బిష్ణుపూర్
బిష్ణుపూర్, మణిపూర్ రాష్ట్రంలోని బిష్ణుపూర్ జిల్లా ముఖ్య పట్టణం, జిల్లా ప్రధాన కార్యాలయం. 15వ శతాబ్దంలో స్థాపించబడిన పురాతన విష్ణు ఆలయం నుండి దీనికి ఈ పేరు వచ్చింది.
బిష్ణుపూర్ | |
---|---|
పట్టణం | |
Coordinates: 24°38′00″N 93°46′00″E / 24.6333°N 93.7667°E | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | మణిపూర్ |
జిల్లా | బిష్ణుపూర్ |
జనాభా (2001) | |
• Total | 16,704 |
భాషలు | |
• అధికారిక | మీటిలాన్ (మణిపురి) |
Time zone | UTC+5:30 (భారత కాలమానం) |
పిన్‌కోడ్ | 795126 |
Vehicle registration | ఎంఎన్ |
పౌర పరిపాలన
మార్చుమున్సిపల్ కౌన్సిల్ గా మారిన బిష్ణుపూర్ పట్టణంలో 12 వార్డులు ఉన్నాయి.
జనాభా
మార్చు2011 భారత జనాభా లెక్కల ప్రకారం, [1] ఈ పట్టణంలో సుమారు 16,704 జనాభా ఉంది. ఈ జనాభాలో 52% (5,324) మంది పురుషులు, 48% (4,940) మంది స్త్రీలు ఉన్నారు. పట్టణ సగటు అక్షరాస్యత రేటు 82% ఉంది. ఇందులో పురుషుల అక్షరాస్యత 82% కాగా, స్త్రీల అక్షరాస్యత 72%గా ఉంది. మొత్తం జనాభాలో 12% మంది 6 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు గలవారు ఉన్నారు. ఈ పట్టణంలో మీటీలు, పంగలులు (మణిపురి ముస్లింలు), షెడ్యూల్డ్ తెగలవారు ఉన్నారు.
ఆర్థిక వ్యవస్థ
మార్చువ్యవసాయం
మార్చువ్యవసాయం, ఇక్కడి ప్రజల ప్రధాన వృత్తి. ఈ ప్రాంతంలో వరి, బంగాళాదుంప, క్యాబేజీ, పప్పుధాన్యాలు, వంకాయ, టమాటో మొదలైన పంటలు పండిస్తారు.
పర్యాటక ప్రాంతాలు
మార్చుఇది అనేక పర్యాటక ప్రాంతాలకు నిలయంగా ఉంది.[2]
- విష్ణు దేవాలయం: ఇది 15వ శతాబ్దంలో నిర్మించిన పురాతన విష్ణు దేవాలయం. ప్రస్తుత మయన్మార్‌లోని కబావ్ లోయలోని కయాంగ్ (షాన్ రాజ్యం) ను పాంగ్ రాజు చౌఫా ఖే ఖోంబాతో పాటు మణిపూర్ రాజు కయాంబా స్వాధీనం చేసుకున్నాడు. ఆ విజయంతో సంతోషించిన పాంగ్ రాజు, కయాంబ రాజుకు విష్ణువు విగ్రహాన్ని కానుకగా ఇచ్చాడు. కయాంబ రాజు ఈ విగ్రహాన్ని ఆరాధించడం ప్రారంభించాడు. దాంతో అది బిష్ణుపూర్ (విష్ణువు నివాసం) గా పిలువబడింది. ఆ తరువాత రాజు అక్కడ విష్ణు ఆలయాన్ని నిర్మించాడు. ఇప్పుడు అది భారత ప్రభుత్వ పురావస్తు మంత్రిత్వ శాఖ పరిధిలో రక్షిత చారిత్రక కట్టడంగా మార్చబడింది.
- రాస్మంచ
- జోరేబంగ్ల ఆలయం
- పంచరత్న ఆలయం
- దాల్ మదోల్
- సుసునియా పహార్
- శ్యామ్రాయ్ ఆలయం
- సిద్ధేశ్వర్ ఆలయం
- రాధా శ్యామ్ ఆలయం
- శ్రీధర ఆలయం
రాజకీయాలు
మార్చుఇది మణిపూర్ ఇన్నర్ లోక్‌సభ నియోజకవర్గ పరిధిలో ఉంది.
మూలాలు
మార్చు- ↑ "Census of India 2001: Data from the 2001 Census, including cities, villages and towns (Provisional)". Census Commission of India. Archived from the original on 16 June 2004. Retrieved 7 January 2021.
- ↑ "Top 8 Places To Visit In Manipur". Trans India Travels. 2016-12-05. Retrieved 7 January 2021.