బావి లోని నీరును చేతితో తోడడానికి చేదను ఉపయోగిస్తారు. చేదతో నీరును సురక్షితంగా, సులభంగా తోడేందుకు ఉపయోగపడే పరికరాన్ని గిలక అంటారు.

గిలకతో నీరు సులభంగా తోడడమే కాకుండా తొందరగా పని జరుగుతుంది. నేడు నీటిని తోడేందుకు మోటార్లు ఉపయోగిస్తున్నందువలన, బోరు బావుల వలన గిలక వాడకం తక్కువయింది.

సూచనలు

మార్చు

గిలక సులభంగా తిరగడానికి, శబ్దం రాకుండా ఉండడానికి గిలక ఇరుసు భాగంలో కందెన లేదా నూనెను కొద్దిగా పూయాలి.

నీరును తోడేందుకు ఉపయోగించే తాడుకు మధ్యలో ముడులు లేకుండా ఉంటే మంచిది.

ముడులు ఉండుట వలన సమయం వృధా అవడమే కాకుండా కష్టం కూడా అంతేకాకుండా ముడుల వద్ద ఛేదను లాగేటప్పుడు తాడు తెగిపోవడం లేదా గిలక మీద నుంచి తాడు పక్కకి పడిపోవడం లేదా గిలకలో ఇరుక్కోవడం జరుగుతుంది.

గిలక మరి చిన్నది కాకుండా మరి పెద్దది కాకుండా మధ్యస్తంగా ఉండుట వలన పని తొందరగా పూర్తవడమే కాకుండా సులభంగా కూడా ఉంటుంది.

గిలక ఒక వైపు వాలి నట్టు ఉండక సమంగా ఉండుట వలన తాడు జారిపోకుండా ఉంటుంది.

చేదను బావిలో వేసినప్పుడు బావి మొత్తలు చేదకు తగలకుండా నీటితో నిండిన ఛేదను పైకి లాగినపుడు ఛేదను సులభంగా అందుకునే విధంగా గిలకను ఏర్పాటు చేయాలి.

బావికి ఉన్న గట్టు, గట్టు మీది దిమ్మెలు, దిమ్మెపై అమర్చిన దూలం, దూలానికి అమర్చిన గిలక మొత్తం పటిష్ఠంగా ఉండుట వలన ఎటువంటి ప్రమాదాలు జరగకుండా ఉంటాయి.

ఇవి కూడా చూడండి

మార్చు

గ్యాలరీ

మార్చు
"https://te.wikipedia.org/w/index.php?title=బావి_గిలక&oldid=3161993" నుండి వెలికితీశారు