బాదామీ గుహాలయాలు

(బాదామీ గుహలు నుండి దారిమార్పు చెందింది)

బాదామీ గుహాలయాలు అనేవి హిందూ, జైన, బౌద్ధులకు చెందిన గుహాలయాల సముదాయం. ఇది కర్ణాటక రాష్ట్రంలోని బాగల్కోట్ జిల్లాలోని బాదామి ప్రాంతంలో ఉన్నాయి. ఈ గుహలు భారతీయ శిల్పకళకు ప్రతీకలుగా నిలుస్తాయి. ముఖ్యంగా ఈ గుహాలయాలు బాదామీ చాళుక్య నిర్మాణశైలిలో 6వ శతాబ్దం కాలంనాటివి. పూర్వం బాదామీ అనే ప్రాంతం వాతాపి బాదామీగా సుపరిచితం. ఇది కర్ణాటక రాష్ట్రంలో 6వ శతాబ్దం నుండి 8వ శతాబ్దం మధ్య కాలంలో విలసిల్లిన చాళుక్య సామ్రాజ్యానికి ముఖ్యపట్టణంగా ఉండేది.

బాదామీ గుహాలయాలు
మూడవ గుహలో విష్ణువు చిత్రం
Map showing the location of బాదామీ గుహాలయాలు
Map showing the location of బాదామీ గుహాలయాలు
Location of the cave in India
స్థలంబాదామీ, కర్ణాటక
అక్షాంశ రేఖాంశాలు15°55′06″N 75°41′06″E / 15.91833°N 75.68500°E / 15.91833; 75.68500
కనుగొన్నప్రాకారం కాలం అంచనా6వ శతాబ్దం
GeologySandstone
Entrancesఆరు గుహలు
DifficultyEasy
FeaturesUNESCO world heritage site candidate[1]

విశేషాలు

మార్చు

బాదామి క్షేత్రం బీజాపూర్ నుంచి హుబ్లీ వెళ్లే దారిలో బాదామి రైల్వే స్టేషన్‌కు మూడు కిలోమీటర్లు దూరంలో బాదామి గుహలు ఉన్నాయి. ఇక్కడికి చేరడానికి బాగల్‌కోట్ నుంచి బస్సు సౌకర్యం ఉంది. బాగల్‌కోట్ నుంచి బాదామికి 70 కి.మీ దూరం ఉంటుంది. బాదామిలో వసతి సదుపాయాలు ఉండవు కనుక బాగల్‌కోట్‌లో బస చేయాలి. ఇవి మనదేశంలో మాత్రమే కాదు, ప్రపంచంలోనే ప్రసిద్ధగుహలు.[2]

ఎర్రని రాతితో ఉండే ఈ గుహలు చూపరులను ఆకర్షిస్తాయి. ఒకప్పుడు ఇది తూర్పు చాళుక్యులకు నివాస స్థలం. చాళుక్యుల శిల్పకళాభిరుచికి ఈ గుహలు చక్కని ఉదాహరణ. నటరాజస్వామి, మహిషాసుర మర్దని, గణపతి, నెమలి వాహనంపై కుమారస్వామి, విష్ణుమూర్తి శిల్పాలు మనోహరంగా ఉంటాయి. జైనమతానికి చెందిన ప్రసిద్ధ వ్యక్తుల విగ్రహాలు కూడా ఉన్నాయి. జైన తీర్థంకరులు ఇక్కడ నివసించారని ప్రతీతి. విశాలమైన గుహలు, ఆలయాలతోపాటు పెద్ద సరోవరం ఉంది.

ఎన్నో పురాణ, ఇతిహాసాలు, సంఘటనలు, బోధనలు వీటిలో బాదామీ గుహల్లో కనపడతాయి. ఇవి మొత్తంగా నాలుగు దేవాలయాలు.

ఆర్యపురము(Aihole)

మార్చు

ఆర్యపురము ఇప్పటి బీజాపూరుజిల్లాలో బాదామి తాలూకాయందలి బాదామి రైల్వేస్టేషనునకు ఈశాన్యమున సుమారు 15 మైళ్ళ దూరములో నున్నది.పశ్చిమ చాళూక్య రాజ్యమున, బాదామి (Vatapi), ఆర్యపురము (Aihole), పట్టడకల్ అను మూడునగరములు మిక్కిలి ప్రసిద్ధములై యుండిన వనుటకు ప్రస్తుతము గల నిదర్శనములు వానియందుగల అసంఖ్యాకములగు పురాతన దేవాలయములే. ఇందు ఆర్యపురము ప్రస్తుతము సుమారొక 0.2కి.మీ నిడివిగల పెద్ద ఆవరణకుడ్యము కలిగిఉన్నది.ఆర్యపురము దేవాలయము అన్నింటియందును మిక్కిలి పురాతనమయినది లాడ్ ఖాక్ దేవాలయము. దీనికీపేరు ఇందు నివసించిన ఒక మహమ్మీదీయుని వలన కలిగినది. ఇదేరీతిన తక్కిన దేవాలయములకు ఇప్పటి కాలమున కలిగిన పేరులు, తొలుతటివి కాక మధ్యమధ్య కారణాంతరముల వలన కలిగినవై ఉన్నాయి.ఆర్యపుర దేవాల్యములలో తొలుత కట్టబడినవి విశేష శిల్పరచనా బాహుళ్యము లేక శిఖరరహితములయి గుహాలయములు పోలిఉన్నవి.ఇందుకు నిర్దర్శనములు లాడ్ ఖాక్ దేవాలయమును, కొంట గుడియు. తరువాతి కాలమున కట్టబడిన ఆలయముకు యందు శిల్పరచన వృద్ధి చెందినందున పెలు శిల్పాలు సుందరుముగా మలచబడినవి.లాడ్ ఖాక్ సా.శ.450 లో కట్టబడినవి. పశ్చిమ చాళుక్యులు వైష్ణవులైనందు వలన ఆర్యపురములోని ఆలయములన్నియు వైష్ణవాలయములై ఉండినవి. కాలక్రమమున వానిలో అనేక లింగాయతుల స్వాధీనమయి వాటియందు నంది, లింగము స్థాపింపబడి శివాలయములగను, దుర్గాలయములగను మార్పబడినవి.

ప్రతిసంవత్సరము నవరాత్రోత్సవములలో త్రిశూలము లేక కొంటను గ్రామసరిహద్దులకు గొనిపోవు అధికారముగల వారు ఇచటనివసించు చుండటం వలన ఇక్కడ ఉన్న ఒక ఆలయమునకు కొంట గుడి అని పేరు వచ్చింది. ఈగుడిపై చాళుక్యుల శిల్పరచనయందు, శిఖరరచనయొక్క శైశవదశను తెలియజేయునట్టి శిఖరము, ఎత్తులేనిది ఉంది. ఈ శిఖరము తొలుదొలుత ఆలయముతో కట్టబడక కొన్ని శతాబ్దముల వెనుక కట్టబదినదై ఉంది. ఈ దేవాలయపు కప్పు లోపలివైపు తొమ్మిడడుగులు కలిగి అందు మధ్యగుడియందు బ్రహ్మయు తక్కిన ఎనిమిడగులయందు అష్తదిక్పాలకులు చెక్కబడి ఉన్నారు. అందములగు త్రిమూర్తుల శిల్పములు ఉన్నాయి.

చాళుక్యశిల్పకౌశలము వృద్ధిచెందిన వెనుక కట్టబడిన శిఖరయుతములగు ఆలయములలో దుర్గాలయము, హుచ్చిమల్లిగుడి, మేగిలాతిగుడి అనునవి ముఖ్యములు.ఇందు మేగిలాతిగుడియందలి శిఖరము శిథిలమై ఉంది.దీనియందు రెండవపులకేశి కాలమునకు జేరిన శకవర్షము 55 నకు సరియగు సా.శ.34 సంవత్సరమునాటి శాసనము ఒకటి ఉంది.

ఒకటవ గుహాలయం

మార్చు

అన్నిటికంటే ప్రాచీనమైనది ఒకటవ గుహ దేవాలయం. ఇది అయిదవ శతాబ్దంలో నిర్మించబడింది. దీనిలో శివుడిని అర్ధనారీశ్వర, హరి హర అవతారాలలో చెక్కారు. నాట్యం చేస్తున్న నటరాజుగా కూడా చూపారు. శివుడికి కుడిభాగంలో హరిహర అవతారం, ఎడమ భాగంలో విష్ణుమూర్తి అవతారం చెక్కబడ్డాయి. దీనిలో మహిషాసుర మర్దిని, గణపతి, శివలిలంగం, షణ్ముఖ శిల్పాల చెక్కడాలు కూడా చూడవచ్చు.

రెండవ గుహాలయం

మార్చు

ఇది పూర్తిగా విష్ణుమూర్తి చెక్కడాలతో ఉంటుంది. వరాహ, త్రివిక్రమ అవతారాలలో చూపబడింది. విష్ణుమూర్తి, గరుడ అవతారాలు దేవాలయ పై భాగాన చూడవచ్చు.

మూడవ గుహాలయం

మార్చు

100 అడుగుల లోతు ఉన్న మూడవ గుహ దేవాలయంలో విష్ణుమూర్తి త్రివిక్రమ, నరసింహ అవతారాలలో కనపడతాడు. ఇంతేకాక పర్యాటకులు అదనంగా శివ పార్వతుల కళ్యాణ చిత్రాలు కూడా చూడవచ్చు.

నాలుగవ గుహాలయం నాలుగవ గుహ దేవాలయం పూర్తిగా జైనులకు సంబంధించింది. మహావీరుడు కూర్చుని ఉన్న భంగిమలో, తీర్థంకరుడు పార్శ్వనాధుడు చిత్రీకరించబడ్డాయి.

మూలాలు

మార్చు
  1. "Evolution of Temple Architecture – Aihole-Badami- Pattadakal". UNESCO. 2004. Retrieved 21 October 2015.
  2. సూర్య పత్రికలో వ్యాసం[permanent dead link]

ఇతర లింకులు

మార్చు