బాబు (పిల్లల పత్రిక)

మద్రాసు నుండి వెలువడిన పత్రిక. 1949లో ప్రారంభమైంది. తెలుగులో పిల్లలకొరకు వెలువడిన మొట్టమొదటి వారపత్రిక ఇది. గిరిధర్ సంపాదకుడుగా వ్యవహరించాడు. దీనిలో కథలు, పద్యాలు, సామెతలు, పొడుపుకథలు, నవ్వుపువ్వులు మొదలైన శీర్షికలు ఉన్నాయి. అన్నయ్యను అడగండి అనే శీర్షికలో పిల్లలకు కలిగిన సందేహాలకు సమాధానాలు ఉన్నాయి.[1]

మూలాలు మార్చు

  1. పి.కృష్ణమోహన్ (1949-07-01). "పుస్తక సమీక్ష". కిన్నెర. 1 (5): 80. Archived from the original on 2016-03-05. Retrieved 19 March 2015.