బాటరా గోర్జ్ జలపాతం
బాటరా గోర్జ్ జలపాతం లెబనాన్ లోని టన్నోరిన్ లో గల జలపాతం[1].
Baatara gorge waterfall | |
---|---|
ప్రదేశం | Tannourine, Lebanon |
అక్షాంశరేఖాంశాలు | 34°10.406′N 35°52.222′E / 34.173433°N 35.870367°E |
రకం | Plunge |
బిందువుల సంఖ్య | 1 |
పొడవైన బిందువు | 90-100 meters |
ఈ జలపాతం 255 మీటర్ల (837 అడుగులు) ఎత్తు నుండి బాటరా గుహ (జూరాసిక్ సున్నపు రాతి గుహ) లోనికి పడిపోతుంది[2] . ఈ ప్రాంతం లెబనాన్ పర్వత శ్రేణి ప్రాంతంలో ఉంది[3]. 1952 లో ప్రెంచి జీవ శాస్త్రవేత్త హెన్రీ కోఫైట్ ఈ జలపాతాన్ని కనుగొన్నాడు[4]. దీనిని 1980 లో స్పెలూ క్లబ్ డు లిబన్ ద్వారా పూర్తిగా మ్యాప్ చేయబడినది[5]. ఈ గుహను "మూడు వంతెనల గుహ" అంటారు[6]. ఈ ప్రాంతం భౌగోళిక వింత. ఈ వంతెనలు ప్రకృతిసిద్ధంగా యేర్పడినవి. ఈ జలపాతం ప్రపంచ వింతల్లో ఒకటిగా చేరిపోయింది. ఈ పర్వతంపైన గల మంచు అంతా ఒకచోట చేరి కరిగి ఒక జలపాతంగా అవుతుంది. అందుకే ఈ ప్రవాహం తక్కువగా ఉంటుంది. వర్షం పడినపుడు ఈ ధారలు ఎక్కువగా పెరుగుతాయి. అపుడు ఈ నీరు భూగర్భంలో గల గుహ లోనికి చేరుతుంది. ఇక్కడి నేలలు సున్నపు రాతితో కూడి ఉంటాయి. ఈ నేలలు నీటితో తడిసినపుడు భారీ గుంతలు ఏర్పడుతాయి. వీటిని "సింక్ హోల్స్" అంటారు. కొన్నిలక్షల సంవత్సరాల క్రితం డైనోసార్లు ఈ ప్రాంతంలో తిరుగాడటం వలన ఈ నేల క్రిందికి పోయి మూడు వంతెనలుగా యేర్పడ్డాయి. దీనిలో జలపాతం దూకుతుంది.[7][8][9]
మూలాలు
మార్చు- ↑ "10 Most Beautiful Waterfalls of the World | Listphobia". Archived from the original on 2010-03-16. Retrieved 2014-01-16.
- ↑ "Balaa Pothole Lebanon". tourism-lebanon.com Tourism Lebanon]. Archived from the original on 2 ఫిబ్రవరి 2011. Retrieved 24 June 2010.
- ↑ "The Lebanon Mountain Trail Project" (PDF). United States Agency for International Development. 10 June 2008. Retrieved 24 June 2010.
- ↑ "Baatara Gorge – the Waterfall that Drops into a Cave". Retrieved 16 August 2011.
- ↑ "Baatara Pothole". heatheronhertravels.com/ Heather Travels]. 13 March 2010. Retrieved 24 June 2010.
- ↑ Paul Courbon, Claude Chabert; Peter Bosted and Karen Lindsley (1989). Atlas of the Great Caves of the World. Cave Books. p. 131. ISBN 978-0-939748-21-1.
- ↑ Dr. Hani Abdul-Nour. "Ballouh Baatura, or The Three Bridges Chasm in Balaa". DiscoverLebanon.com. Retrieved 2010-07-15.
- ↑ "La région de Tannourine" (in French). LibanVision. Retrieved 2010-07-15.
De ses 240 mètres de hauteur ... C'est le plus impressionnant des trois, surtout que durant la saison de fonte des neiges, une cascade d'eau s'y forme, tombant en chute libre sur 90 mètres.
{{cite web}}
: CS1 maint: unrecognized language (link) - ↑ Terry Carter; Lara Dunston; Andrew Humphreys (2004). Syria & Lebanon. Lonely Planet. p. 291. ISBN 978-1-86450-333-3.
ఇతర లింకులు
మార్చు- Balaa the 3 leveled waterfall Archived 2018-10-11 at the Wayback Machine - Photograph
- Gouffre de Balaa Archived 2014-08-10 at the Wayback Machine - Photograph