బార్కస్

తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని ఒక పొరుగు ప్రాంతం.

బార్కస్, తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని ఒక పొరుగు ప్రాంతం. ఇది పాతబస్తీలో ఉంది. "బార్కాస్" అనే పేరు ఆంగ్ల పదం "బ్యారక్స్" అనే పదం నుండి వచ్చిందని చెపుతారు. భారత స్వాతంత్ర్యానికి ముందు, బర్కాస్ హైదరాబాద్ నిజాం మిలిటరీ బ్యారక్స్ గా పనిచేశారు.

బార్కస్
సమీపప్రాంతం
బార్కస్ is located in Telangana
బార్కస్
బార్కస్
భారతదేశంలోని తెలంగాణలో ప్రాంతం ఉనికి
బార్కస్ is located in India
బార్కస్
బార్కస్
బార్కస్ (India)
Coordinates: 17°18′47″N 78°28′58″E / 17.31306°N 78.48278°E / 17.31306; 78.48278
దేశం భారతదేశం
రాష్ట్రంతెలంగాణ
జిల్లాహైదరాబాదు
మెట్రోపాలిటన్ ప్రాంతంహైదరాబాదు మెట్రోపాలిటన్ ప్రాంతం
Founded byనిజాం
Named forబ్యారక్స్
Government
 • Bodyహైదరాబాదు మహానగరపాలక సంస్థ
భాషలు
 • అధికారికతెలుగు, ఉర్దూ
Time zoneUTC+5:30 (భారత కాలమానం)
పిన్‌కోడ్
500 005
Vehicle registrationటిఎస్
లోక్‌సభ నియోజకవర్గంహైదరాబాదు లోక్‌సభ నియోజకవర్గం
శాసనసభ నియోజకవర్గంచాంద్రాయణగుట్ట శాసనసభ నియోజకవర్గం
పట్టణ ప్రణాళిక సంస్థహైదరాబాదు మహానగరపాలక సంస్థ

చరిత్ర

మార్చు

తన కుటుంబాన్ని కాపాడటానికి వచ్చినప్పుడు, 7వ నిజాంకు ఈ అరబ్ బాడీగార్డ్‌లపై సంపూర్ణ నమ్మకం ఉందని చెబుతారు.[1] డెక్కన్ రాజ్యంలో నిజాములు, తమ కుటంబ సభ్యులను రక్షించడంకోసం అరబ్ సైనికులను నియమంచుకున్నారు. ఈ అరబ్బులంతా నిజాంల వ్యక్తిగత సైన్యంలో ఎక్కువ భాగం ఉన్నారు. 'చివరి నిజాం', అరబ్బుల విధేయతను ఇష్టపడ్డాడని, అందరికంటే ఎక్కువగా వారిని నమ్మాడని చాలామంది చరిత్రకారులు పేర్కొన్నారు. దాంతో ఆ కాలంలో అరబ్ జనాభా పెరిగింది. అప్పుడు గేటెడ్ నగరం శివార్లలో ఈ ప్రాంతం ఏర్పడింది.

సంస్కృతి

మార్చు

ఈ ప్రాంతంలో అరబ్ సంస్కృతి ప్రభావం ఉంటుంది.[2] తరువాత హైదరాబాద్ సంస్కృతిలో కలిసింది.[3]

స్థానిక వంటకాల్లో హరీస్ అనే తీపి పదార్థం బార్కాస్‌లో మాత్రమే దొరుకుతుంది. ఇటీవలికాలంలో చికెన్ లేదా మటన్ తో తయారుచేసిన యెమెన్ రైస్ డిష్ ఈ ప్రాంతంలో ప్రాచూర్యం పొందింది. బార్కాస్ లోని రెస్టారెంట్లలో ఇది లభిస్తోంది.[4]

ప్రధాన ఆకర్షణలు

మార్చు
  1. ఇక్కడున్న 'జమా మసీదు' బాగా ప్రాచూర్యం పొందింది.
  2. ఈ ప్రాంతంలోని 'బర్కాస్ మైదానం', ఫుట్‌బాల్ ఆట ఆడేవారికి ఉపయోగపడుతోంది. జాతీయ, అంతర్జాతీయస్థాయిలో పురస్కారాలను గెలుచుకున్న హబీబ్ ఖాన్, సలాం ఐడ్రూసి, మాజిద్ ఖాన్ వంటి ఫుట్‌బాల్ క్రీడాకారులు ఇక్కడే ప్రాక్టీసు చేసేవారు.
  3. శంషాబాద్ విమానాశ్రయం నుండి చాంద్రాయణగుట్ట కూడలికి వెళ్ళే 'మండి రోడ్' ఈ ప్రాంతంనుండే ప్రారంభమవుతోంది. ఇక్కడ అత్యంత ప్రాచుర్యం పొందిన అరబ్ వంటకమైన మండి పేరును ఈ రహదారికి పెట్టబడింది.[4]

మూలాలు

మార్చు
  1. A home for the Chaush community, The Hindu, 25 Sep 2011
  2. "The haleem debate: Why some Indian Muslims are renaming the Ramzan delicacy 'daleem'". Archived from the original on 2019-06-03. Retrieved 2021-01-13.
  3. "Little Arabia - Times of India". The Times of India. Retrieved 2021-01-13.
  4. 4.0 4.1 Aneez, Prabalika M. Borahzeenab (2014-07-18). "So, what's khaas about Barkas?". The Hindu. ISSN 0971-751X. Retrieved 2021-01-13.
"https://te.wikipedia.org/w/index.php?title=బార్కస్&oldid=4149929" నుండి వెలికితీశారు