బాల గంధర్వ అసలు పేరు , నారాయణ్ శ్రీపాద్ రాజ్‌హంస్ ( 1888 - 1967 ). మరాఠీ గాయకుడు, నాటక కళాకారుడైన బాల గంధర్వ స్త్రీ పాత్రలు ధరించేవాడు. ఎందుకంటే ఆ కాలంలో స్త్రీలను నాటకాల్లో వేషాలు వేయనిచ్చేవారు కాదు.

Bal Gandharva in female role
బాల గంధర్వ ఆడవేషంలో

సంగీత ప్రస్థానంసవరించు

ఒకసారి పుణె నగరంలోనారాయణ్‌ తన పది పండ్రెండేళ్ళ వయసులో పాడగా విని, లోకమాన్య బాలగంగాధర తిలక్ నారాయణ్‌కు బాల గంధర్వ అని బిరుదు నిచ్చాడు. బాల గంధర్వ ఎన్నో నాటకాలలో వేషాలు వేసి, మరాఠీ నాట్య గీతాలను పాడి, ప్రజలలో వాటికి ఎంతో ప్రాచుత్యాన్ని కలుగజేశాడు. అతడు భాస్కర్- బువా బఖ్లే శిష్యుడు. బాల గంధర్వ సమకాలికులు కేశవరావ్ భోస్లే, దీనానాథ్ మంగేష్కర్ లు. 1905 లో కిర్లోస్కర్ సంగీత మండలి లో బాల గంధర్వ తన సంగీత ప్రస్థానాన్ని ప్రారంభించాడు. బాల గంధర్వ, గణ్‌పత్ రావ్, గోవిందరావు టెంబే లు ఆ కంపనీని విడిచిపెట్టి, 1913లో గంధర్వ సంగీత మండలి ని స్థాపించారు. కాని అది అప్పుల్లో కూరుకు పోయింది. అంతలోనే గౌహర్ జాన్ ఏప్రిల్, 1938 లో వాళ్ళ కంపనీలో చేరింది. నారాయణ్ రావ్ ఆమె 1951 లో వివాహమాడారు. గౌహర్ 1964లో మరణించింది. నారాయణ్ రావ్ 1967 లో మరణించాడు. పుణె లోని బాల గంధర్వ ఆడిటోరియం అతని గౌరవార్థంగా పిలువబడుతోంది.

ప్రముఖ పాత్రలుసవరించు

బాల గంధర్వ వేసిన ప్రముఖ పాత్రలు : 1. భామిని - మాన్‌అపమాన్ లో. ( 1911 ) 2. రుక్మిణి - రుక్మిణీ స్వయంవరం లో. ( 1916 ) 3. సింధు - ఏకచ్ ప్యాలా లో. ( 1919 )

బయటి లింకులుసవరించు

  • [1] Archived 2009-04-21 at the Wayback Machine హిందూ దినపత్రిక లో బాల గంధర్వ గురించి
  • [2] బాల గంధర్వ పాడిన పాటలు