బిజ్జుల తిమ్మభూపాలుడు

బిజ్జల తిమ్మభూపాలుడు 17వ శతాబ్దికి చెందిన రాజకవి. మురారి అను సంస్కృత కవి రచించిన "అనర్ఘరాఘవం" అను సంస్కృత నాటక గ్రంథాన్ని అదే పేరుతో తెలుగులో, పద్యరూపంలో అనువదించిన పండితకవి. 1675లో జన్మించిన తిమ్మభూపాలుడు రెడ్డి వంశానికి చెందిన వాడు. ఇతని తాత పెద్దతిమ్మ భూపాలుడు ప్రాగటూరును ఏలిన రెడ్డి వంశీయులలో సుప్రసిద్ధుడు. ఇతని తల్లి జనుంపల్లి(జమపల్లి) వెంకటరాజు కుమారై బచ్చమాంబ[1]. తిమ్మభూపాలుడు కూడా ప్రాగటూరు రాజధానిగా ఆలంపురం సీమను పాలించాడు. వనపర్తి రాజైన జనుంపల్లి బహిరిగోపాలరావు ఇతని మేనమామ. ఐదు ఆశ్వాశాలతో కూడిన అనర్ఘరాఘవీయంను తన ఆస్థానకవి అయిన కృష్ణకవి[2]. సహాయంతో పూర్తిచేశాడు. ఈ గ్రంథం ప్రాగటూరి రామేశ్వరస్వామికి అంకితం ఇవ్వబడింది.[3] తిమ్మభూపాలుడు 1725లో మరణించాడు. బిజ్జుల తిమ్మభూపాలుడు మురారి విజ్ఞానానికి కొరతరాని విధంగా అనర్ఘరాఘవాన్ని అనువాదం చేశాడు అని చాగంటి శేషయ్య గారు కీర్తించారు.

మూలాలు

మార్చు
  1. సమగ్ర ఆంధ్ర సాహిత్యం, 9 వ సంపుటం, ఆరవీటి రాజుల యుగం, రచన: ఆరుద్ర, ఎమెస్కో, సికింద్రాబాద్,1966, పుట-196
  2. సమగ్ర ఆంధ్ర సాహిత్యం,9 వ సంపుటం, ఆరవీటి రాజుల యుగం, రచన: ఆరుద్ర, ఎమెస్కో, సికింద్రాబాద్,1966, పుట-196
  3. పాలమూరు సాహితీ వైభవం, రచన: ఆచార్య ఎస్వీ రామరావు, పేజీ 56