బాలసుధాకర్ మౌళి

బాలసుధాకర్ మౌళి తెలుగు రచయిత. అతను రాసిన "ఆకు కదలని చోట" కవిత్వ సంపుటికిగాను 2018 కేంద్ర సాహిత్య యువ పురస్కారానికి ఎంపికయ్యాడు.[1]

బాలసుధాకర్ మౌళి
జననం
బాల సుధాకర్

వృత్తిఉపాధ్యాయుడు, రచయిత, కవి
సుపరిచితుడు/
సుపరిచితురాలు
ఆకు కదలని చోట
నోట్సు

జీవిత విశేషాలు మార్చు

అతను విజయనగరం జిల్లా మెంటాడ మండలం పోరాం గ్రామంలో జన్మించాడు. అతను విజయనగరం జిల్లాలోని గర్భాం జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో జీవశాస్త్ర ఉపాధ్యాయునిగా పని చేస్తున్నాడు. ఉత్తరాంధ్ర కవిత్వంలో నవ్య గొంతుకగా మౌళి నిలిచాడు. 2014లో ఆయన ప్రచురించిన "ఎగరాల్సిన సమయం" కవితా సంపుటి సాహితీవిమర్శకుల ప్రశంసలను అందుకొంది. అనేక అవార్డులను పొందింది. ఆ తరువాత రెండేళ్లకు "ఆకు కదలని చోట" సంపుటిని మౌళి వెలువరించాడు. తన తరగతి గదిలోని విద్యార్థుల కవిత్వంతో 2017లో "స్వప్న సాధకులు" అనే సంకలనం ప్రచురించాడు. పదేళ్లుగా కవిత్వంలో తన ముద్ర కోసం ప్రయత్నిస్తున్న మౌళి అనేక అవార్డులను అందుకొన్నాడు.

రచనలు మార్చు

 • ఆకు కదలని చోట (కవిత్వం-2016)
 • ఎగరాల్సిన సమయం (కవిత్వం-2014)
 • నీళ్లలోని చేప (కవిత్వం-2018)
 • భూమి పెదాలపై (కవిత్వం-2019)
 • దుఃఖపు వొరుపు (కవిత,కథ,డైరి-లాక్డౌన్ సాహిత్యం-2021)
 • స్వప్న సాధకులు (2017-విద్యార్థుల కవిత్వం-సంపాదకత్వం)
 • చర్య 5th బులిటెన్ - రైతుపోరాట ప్రత్యేక సంచిక (జనవరి,2021-సంపాదకత్వం)
 • నిర్వేదస్థలం (కవిత్వం-మే 2022)
 • తరగతిగది స్వప్నం (దీర్ఘకవిత - డిసెంబర్ 2022)
 • అస్తిత్వ వాచకం (కవిత్వం-మే 2023)

పురస్కారాలు మార్చు

మూలాలు మార్చు

 1. "నారంశెట్టి, మౌళిలకు అకాడమీ పురస్కారాలు".

2.http://www.teluguvelugu.in/vyasalu.php?news_id=NjE5&subid=MTA=&menid=Mw==&authr_id=NTMz

ఇతర లంకెలు మార్చు