం ఉన్న కణాల అసాధారణ పెరుగుదల ఫలితం గా కాన్సర్ ఏర్పడుతుంది. [2]
ఎండోమెట్రియల్ క్యాన్సర్ | |
---|---|
ఇతర పేర్లు | యుటెరైన్ కాన్సర్ |
ఎండోమెట్రియల్ కాన్సర్ ఏర్పడే ప్రదేశం | |
ప్రత్యేకత | గైనకాలజీ, ఆంకాలజీ |
లక్షణాలు | యోని రక్తస్రావం ఋతు కాలంతో సంబంధం లేకుండా, మూత్రవిసర్జనతో నొప్పి, లైంగిక సంపర్కం సమయంలో నొప్పి, లేదా కటి నొప్పి |
సాధారణ ప్రారంభం | రుతువిరతి (మెనోపాజ్) తర్వాత |
ప్రమాద కారకములు | ఊబకాయం, అధిక ఈస్ట్రోజెన్ కు గురి కావడం, అధిక రక్తపోటు, మధుమేహం. |
రోగనిర్ధారణ పద్ధతి | ఎండోమెట్రియల్ బయాప్సీ |
చికిత్స | ఉదర గర్భాశయం (శస్త్రచికిత్స ద్వారా గర్భాశయం మొత్తం తొలగింపు), రెండు వైపులా ఉన్న ఫెలోపియన్ ట్యూబ్‌లు, అండాశయాలను తొలగించడం. రేడియేషన్ థెరపీ, కీమోథెరపీ లేదా హార్మోన్ థెరపీ |
రోగ నిరూపణ | 5 సంవత్సరాలు ~80% (US) |
తరుచుదనము | 3.8 million (total affected in 2015) |
లక్షణాలు
మార్చుమొదటగా యోని రక్తస్రావం ఋతు కాలంతో సంబంధం లేకుండా జరుగుతుంది. [3] ఇతర లక్షణాలలో మూత్రవిసర్జనతో నొప్పి, లైంగిక సంపర్కం సమయంలో నొప్పి, లేదా కటి నొప్పి ఉంటాయి.[3] ఎండోమెట్రియల్ క్యాన్సర్ సాధారణంగా రుతువిరతి (మెనోపాజ్) తర్వాత సంభవిస్తుంది.
కారణాలు
మార్చుఈ వ్యాధి గ్రస్తులలో దాదాపు 40% మందికి ఊబకాయం వలన సంభవింనవి. [4] ఎండోమెట్రియల్ క్యాన్సర్ అనేది అధిక ఈస్ట్రోజెన్ కు గురి అవడం వలన, ఇంకా అధిక రక్తపోటు, మధుమేహం వంటి వ్యాధులవలన కూడా వస్తుంది. [3] కేవలం ఈస్ట్రోజెన్‌ను మాత్రమే తీసుకోవడం వల్ల ఎండోమెట్రియల్ క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఎక్కువ అవుతుంది. చాలా జనన నియంత్రణ మాత్రలు తీసుకోవడం వలెనే ఈస్ట్రోజెన్, ప్రొజెస్టోజెన్ రెండింటినీ కలిపి తీసుకోవడం అనేది ప్రమాదాన్ని తగ్గిస్తుంది. [3] [4] రెండు నుంచి ఐదు శాతం కేసులు తల్లిదండ్రుల నుండి సంక్రమించిన జన్యువుల వలన వచ్చింది అని తెలుస్తోంది. [4]
రకాలు
మార్చుగర్భాశయ క్యాన్సర్, గర్భాశయ సార్కోమా, ట్రోఫోబ్లాస్టిక్ వ్యాధి వంటి గర్భాశయ క్యాన్సర్ ఇతర రూపాల నుండి వేరుగా ఉన్నప్పటికీ, ఎండోమెట్రియల్ క్యాన్సర్‌ను కూడా కొన్నిసార్లు " గర్భాశయ క్యాన్సర్ " అని పిలుస్తారు.[5] ఎండోమెట్రియల్ క్యాన్సర్ అత్యంత సాధారణ రకం ఎండోమెట్రియోయిడ్ కార్సినోమా, ఇది 80% కంటే ఎక్కువ మందికి ప్రభావం చూపిస్తుంది. [6]
వ్యాధి నిర్ధారణ
మార్చుఎండోమెట్రియల్ క్యాన్సర్ సాధారణంగా డైలేషన్ క్యూరెట్టేజ్ (డి అండ్ సి) అనే ప్రక్రియలో నమూనాలను తీసుకోని వాటిని ఎండోమెట్రియల్ బయాప్సీ చేసి నిర్ధారణ చేస్తారు.[3] ఎండోమెట్రియల్ క్యాన్సర్‌ను ధృవీకరించడానికి పాప్ స్మెర్ సాధారణంగా సరిపోదు. [7] సాధారణంగా ఉన్నవారిలో తరచుగా పరీక్ష (స్క్రీనింగ్) అవసరం లేదు. [8]
చికిత్స
మార్చుఎండోమెట్రియల్ క్యాన్సర్‌కు ప్రధాన చికిత్స ఉదర గర్భాశయం (శస్త్రచికిత్స ద్వారా గర్భాశయం మొత్తం తొలగింపు), రెండు వైపులా ఉన్న ఫెలోపియన్ ట్యూబ్‌లు, అండాశయాలను తొలగించదాన్ని, ద్వైపాక్షిక సల్పింగో-ఓఫోరెక్టమీ అని పిలుస్తారు. [7] మరింత తీవ్రంగా ఉన్న సందర్భాల్లో, రేడియేషన్ థెరపీ, కీమోథెరపీ లేదా హార్మోన్ థెరపీని కూడా సిఫార్సు చేయవచ్చు. [7] వ్యాధిని ప్రారంభ దశలోనే గుర్తించినట్లయితే, ఫలితం అనుకూలంగా ఉంటుంది, [7] అమెరికాలో మొత్తం ఐదు సంవత్సరాల మనుగడ రేటు 80% కంటే ఎక్కువగా ఉంటుంది.[9] ఆఫ్రికన్-అమెరికన్ స్త్రీలలో, ఇది చాలా సాధారణం కాని ఫలితం అధ్వాన్నంగా ఉంటుంది. [1]
వ్యాధి ప్రాబల్యం
మార్చు2012లో, ఎండోమెట్రియల్ క్యాన్సర్లు కొత్తగా 320,000 మందిలో సంభవించాయి. మహిళలు 76,000 ప్రభావితమయ్యారు. [4] ఇది కేవలం మహిళలను మాత్రమే ప్రభావితం చేసే క్యాన్సర్. మహిళల మరణానికి ఇది మూడవ కారణం, అభివృద్ధి చెందిన దేశాలలో అండాశయ క్యాన్సర్ అనేది గర్భాశయ క్యాన్సర్ తర్వాత సాధారణంగా వ్యాప్తిలో ఉంది. [4] ఇది సర్వసాధారణం [4] అభివృద్ధి చెందిన దేశాలలో స్త్రీ పునరుత్పత్తి మార్గము నకు సంబంధించిన అత్యంత సాధారణ క్యాన్సర్. [7] 1980, 2010 మధ్య అనేక దేశాలలో ఎండోమెట్రియల్ క్యాన్సర్ కేసులు పెరిగాయి [4] వృద్ధుల సంఖ్య పెరగడం, ఊబకాయం పెరగడం దీనికి కారణమని భావిస్తారు. [10]
ప్రస్తావనలు
మార్చు- ↑ 1.0 1.1 Armstrong, Deborak K. (2020). "189. Gynaecologic cancers: endometrial cancer". In Goldman, Lee; Schafer, Andrew I. (eds.). Goldman-Cecil Medicine (in ఇంగ్లీష్). Vol. 1 (26th ed.). Philadelphia: Elsevier. pp. 1329–1332. ISBN 978-0-323-55087-1. Archived from the original on 8 July 2022. Retrieved 8 July 2022.
- ↑ "Defining Cancer". National Cancer Institute. 2007-09-17. Archived from the original on 25 June 2014. Retrieved 10 June 2014.
- ↑ 3.0 3.1 3.2 3.3 3.4 "General Information About Endometrial Cancer". National Cancer Institute. 22 April 2014. Archived from the original on 3 September 2014. Retrieved 3 September 2014.
- ↑ 4.0 4.1 4.2 4.3 4.4 4.5 4.6 International Agency for Research on Cancer (2014). World Cancer Report 2014. World Health Organization. Chapter 5.12. ISBN 978-92-832-0429-9.
- ↑ "What You Need To Know: Endometrial Cancer". NCI. National Cancer Institute. Archived from the original on 8 August 2014. Retrieved 6 August 2014.
- ↑ WHO Classification of Tumours Editorial Board, ed. (2020). "6. Tumours of the uterine corpus: Endometrioid carcinoma". Female genital tumours: WHO Classification of Tumours. Vol. 4 (5th ed.). Lyon (France): International Agency for Research on Cancer. pp. 252–255. ISBN 978-92-832-4504-9. Archived from the original on 17 June 2022. Retrieved 31 July 2022.
- ↑ 7.0 7.1 7.2 7.3 7.4 "Endometrial Cancer Treatment (PDQ®)". National Cancer Institute. 23 April 2014. Archived from the original on 3 September 2014. Retrieved 3 September 2014.
- ↑ Hoffman BL, Schorge JO, Schaffer JI, Halvorson LM, Bradshaw KD, Cunningham FG, eds. (2012). "Endometrial Cancer". Williams Gynecology (2nd ed.). McGraw-Hill. p. 823. ISBN 978-0-07-171672-7. Archived from the original on 4 January 2014.
- ↑ "SEER Stat Fact Sheets: Endometrial Cancer". National Cancer Institute. Archived from the original on 6 July 2014. Retrieved 18 June 2014.
- ↑ Hoffman BL, Schorge JO, Schaffer JI, Halvorson LM, Bradshaw KD, Cunningham FG, eds. (2012). "Endometrial Cancer". Williams Gynecology (2nd ed.). McGraw-Hill. p. 817. ISBN 978-0-07-171672-7. Archived from the original on 4 January 2014.