బాలాపూర్ లడ్డు

వినాయకుడి నిమజ్జనానికి ముందు నైవేద్యంగా ఆర్పించిన లడ్డు

వినాయక చవితి రోజున మట్టితో తయారు చేసిన వినాయకుడుని నెలకొల్పి గణేష్ నవరాత్రులు సందర్బంగా పూజలు చేసి వినాయకుడిని నిమజ్జనం చేస్తారు. వినాయకుడిని నిమజ్జనము చేసే ముందు వినాయకుని విగ్రహాని భక్తులు ఊరేగిస్తారు. వినాయకుని గ్రామోత్సవానికి ముందు గణేశుడికి నైవేద్యంగా ఆర్పించే వాటిలో లడ్డూ బాగా ప్రసిద్ధి చెందింది.

వినాయక చవితి సందర్భంగా ఏర్పాటు చేయబడిన వినాయకుని మట్టి విగ్రహం (విద్యుదీపాలంకరణలో) - ఈయన చేతికి చేరిన లడ్డూ ప్రసాదంగా పొందిన వారు కీర్తిప్రతిష్ఠలు పొందుతారని హిందువుల ప్రగాఢ విశ్వాసం

బాలాపూర్ గ్రామం మార్చు

తెలంగాణ రాష్ట్రం, రంగారెడ్డి జిల్లా, మహేశ్వరం లో బాలాపూర్ గ్రామం ఉంది. ఇక్కడ ప్రతి ఏడాది వినాయక చవితి కి వినాయకుడి లడ్డును వేలం వేస్తారు. రాష్ట్రం నలుమూలల నుండి భక్తులు వచ్చి వేలంపాటలో ఈ లడ్డును రాష్ట్రంలోనే అత్యధికంగా వేలం పాట పడి దక్కించుకుంటారు. దీనితో బాలాపూర్ లడ్డు ఎంతో ప్రాముఖ్యతను సంపాదించుకుంది. బాలాపూర్ లడ్డుతో అన్ని విధాలా అదృష్టం కలసివస్తుందని భక్తులకు నమ్మకంగా మారింది.

బాలాపూర్ లడ్డు విశిష్టత మార్చు

బాలాపూర్ గణేష్ ఉత్సవ సమితి 1980లో ఏర్పాటైంది. తొలిసారి 1994లో బాలాపూర్ లడ్డు వేలంపాట ప్రారంభమైంది. తొలిసారి జరిగిన వేలంపాటలో వ్యవసాయదారుడైన కొలను మోహన్ రెడ్డి కుటంబం రూ.450 దక్కించుకున్నాడు. ఆ లడ్డును ఆయన పొలంలో చల్లాడు ఆ ఏడాది ఆర్థికంగా ఆయనకు కలిసిరావండంతో, 1995లో రూ. 4500 లకు మరోసారి వేలంపాటలో లడ్డును దక్కించుకున్నాడు. ఆయనకు లడ్డు వేలం బాగా కల్సివచ్చింది. దీనితో లడ్డు ఎంతో మహిమలు కలదని, అంత మంచే జరుగుతుందనే నమ్మకంతో బాలాపూర్ లడ్డుకి భక్తుల్లో నమ్మకం పెరిగింది. ప్రతి ఏడాది వందల నుండి వేలు, వేలు నుండి లక్షలకు లడ్డు వేలంపాట చేరుకుంది. బాలాపూర్ లడ్డు దక్కించుకున్న వారి ఇంట్లో సిరిసంపదలు విరజిల్లుతాయని.. పసిడి పంటలు పండుతాయని భక్తుల్లో విశ్వాసం పెరిగింది.

లడ్డు వేలం విధానం మార్చు

బాలాపూర్ లడ్డు కోసం వినాయక చవితి మొదట రోజు నుండి లడ్డు కోసం పోటీపడుతున్న వారి దరఖాస్తులను ప్రారంభించి నిమజ్జనం నాడు ఉదయం 7 గంటలకు అప్లికేషన్లను ముగించేస్తారు. లడ్డు వేలం పాట మొదట రూ. 1,116 లతో ప్రారంభమవుతుంది. వేలంపాటలో లడ్డును దక్కించుకున్న వారు బాండ్ పై సంతకం చేసి వచ్చే ఏడాది వేలం పాటనాడు డబ్బులు ఇవ్వాలి. గణేష్ లడ్డు వేలంపాట ద్వారా వచ్చిన డబ్బు బాలాపూర్ ఉత్సవ కమిటీ గ్రామాభివృధికి, సేవా కార్యక్రమాలకు ఖర్చు పెడతారు. ఈ డబ్బు తో గ్రామంలో పాఠశాలలు, రోడ్లు, దేవాలయాలకు వినియోగిస్తారు.[1]

లడ్డు వేలం పాటలో దక్కించుకున్నవారు మార్చు

  1. 1994 - కొలను మోహన్ రెడ్డి - రూ.450,
  2. 1995 - కొలను మోహన్ రెడ్డి - రూ.4500,
  3. 1996- కొలను కృష్ణారెడ్డి - రూ.18,000,
  4. 1997- కొలను కృష్ణారెడ్డి - రూ.28,000,
  5. 1998- కొలను మోహన్ రెడ్డి - రూ.51,000,
  6. 1999- కళ్లెం ప్రతాప్ రెడ్డి - రూ.65,000,
  7. 2000- కళ్లెం అంజిరెడ్డి - రూ.66,000
  8. 2001- జి. రఘునందన్ చారి - రూ.85,000
  9. 2002- కందాడ మాధవరెడ్డి - రూ.1,05,000 లక్షలు
  10. 2003- చిగురింత బాల్ రెడ్డి - రూ.1,55,00 లక్షలు
  11. 2004- కొలన్ మోహన్ రెడ్డి - రూ.2,01,000 లక్షలు
  12. 2005- ఇబ్రహీం శేఖర్ - రూ.2,08,000 లక్షలు
  13. 2006- చిగురింత తిరుపతి రెడ్డి - రూ.3,00,000 లక్షలు
  14. 2007- రఘునందన్ చారి - రూ.4,15,000 లక్షలు
  15. 2008- కొలన్ మోహన్ రెడ్డి - రూ.5,07,000 లక్షలు
  16. 2009- సరిత - రూ.5,10,000 లక్షలు
  17. 2010- కొడాలి శ్రీధర్ బాబు - రూ.5,35,000 లక్షలు
  18. 2011- కొలన్ ఫ్యామిలీ - రూ.5,45,000 లక్షలు
  19. 2012- పన్నాల గోవర్థన్ - రూ.7,50,000 లక్షలు
  20. 2013- తీగల కృష్ణారెడ్డి - రూ.9,26,000 లక్షలు
  21. 2014- సింగిరెడ్డి జైహింద్ రెడ్డి - రూ.9,50,000 లక్షలు
  22. 2015- కళ్లెం మదన్ మోహన్ రెడ్డి - రూ.10,32,000 లక్షలు
  23. 2016- స్కైలాబ్ రెడ్డి - రూ.14,65,000 లక్షలు
  24. 2017- నాగం తిరుపతి రెడ్డి - రూ.15,60,000 లక్షలు[2]
  25. 2018- శ్రీనివాస్ గుప్తా - రూ.16,60,000లక్షలు [3]
  26. 2019- కొలను రామిరెడ్డి - రూ.17,60,000 లక్షలు[4]
  27. 2020 - కరోనా కారణంగా వేలం పాట జరగలేదు[5]
  28. 2021 - మర్రి శశాంక్ రెడ్డి, రమేశ్ యాదవ్ రూ.18,90,000 లక్షలు[6]
  29. 2022 -వంగేటి లక్ష్మారెడ్డి - రూ.24,60,000 లక్షలు[7]

మూలాలు మార్చు

  1. టివి9 తెలుగు, TV9 Telugu Web (12 September 2019). "మరోసారి రికార్డులను బ్రేక్ చేసిన బాలాపూర్ లడ్డు - Balapur Ganesh Laddu Breaks All time Record - TV9 Telugu". Archived from the original on 12 September 2019. Retrieved 12 September 2019.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  2. నమస్తే తెలంగాణ (5 September 2017). "15 లక్షల 60 వేలు పలికిన బాలాపూర్ లడ్డు". www.ntnews.com. Archived from the original on 12 September 2019. Retrieved 12 September 2019.
  3. Andrajyothy (24 September 2018). ""బాలాపూర్‌ లడ్డు దక్కించుకోవడంతో నా కల నెరవేరింది.."". Archived from the original on 13 July 2021. Retrieved 13 July 2021.
  4. ఈనాడు, తాజావార్తలు (12 September 2019). "బాలాపూర్‌ లడ్డూ రూ.17.60 లక్షలు". www.eenadu.net (in ఇంగ్లీష్). Archived from the original on 12 September 2019. Retrieved 12 September 2019.
  5. The Hans India (24 July 2020). "No auction for Hyderabad Balapur laddu this 2020" (in ఇంగ్లీష్). Archived from the original on 10 September 2022. Retrieved 10 September 2022.
  6. Sakshi (19 September 2021). "రికార్డు ధర పలికిన బాలాపూర్ లడ్డూ.. ఎంతో తెలుసా?". Archived from the original on 10 September 2022. Retrieved 10 September 2022.
  7. V6 Velugu (9 September 2022). "బాలాపూర్ లడ్డూను దక్కించుకున్న వంగేటి లక్ష్మారెడ్డి". Archived from the original on 10 September 2022. Retrieved 10 September 2022.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)