బిద్యా దేవీ భండారీ
బిద్యా దేవీ భండారీ ( జననం 1961, జూన్ 19) నేపాల్‌కు రెండవ దేశాధ్యక్షురాలు. ఆమె 2015లో ఎన్నికయ్యారు. ఆ దేశానికి మొట్టమొదటి మహిళా రాష్ట్రపతి కూడా బిద్యానే కావడం విశేషం.[1][2] కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ నేపాల్ కు ఆమె వైస్ చైర్మన్ గా వ్యవహరించారు.[3][4] 28 అక్టోబరు 2015న రాష్ట్రపతిగా ఎన్నిక కాక ముందు బిద్యా ఆల్ నేపాల్ ఉమెన్ అసోసియేషన్ కు చైర్ పర్సన్ గా పనిచేశారు.[5] 549 పార్లమెంటరరీ ఓట్లలో, తన ప్రత్యర్ధి కుల్ బహదుర్ గురుంగ్ పై 327 ఓట్లు సంపాదించుకుని రాష్ట్రపతిగా ఎన్నికయారు. 2016లో ఫోర్బ్స్ ప్రపంచ 100 శక్తివంతమైన మహిళల జాబితాలో 52వ స్థానంలో నిలిచారు బిద్యా.[6] అంతకుముందు నేపాల్ ప్రభుత్వంలో రక్షణ శాఖా మంత్రిగా కూడా పనిచేశారు ఆమె. ఈ పదవిని చేపట్టిన మొదటి మహిళ బిద్యా.[7][8][9] 1990వ దశకంలో పర్యావరణ, జనాభా శాఖా మంత్రిగా కూడా బిద్యా వ్యవహరించారు.[10]
మూలాలు
మార్చు- ↑ "Nepal gets first woman President". Retrieved 28 October 2015.
- ↑ "Bidya Devi Bhandari elected first woman President of Nepal". Archived from the original on 2015-11-17. Retrieved 28 October 2015.
- ↑ "Who is Bidya Devi Bhandari?". Retrieved 28 October 2015.
- ↑ "World's Most Powerful Women".
- ↑ "The Himalayan Times: Oli elected UML chairman mixed results in other posts – Detail News: Nepal News Portal". The Himalayan Times. 15 July 2014. Archived from the original on 17 జూలై 2014. Retrieved 15 July 2014.
- ↑ "World's Most Powerful Women".
- ↑ "Nepali Times | The Brief » Blog Archive » Enemies within". nepalitimes.com. Retrieved 22 March 2014.
- ↑ "Women of Nepal". wwj.org.np. Archived from the original on 25 డిసెంబరు 2018. Retrieved 22 March 2014.
- ↑ "Related News | Bidya Bhandari". ekantipur.com. Archived from the original on 25 డిసెంబరు 2018. Retrieved 22 March 2014.
- ↑ http://indiatoday.intoday.in/story/who-is-bidya-devi-bhandari-what-are-the-10-things-you-need-to-know-about-her/1/509553.html