బాబ్ కాటెరాల్

దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్

రాబర్ట్ హెక్టర్ కాటెరాల్ (1900, జూలై 10 - 1961, జనవరి 3) దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్. 1922 నుండి 1931 వరకు 24 టెస్ట్ మ్యాచ్‌లు ఆడాడు.[1]

బాబ్ కాటెరాల్
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు
రాబర్ట్ హెక్టర్ కాటెరాల్
పుట్టిన తేదీ(1900-07-10)1900 జూలై 10
పోర్ట్ ఎలిజబెత్, కేప్ ప్రావిన్స్
మరణించిన తేదీ1961 జనవరి 3(1961-01-03) (వయసు 60)
కెంప్టన్ పార్క్, గౌటెంగ్
బ్యాటింగుకుడిచేతి వాటం
బౌలింగుకుడిచేతి మీడియం
పాత్రబ్యాట్స్‌మన్
అంతర్జాతీయ జట్టు సమాచారం
జాతీయ జట్టు
తొలి టెస్టు (క్యాప్ 103)1922 23 December - England తో
చివరి టెస్టు1931 13 February - England తో
కెరీర్ గణాంకాలు
పోటీ Test First-class
మ్యాచ్‌లు 24 124
చేసిన పరుగులు 1,555 5,849
బ్యాటింగు సగటు 37.92 29.99
100లు/50లు 3/11 9/31
అత్యధిక స్కోరు 120 147
వేసిన బంతులు 342 3,618
వికెట్లు 7 53
బౌలింగు సగటు 23.14 30.73
ఒక ఇన్నింగ్సులో 5 వికెట్లు 0 0
ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు 0 0
అత్యుత్తమ బౌలింగు 3/15 4/22
క్యాచ్‌లు/స్టంపింగులు 12/– 52/–
మూలం: Cricinfo, 2022 14 November

కుడిచేతి వాటం బ్యాట్స్‌మన్ గా, మిడిల్ ఆర్డర్‌లో బ్యాటర్ గా రాణించాడు. కొన్నిసార్లు కెరీర్‌లో తొలి భాగంలో ఓపెనర్‌గా ఉండేవాడు, కుడిచేతి మీడియం-పేస్ బౌలర్ తరచుగా సమస్యాత్మక భాగస్వామ్యాలను బ్రేక్ చేసేవాడు.

దేశీయ క్రికెట్

మార్చు

కాటెరాల్ జోహన్నెస్‌బర్గ్‌లోని జెప్పీ బాలుర ఉన్నత పాఠశాలలో చదువుకున్నాడు. అక్కడ మాజీ గ్లౌసెస్టర్‌షైర్ క్రికెటర్, లార్డ్స్ కోచ్ ఆల్ఫ్రెడ్ అట్‌ఫీల్డ్ చేత శిక్షణ పొందాడు.[2]

1920-21లో ట్రాన్స్‌వాల్ తరపున ఫస్ట్-క్లాస్ క్రికెట్‌లోకి అడుగుపెట్టాడు. తర్వాతి సీజన్లలో మంచి స్కోరర్‌గా నిలిచాడు.[3] 1922–23లో, ఇంగ్లాండ్ జట్టు, మేరిల్‌బోన్ క్రికెట్ క్లబ్‌గా నాన్-టెస్టులు, ఇంగ్లాండ్‌గా టెస్టులు ఆడుతూ, దక్షిణాఫ్రికాలో పర్యటించింది. టెస్ట్ సిరీస్ ప్రారంభానికి ముందు ట్రాన్స్‌వాల్‌తో ఫస్ట్-క్లాస్ మ్యాచ్‌లో బ్యాటింగ్ ప్రారంభించిన కాటెరాల్ 195 నిమిషాల్లో 13 ఫోర్లు, రెండు సిక్సర్లతో 128 పరుగులు చేశాడు.[4] దాంతో ఒక వారం తర్వాత ఇంగ్లాండ్‌తో జరిగిన మొదటి టెస్ట్ మ్యాచ్‌కు దక్షిణాఫ్రికా జట్టుకు ఎంపికయ్యాడు.

మూలాలు

మార్చు
  1. "Bob Catterall". www.cricketarchive.com. Retrieved 15 January 2012.
  2. "Five Cricketers of the Year". Wisden Cricketers' Almanack. Vol. Part I (1925 ed.). Wisden. p. 292.
  3. "First-class batting and fielding in each season by Bob Catterall". www.cricketarchive.com. Retrieved 26 July 2012.
  4. "Scorecard: Transvaal v MCC". www.cricketarchive.com. 16 December 1922. Retrieved 26 July 2012.