ఆర్కిటెక్ రంగంలో అగ్రగామిగా పేరొందిన  ప్రముఖ ఆర్కిటెక్ట్‌ (భవన నిర్మాణ శిల్పి) బాలకృష్ణ దోషికి బ్రిటన్‌కు చెందిన ప్రతిష్ఠాత్మకమైన రాయల్‌ గోల్డ్‌ మెడల్‌ 2022 పురస్కారం లభించింది. ఆర్కిటెక్చర్‌లో అత్యున్నత గౌరవంగా భావించే ఈ పురస్కారాన్ని గెల్చుకున్న మొట్టమొదటి భారతీయుడు గా దోషి ప్రసిద్ధి చెందాడు.[1]

బాలకృష్ణ దోషి
Doshi in డిసెంబర్ 2013
జాతీయతఇండియన్
విద్యాసంస్థJ. J. School of Architecture, Mumbai
వృత్తిఆర్కిటెక్ట్
పురస్కారాలుపద్మ భూషణ్
పద్మశ్రీ
ఆర్డర్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ లెటర్స్
ప్రిట్జ్కర్ ప్రైజ్
ఆర్కిటెక్చర్‌కు అగాఖాన్ అవార్డు
రాయల్ గోల్డ్ మెడల్
Practiceవాస్తు శిల్ప కన్సల్టెంట్స్
భవనాలుIIM-Bangalore, IIM Udaipur, National Institute of Fashion Technology New Delhi

వ్యక్తిగత జీవితం మార్చు

బి.వి దోషి గా ప్రసిద్ధి చెందిన బాలకృష్ణ విఠల్దాస్ దోషి. ఆగస్టు 26 1927 వ సంవత్సరంలో జన్మించాడు.  1947లో ముంబైలోని సర్ జేజే స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్‌లో ఆర్కిటెక్చర్ విద్యను అభ్యసించడం ప్రారంభించాడు.ఆ తరువాత  1950లలో ఆర్కిటెక్చర్‌ మార్గదర్శిగా భావించే లె కార్బుసియర్‌తో పని చేయడానికి పారిస్ వెళ్లాడు.  కార్బుసయర్‌తో కలిసి పని చేసిన అనంతరం 1954లో భారతదేశానికి తిరిగి వచ్చారు. చండీగఢ్, అహ్మదాబాద్‌లలో పలు ప్రాజెక్టులపై పని చేశారు. అనేక సంస్థలు, గృహ నిర్మాణ ప్రాజెక్టులు, ప్రభుత్వ కార్యాలయాలు, గ్యాలరీలు, ప్రైవేట్ నివాసాలకు దోషి రూపకల్పన చేశారు.

అలాగే ఇండోర్‌లో తక్కువ ఖర్చుతో గృహ నిర్మాణ ప్రాజెక్టును రూపొందించింది కూడా ఆయనే. ఆ పథకం కింద నిర్మించిన 6,500 ఇళ్లలో ప్రస్తుతం సుమారు 80 వేల మంది మధ్యతరగతి ప్రజలు నివసిస్తున్నారు.[2]

అవార్డులు మార్చు

  • 2018లో, ఆర్కిటెక్చర్‌లో అత్యంత ప్రతిష్టాత్మకమైన బహుమతులలో ఒకటిగా పరిగణించబడే ప్రిట్జ్‌కర్ ఆర్కిటెక్చర్ ప్రైజ్‌ని అందుకున్న మొదటి భారతీయ వాస్తుశిల్పిగా నిలిచాడు.
  • పద్మశ్రీ ,పద్మభూషణ్ పురస్కారాలు లభించాయి.
  • ఆర్డర్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ లెటర్స్
  • ఆర్కిటెక్చర్‌ అగాఖాన్ అవార్డు
  • 2022 వ సంవత్సరానికి గాను రాయల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్రిటిష్ ఆర్కిటెక్ట్స్ ' రాయల్ గోల్డ్ మెడల్‌ను అందుకున్నాడు

ఆర్‌ఐబీఏ(రాయల్ గోల్డ్ మెడల్ )  ప్రశంస మార్చు

94 ఏళ్ల దోషి, తన 70 ఏళ్ల కెరీర్‌లో వందకు పైగా ప్రాజెక్టులు నిర్మించారని భారత్‌లో, సమీప ప్రాంతాల్లో ఆర్కిటెక్చర్‌ దిశగా బోధన, అభ్యసనపై గొప్ప ప్రభావితం  చూపారని ఆర్‌ఐబీఏ పేర్కొంది. అర్కిటెక్చర్‌ రంగానికి దోషి, విశేష సేవలు అందించారని, ఆయనకు అవార్డు ప్రకటించిన కమిటీకి అధ్యక్షత వహించినందుకు గర్వంగా ఉందని ఆర్‌ఐబీఏ అధ్యక్షుడు సిమోన్‌ ఆల్‌ఫోర్డ్‌ పేర్కొన్నారు.[3]

పదవులు మార్చు

వాస్తుశిల్పిగా అతను  అంతర్జాతీయ ఖ్యాతితో పాటు, విద్యావేత్తగా సంస్థ బిల్డర్‌గా కూడా ప్రసిద్ధి చెందారు.

  • స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్, అహ్మదాబాద్ మొదటి వ్యవస్థాపక డైరెక్టర్(1962-72)
  • స్కూల్ ఆఫ్ ప్లానింగ్  మొదటి వ్యవస్థాపక డైరెక్టర్ (1972-79)
  • పర్యావరణ ప్రణాళిక సాంకేతికత కేంద్రం మొదటి వ్యవస్థాపక డీన్ (1972-81)
  • అహ్మదాబాద్‌లోని విజువల్ ఆర్ట్స్ సెంటర్ వ్యవస్థాపక సభ్యుడు.
  • అహ్మదాబాద్‌లోని కనోరియా సెంటర్ ఫర్ ఆర్ట్స్ మొదటి వ్యవస్థాపక డైరెక్టర్ గా కూడా పనిచేసాడు.

ఇతర విషయాలు మార్చు

జాతీయంగా ,అంతర్జాతీయంగా ప్రసిద్ధి చెందిన పరిశోధనా సంస్థ వాస్తు-శిల్ప ఫౌండేషన్ ఫర్ స్టడీస్ అండ్ రీసెర్చ్ ఇన్ ఎన్విరాన్‌మెంటల్ డిజైన్‌ను స్థాపించడంలో దోషి కీలక పాత్ర పోషించారు.  ఈ ఇన్‌స్టిట్యూట్ తక్కువ ఖర్చుతో కూడిన హౌసింగ్ సిటీ ప్లానింగ్‌లో అగ్రగామిగా పనిచేసింది. వినూత్న మార్గాల్లో డిజైన్లు రూపొందించే వ్యక్తిగా కూడా  ప్రసిద్ది చెందాడు.

మూలాలు మార్చు

  1. "'ఆర్కిటెక్చర్ నోబెల్' గెల్చుకున్న భారతీయుడు". BBC News తెలుగు. Retrieved 2022-02-21.
  2. "Balkrishna Doshi Named 2018 Pritzker Prize Laureate". ArchDaily. 7 March 2018. Retrieved 7 March 2018.
  3. "ప్రముఖ ఆర్కిటెక్ట్ బాలకృష్ణ దోషికి బ్రిటన్ రాయల్ గోల్డ్ మెడల్". Telugu Times USA NRI Telugu News Telugu News Papers In USA (in ఇంగ్లీష్). Retrieved 2022-02-21.