బాష్ప వాయువు
బాష్ప వాయువు అంటే విపరీతంగా కళ్ళలో మంట, కళ్ళలో నీళ్ళు తిరిగేలా చేయగల రసాయనాల మిశ్రమం. దీన్ని లాక్రిమేటరీ ఏజెంట్ అని కూడా అంటారు. లాటిన్‌లో లాక్రిమా అంటే కన్నీరు అని అర్థం. దీనివల్ల ఒక్కోసారి స్వల్పంగా దురద, శ్వాస సంబంధిత ఇబ్బందులు కూడా కలుగుతాయి. దీన్ని సాధారణంగా పోలీసులు ఆందోళనకారులను చెదరగొట్టడానికి ఉపయోగిస్తారు. దీని వల్ల కలిగే ప్రభావాలు కేవలం తాత్కాలికం మాత్రమే. కొన్ని నిమిషాలలోనే ఈ లక్షణాలు నుంచి పూర్తిగా కోలుకొనవచ్చు. గ్యాస్ మాస్క్ వాడటం ద్వారా బాష్ప వాయు ప్రయోగం నుంచి తప్పించుకోవచ్చు. కొన్ని సందర్భాల్లో ఇది తీవ్రమైన కంటి నొప్పి, శ్వాసకోశ నొప్పి, చర్మపు చికాకు, రక్తస్రావం, అంధత్వానికి కూడా దారితీస్తుంది.
లాక్రిమేటరీ ఏజెంట్లను సాధారణంగా అల్లర్ల నియంత్రణ కోసం పోలీసులు వాడుతారు. అయితే యుద్ధాల్లో దీనిని ఉపయోగించడాన్ని వివిధ అంతర్జాతీయ ఒప్పందాల ద్వారా నిషేధించారు.[NB 1] మొదటి ప్రపంచ యుద్ధ సమయంలో, విషపూరితమైన, ప్రమాదకరమైన లాక్రిమేటరీ ఏజెంట్లను ఉపయోగించారు.
బాష్ప వాయువులకు గురికావడం వల్ల అనేక స్వల్పకాలిక, దీర్ఘకాలిక ఆరోగ్య ప్రభావాలు ఏర్పడవచ్చు. ముఖ్యంగా అధిక సాంద్రతలలో బాష్ప వాయువుకు గురికావడం, ధరాళంగా గాలి వీచని మూసేసిన ప్రదేశాల్లో బాష్ప వాయువుకు గురైనపుడు.. శ్వాసకోశ వ్యాధులు, తీవ్రమైన కంటి వ్యాధులు (ఆప్టిక్ న్యూరోపతి, కెరాటిటిస్, గ్లాకోమా, కంటిశుక్లం వంటివి), చర్మవ్యాధులతో సహా మరణం కూడా సంభవించవచ్చు.[1]
బాష్ప వాయువు సమ్మేళనం
మార్చుబాష్ప వాయువుగా ఉపయోగించే సాధారణ లాక్రిమేటర్లలో పెప్పర్ స్ప్రే (OC గ్యాస్), పావా స్ప్రే ( నోనివామైడ్ ), సిఎస్ గ్యాస్, సిఆర్ గ్యాస్, సిఎన్ గ్యాస్ (ఫెనాసిల్ క్లోరైడ్), బ్రోమోఅసెటోన్, జిలైల్ బ్రోమైడ్, మాస్ (బ్రాండెడ్ మిశ్రమం) ఉన్నాయి.
బాష్ప వాయువు గోళాల్లో ఘన లేదా ద్రవ సమ్మేళనాలు (బ్రోమోఎసెటోన్ లేదా జిలైల్ బ్రోమైడ్ ) ఉంటాయి, అది నేరుగా వాయు రూపంలో ఉండదు.[2] కళ్ళు, ముక్కు, నోరు, ఊపిరితిత్తులలోని శ్లేష్మ పొరలను చికాకు పెట్టడం ద్వారా బాష్ప వాయువు పనిచేస్తుంది. ఇది కన్నీరు కారడానికి, తుమ్ము, దగ్గు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందికీ, కళ్ళలో నొప్పి, తాత్కాలిక అంధత్వానికీ కారణమవుతుంది. చికాకు పరచే లక్షణాలు, సాధారణంగా వాయువు పీల్చిన 20 నుండి 60 సెకండ్ల తర్వాత కనిపిస్తాయి.[3] సాధారణంగా వాయూ ఉన్నచోటి నుండి దూరంగా వెళ్ళాక, 30 నిమిషాల్లోనే తగ్గిపోతాయి.
ఇబ్బందులు
మార్చుబాష్ప వాయువుల వల్ల పరిణామాలు మామూలుగా కొద్దిపాటి చర్మపు దురదకే పరిమితంగా ఉంటాయి. అయితే, దీర్ఘకాలపు సమస్యలు కూడా ఏర్పడవచ్చు. ఉబ్బసం వంటి శ్వాసకోశ ఇబ్బందులు ముందే ఉన్నవారికి సమస్యలు ఎక్కువగా ఉంటాయి. వారికి వైద్య సహాయం అవసరమౌతుంది.[3] కొన్నిసార్లు ఆసుపత్రిలో చేరడం లేదా వెంటిలేషన్ సహాయం కూడా అవసరం కావచ్చు.[4] CS గ్యాసు చర్మానికి తగిలినపుడు రసాయనికంగా చర్మం కాలవచ్చు [5] లేదా చర్మవ్యాధి రావచ్చు.[6][7] బాగా దగ్గరి నుండి ఈ వాయువు తగిలినపుడు, కంటి లోని కార్నియాపై మచ్చలు ఏర్పడవచ్చు, దృశ్య తీక్ష్ణత శాశ్వతంగా తగ్గవచ్చు.[8] ఎక్కువ సార్లు, ఎక్కువ మోతాదులో వాయువు ప్రభావానికి లోనైనపుడు శ్వాసకోశ సమస్యలు ఎదురయ్యే ప్రమాదం పెరుగుతుంది.[2]
ఉపయోగాలు
మార్చుఅల్లర్లలో
మార్చుబాష్ప వాయువును పోలీసులు అల్లర్లను అదుపు చేసి, శాంతిభద్రతలను నెలకొల్పే సమయంలో ఉపయోగిస్తారు.[9] కొన్ని దేశాలలో (ఉదా., ఫిన్లాండ్, ఆస్ట్రేలియా, అమెరికా), ఇందుకు మేస్ ను కూడా ఉపయోగిస్తారు. చిన్న స్ప్రే డబ్బాల్లో వచ్చే పెప్పర్ స్ప్రే రూపంలో ఇది ఉంటుంది. సిఎస్ వంటి ఇతర వాయువులు పోలీసుల ఉపయోగం కోసం తయారు చేస్తారు.[10] ఈ ఏజెంట్లలో జిలైల్ బ్రోమైడ్, సిఎన్, సిఎస్‌లు చాలాకాలంగా వినియోగిస్తున్నారు. సిఎస్ ఎక్కువగా ఉపయోగించేది కాగా, CN లో విషపు ఎక్కువగా ఉంటుంది.[3]
బాష్ప వాయువు గుళికలపై "ప్రమాదం: వ్యక్తి (ల) పై నేరుగా కాల్పులు జరపవద్దు. తీవ్రమైన గాయం లేదా మరణం సంభవించవచ్చు. " అనే హెచ్చరిక ఉంటుంది.[11] బాష్ప వాయువు తుపాకీలకు పేల్చే దూరాన్ని నిర్ణయించుకునే సెట్టింగ్ ఉండదు. లక్ష్యం దూరాన్ని బట్టి తుపాకీని కాల్చడానికి ఉన్న ఏకైక మార్గం, తుపాకీని ఎక్కుపెట్టే కోణాన్ని సరిగా ఎంచుకోవడం. సరైన కోణంలో తుపాకీని పెట్టకుండా కాలిస్తే, తగలకూడని లక్ష్యాలకు గుండు తగిలే ప్రమాదం ఉంది.
చికిత్స
మార్చుసాధారణ బాష్ప వాయువులకు నిర్దుష్టమైన విరుగుడంటూ లేదు.[3][12] వాయువు నుండి దూరంగా వెళ్ళి, స్వచ్ఛమైన గాలిలోకి ప్రవేశించడం మొట్టమొదటి చర్య.[13] కలుషితమైన దుస్తులను తొలగించడం, కలుషితమైన తువ్వాళ్ల వాడకాన్ని నివారించడం వలన చర్మంపై చర్యలు తగ్గుతాయి.[14] కాంటాక్ట్ లెన్స్‌లు వాడుతోంటే, వాటిని వెంటనే తొలగించాలి. ఎందుకంటే అవి వాయువు కణాలను పట్టుకుంటాయి.[12][14]
వాయువు సోకిన వ్యక్తికి సాధ్యమైనంత మేరకు రసాయనాన్ని తొలగించి, లక్షణాల నుండి ఉపశమనం పొందటానికి అనేక పద్ధతులు ఉన్నాయి.[3] కంటికి చేసే ప్రథమ చికిత్స - ధారళంగా నీటితో కడగడం, తల నుదురు, కనుబొమ్మల నుండి రసాయనాలు కళ్ళలోకి కారకుండా చూసుకోవాలి.[15][16] ముక్కు లోని రసాయనాలను వదిలించుకోవడానికి ముక్కును చీదాలి. కళ్ళను రుద్దుకోకూడదు. నీటి వలన సిఎస్ గ్యాస్ కలిగించే నొప్పి పెరుగుతుందని నివేదికలు ఉన్నప్పటికీ, ఆ ఆధాఅరాలు పరిమితంగానే ఉన్నాయి. అందుచేత నీరు లేదా సెలైన్‌లు ప్రస్తుతానికి అత్యుత్తమ చికిత్సలే.[12][17][18]
గృహవైద్యం
మార్చువినెగర్, పెట్రోలియం జెల్లీ, పాలు, నిమ్మరసం ద్రావణాలను కూడా బాష్ప వాయువుకు విరుగుడుగా కార్యకర్తలు ఉపయోగించారు.[19][20][21][22] వీటి ప్రభావం ఏ మేరకు ఉందో స్పష్టంగా తెలియదు. ముఖ్యంగా, వెనిగర్ వలన కళ్ళు మండుతాయి. దాన్ని ఎక్కువగా పీలిస్తే శ్వాస మార్గంలో నొప్పి కలిగుతుంది.[23] కూరగాయల నూనె, వెనిగర్‌లు పెప్పర్ స్ప్రే వల్ల కలిగే మంట నుండి కూడా ఉపశమనం కలిగిస్తాయనే నివేదికలు ఉన్నప్పటికీ, [14] బేకింగ్ సోడా గానీ, టూత్‌పేస్టును గానీ వాడాలని సూచిస్తూ, వాయుమార్గాల దగ్గర వాయువు నుండి వెలువడే కణాలను ఇవి బాగా పీల్చేసుకుంటాయని క్రూటర్ పేర్కొన్నాడు.[24] బేబీ షాంపూతో కళ్ళు కడుక్కునే ప్రయత్నం వలన ఎటువంటి ప్రయోజనమూ కలగలేదు.[12]
నోట్స్
మార్చు- ↑ E.g. the Geneva Protocol of 1925 prohibited the use of "asphyxiating gas, or any other kind of gas, liquids, substances or similar materials".
మూలాలు
మార్చు- ↑ Tear gas: an epidemiological and mechanistic reassessment by Jeffrey D. Laskin, Craig Rothenberg, Satyanarayana Achanta, Erik R. Svendsen, and Sven‐Eric Jordt
- ↑ 2.0 2.1 Rothenberg C, Achanta S, Svendsen ER, Jordt SE (August 2016). "Tear gas: an epidemiological and mechanistic reassessment". Annals of the New York Academy of Sciences. 1378 (1): 96–107. Bibcode:2016NYASA1378...96R. doi:10.1111/nyas.13141. PMC 5096012. PMID 27391380.
- ↑ 3.0 3.1 3.2 3.3 3.4 Schep LJ, Slaughter RJ, McBride DI (June 2015). "Riot control agents: the tear gases CN, CS and OC-a medical review". Journal of the Royal Army Medical Corps. 161 (2): 94–9. doi:10.1136/jramc-2013-000165. PMID 24379300.
- ↑ Carron PN, Yersin B (June 2009). "Management of the effects of exposure to tear gas". BMJ. 338: b2283. doi:10.1136/bmj.b2283. PMID 19542106.
- ↑ Worthington E, Nee PA (May 1999). "CS exposure—clinical effects and management". Journal of Accident & Emergency Medicine. 16 (3): 168–70. doi:10.1136/emj.16.3.168. PMC 1343325. PMID 10353039.
- ↑ ఉల్లేఖన లోపం: చెల్లని
<ref>
ట్యాగు;Schep2
అనే పేరుగల ref లలో పాఠ్యమేమీ ఇవ్వలేదు - ↑ Smith J, Greaves I (March 2002). "The use of chemical incapacitant sprays: a review" (PDF). The Journal of Trauma. 52 (3): 595–600. doi:10.1097/00005373-200203000-00036. PMID 11901348.[dead link]
- ↑ Oksala A, Salminen L (December 1975). "Eye injuries caused by tear-gas hand weapons". Acta Ophthalmologica. 53 (6): 908–13. doi:10.1111/j.1755-3768.1975.tb00410.x. PMID 1108587.
- ↑ Hu H, Fine J, Epstein P, Kelsey K, Reynolds P, Walker B (August 1989). "Tear gas—harassing agent or toxic chemical weapon?" (PDF). JAMA. 262 (5): 660–3. doi:10.1001/jama.1989.03430050076030. PMID 2501523. Archived from the original (PDF) on 29 October 2013.
- ↑ "Mace pepper spray". Mace (manufacturer). Archived from the original on August 5, 2013. Retrieved 21 February 2014.
- ↑ Smith E (28 January 2011). "Controversial tear gas canisters made in the USA". Africa. CNN.[permanent dead link]
- ↑ 12.0 12.1 12.2 12.3 Kim YJ, Payal AR, Daly MK (2016). "Effects of tear gases on the eye". Survey of Ophthalmology. 61 (4): 434–42. doi:10.1016/j.survophthal.2016.01.002. PMID 26808721.
- ↑ ఉల్లేఖన లోపం: చెల్లని
<ref>
ట్యాగు;Schep4
అనే పేరుగల ref లలో పాఠ్యమేమీ ఇవ్వలేదు - ↑ 14.0 14.1 14.2 Yeung MF, Tang WY (December 2015). "Clinicopathological effects of pepper (oleoresin capsicum) spray". Hong Kong Medical Journal. 21 (6): 542–52. doi:10.12809/hkmj154691. PMID 26554271.
- ↑ ఉల్లేఖన లోపం: చెల్లని
<ref>
ట్యాగు;Schep5
అనే పేరుగల ref లలో పాఠ్యమేమీ ఇవ్వలేదు - ↑ Chau JP, Lee DT, Lo SH (August 2012). "A systematic review of methods of eye irrigation for adults and children with ocular chemical burns". Worldviews on Evidence-Based Nursing. 9 (3): 129–38. doi:10.1111/j.1741-6787.2011.00220.x. PMID 21649853.
- ↑ Carron PN, Yersin B (June 2009). "Management of the effects of exposure to tear gas". BMJ. 338: b2283. doi:10.1136/bmj.b2283. PMID 19542106.
- ↑ Brvar M (February 2016). "Chlorobenzylidene malononitrile tear gas exposure: Rinsing with amphoteric, hypertonic, and chelating solution". Human & Experimental Toxicology. 35 (2): 213–8. doi:10.1177/0960327115578866. PMID 25805600.
- ↑ Agence France-Press. "Tear gas and lemon juice in the battle for Taksim Square". NDTV. Retrieved 23 June 2013.
- ↑ Doyle, Megan (24 June 2013). "Turks in Pittsburgh concerned for their nation". Pittsburgh Post-Gazette.
- ↑ Arango, Tim (15 June 2013). "Police Storm Park in Istanbul, Setting Off a Night of Chaos". The New York Times.
- ↑ Hughes, Gareth (25 June 2013). "Denbigh man tear gassed". The Free Press. Archived from the original on 28 June 2013. Retrieved 28 June 2013.
- ↑ "Vinegar EHS". Toxics Use Reduction Institute, UMAss Lowell. Archived from the original on 24 June 2013. Retrieved 22 June 2013.
- ↑ "Prof USB Mónica Kräuter, Cómo reaccionar ante las bombas lacrimógenas". Tururutururu (in యూరోపియన్ స్పానిష్). 26 May 2017. Archived from the original on November 7, 2017. Retrieved 1 November 2017.