బిస్మా మరూఫ్

పాకిస్తానీ మహిళా క్రికెటర్ , ఆల్ రౌండర్, కెప్టెన్

బిస్మా మరూఫ్ (జననం 18 జూలై 1991) ఒక పాకిస్తానీ మహిళా క్రికెటర్ , ఆల్ రౌండర్. ఆమె ఎడమచేతి వాటం బ్యాటర్. కుడిచేతి లెగ్ బ్రేక్ బౌలింగ్ చేస్తుంది.[1][2] జూన్ 2022లో , ఆమె ఒక రోజు అంతర్జాతీయ పోటీల లో, టి20ఐ క్రికెట్ లలో పాకిస్తాన్ మహిళల క్రికెట్ జట్టుకు అత్యధిక పరుగులు సాధించిన క్రీడాకారిణి (ప్రతి ఫార్మాట్లో 2000 కంటే ఎక్కువ పరుగులు చేసింది).[3] పాకిస్తాన్ తరఫున 200 మ్యాచ్ లకు పైగా ఆడింది - 2013, 2020ల మధ్య జట్టుకు నాయకత్వం వహించింది. పాకిస్తాన్ తరఫున ఒకరోజు అంతర్జాతీయ పోటీలలో 1,000 పరుగులు చేసిన మొదటి మహిళ.[4][5][6] మరూఫ్ 2022 ప్రపంచ కప్ ముందు డిసెంబర్ 2021 లో బిడ్డకు జన్మనివ్వడానికి క్రికెట్ నుండి విరామం తీసుకుంది. లాహోర్, జరాయ్ తారాకియాటి బ్యాంక్ లిమిటెడ్, పాకిస్తాన్ విశ్వవిద్యాలయాల తరపున దేశీయ క్రికెట్ ఆడింది[7][8] 2022, మహిళల ఒక రోజు పోటీల చరిత్రలో, ఒక్క శతకం లేకుండా 3,017 పరుగులతో అత్యధిక పరుగులు చేసిన ప్రపంచ రికార్డును ఆమెకు ఉంది.[9] మార్చి 23, 2023న బిస్మాకు పాకిస్తాన్ నాల్గవ అత్యున్నత పౌర పురస్కారం తమ్ఘా - ఎ - ఇమ్తియాజ్ లభించింది.[10]

బిస్మా మరూఫ్
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు
బిస్మా మరూఫ్
పుట్టిన తేదీ (1991-07-18) 1991 జూలై 18 (వయసు 33)
లాహోర్, పంజాబ్, పాకిస్తాన్
బ్యాటింగుఎడమ చేతి వాటం
బౌలింగుకుడి చేయి లెగ్ బ్రేక్
పాత్రఆల్ రౌండర్
అంతర్జాతీయ జట్టు సమాచారం
జాతీయ జట్టు
తొలి వన్‌డే (క్యాప్ 45)2006 13 డిసెంబర్ - భారతదేశం తో
చివరి వన్‌డే2023 10 నవంబర్ - బంగ్లాదేశ్ తో
వన్‌డేల్లో చొక్కా సంఖ్య.3
తొలి T20I (క్యాప్ 13)2009 మే 29 - ఐర్లాండ్ తో
చివరి T20I2023 29 అక్టోబర్ - బంగ్లాదేశ్ తో
T20Iల్లో చొక్కా సంఖ్య.3
దేశీయ జట్టు సమాచారం
YearsTeam
2006/07లాహోర్ మహిళల క్రికెట్ జట్టు
2009/10–2018/19జరై తారకియాతి బ్యాంక్ లిమిటెడ్ మహిళా క్రికెట్ జట్టు
2009/10పాకిస్తాన్ విశ్వవిద్యాలయాల మహిళల క్రికెట్ జట్టు
2014లాహోర్ మహిళల క్రికెట్ జట్టు|లాహోర్
కెరీర్ గణాంకాలు
పోటీ WODI WT20I WLA WT20I
మ్యాచ్‌లు 108 108 180 169
చేసిన పరుగులు 2,602 2,202 5,080 3,924
బ్యాటింగు సగటు 27.97 27.52 37.91 33.53
100లు/50లు 0/14 0/11 5/30 0/26
అత్యుత్తమ స్కోరు 99 70* 159 77*
వేసిన బంతులు 1,691 898 3,012 1,484
వికెట్లు 44 36 97 69
బౌలింగు సగటు 25.56 23.30 17.52 18.24
ఒక ఇన్నింగ్సులో 5 వికెట్లు 0 0 0 0
ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు 0 0 0 0
అత్యుత్తమ బౌలింగు 4/7 3/21 4/7 3/6
క్యాచ్‌లు/స్టంపింగులు 34/– 29/– 61/– 59/–
మూలం: CricketArchive, 12 ఫిబ్రవరి 2023

ప్రారంభ జీవితం

మార్చు

బిస్మా ఒక కాశ్మీరీ కుటుంబంలో జన్మించింది. ఆమె తల్లిదండ్రులు బాగా చదువుకున్నందున ఆమె విద్యా వృత్తిని కొనసాగించడానికి, వైద్య వృత్తిలో స్థిరపడడానికి అనుకూలంగా ఉన్నారు. ఆమెలో వయసు పెరిగేకొద్దీ, క్రికెట్ పట్ల ఆమె ఆసక్తి పెరిగింది. లాహోర్ కాలేజ్ ఫర్ ఉమెన్ యూనివర్శిటీలో ఉన్నప్పుడు ఆమె అభిరుచి తారాస్థాయికి చేరుకుంది. అందువల్ల ఆమె హైస్కూల్ చదువు పూర్తి చేసిన తరువాత డాక్టర్ కావాలనే ఆశయాలను వదిలి క్రికెట్ రంగంలోకి 15 సంవత్సరాల వయస్సులో పాకిస్తాన్ జాతీయ క్రికెట్ వ్యవస్థలోకి ప్రవేశించింది.

అంతర్జాతీయ కెరీర్

మార్చు

2006 మహిళల ఆసియా కప్ సందర్భంగా భారత్ తో జరిగిన మ్యాచ్ లో 13 డిసెంబర్ 2006న 15 సంవత్సరాల వయస్సులో ఆమె వన్డే లలో ఆడడం ప్రారంభం చేసింది. మొదట్లోనే 76 బంతుల్లో 43 పరుగులు చేసి అందరిని ఆకట్టుకుంది.[11] ఆమె WT20I మ్యాచ్ లలో 2009, 29 మేన, 2009 RSA T20 కప్ కొరకు ఐర్లాండ్ తో తోలి మ్యాచ్ ఆడింది.[12]

ఆస్ట్రేలియాలో జరిగిన 2009 మహిళల క్రికెట్ ప్రపంచ కప్ కు ఆమె పాకిస్తాన్ జట్టు తరపున ఆడింది.[13] చైనా లో జరిగిన ఆసియా క్రీడల్లో బంగ్లాదేశ్ తో ఆడి బంగారు పతకం సాధించిన జట్టులో ఆమె కూడా ఉంది.[14][15] కొరియాలో జరిగిన 2014 ఆసియా క్రీడలలో బంగ్లాదేశ్ పై వరుసగా రెండవ బంగారు పతకాన్ని గెలుచుకున్న పాకిస్తాన్ జట్టులో ఆమె వైస్ కెప్టెన్ గా ఎంపికైంది.[16] ఆమె పాకిస్తాన్ మహిళా టి20ఐ జట్టుకు కెప్టెన్ గా ఎంపికైంది. గాయం కారణంగా ఆమె 2017 మహిళల క్రికెట్ ప్రపంచ కప్ నుండి నిష్క్రమించింది. జట్టులో ఇరామ్ జావేద్ ఆ స్థానంలో నియమించారు.[17][18] తరువాత ఆమె సనా మీర్ స్థానంలో పాకిస్తాన్ జట్టుకు నాయకత్వం వహించింది. 2017 మహిళల క్రికెట్ ప్రపంచ కప్ టోర్నమెంట్ ఘోరంగా విఫలమైన తరువాత పాకిస్తాన్ అన్ని మ్యాచ్ లను ఓడిపోయింది.[19] అక్టోబర్ 2017న , యుఎఇలో న్యూజిలాండ్ సిరీస్ ముందు పాకిస్తాన్ మహిళల క్రికెట్ జట్టుకు బిస్మాహ్ కెప్టెన్ గా ఎంపికైంది. సిరీస్ లో పాకిస్తాన్ మూడో మ్యాచ్లో న్యూజిలాండ్ జరిగిన తొలి వన్డేలో విజయం సాధించింది.[20][21] 2018లో ఆమె సారథ్యంలో శ్రీలంక పర్యటనలో జరిగిన వన్డే సిరీస్ లో పాకిస్తాన్ 3 - 0తో గెలిచింది.[22] సిరీస్ను 3 - 0తో గెలవడం పాక్ జట్టుకు ఇది రెండోసారి మాత్రమే.[23][24] పాకిస్థాన్ శ్రీలంకను 2 - 1 ఆధిక్యతతో టీ20 సిరీస్ గెలిచింది.

2018 లో ట్వంటీ20 ఆసియా కప్ మ్యాచ్ లో 143 పరుగులతో ఆమె పాకిస్తాన్ తరఫున అత్యధిక పరుగులు చేసిన క్రీడాకారిణిగా నిలిచింది.[25] అదే సంవత్సరం వెస్టిండీస్ తో జరిగిన 2018 ఐసిసి ఉమెన్స్ వరల్డ్ ట్వంటీ 20 టోర్నమెంట్ కోసం ఆమె పాకిస్తాన్ జట్టులో ఎంపికైంది , అయితే కెప్టెన్సీ నుండి దూరంగా ఉండాలని ఎంచుకుంది, దాని వలన జావేరియా ఖాన్ జట్టుకు నాయకత్వం వహించడానికి అవకాశం కలిగింది[26][27]. 2018 టి20 ప్రపంచకప్ ప్రచారానికి ముందు ఆమె సైనస్ సమస్య కారణంగా కంటి శస్త్రచికిత్స చేయించుకుంది, ఇది ఆమె క్రికెట్ భవిష్యత్తుపై సందేహాలను లేవనెత్తింది.[28] 2019లో వెస్టిండీస్ తో జరిగిన స్వదేశంలో జరిగిన వన్డే , టీ20 సిరీస్లకు కెప్టెన్ గా తిరిగి ఎంపికయింది.[29] 2019లో ఆస్ట్రేలియాలో ఐదు మ్యాచ్ ల సిరీస్ కు ముందు మహిళా గ్లోబల్ డెవలప్మెంట్ స్క్వాడ్ కు కెప్టెన్ గా ఎంపికైంది.[30][31]

జనవరి 2020లో , ఆస్ట్రేలియాలో జరిగే 2020 ఐసిసి మహిళా టి20 ప్రపంచ కప్ కోసం పాకిస్తాన్ జట్టుకు కెప్టెన్ గా ఎంపిక చేసారు. 28 ఫిబ్రవరి 2020న ఇంగ్లాండ్ తో జరిగిన మ్యాచ్ లో ఆమె కుడి బొటనవేలు విరిగింది.[32] ఫలితంగా మిగిలిన టోర్నమెంట్కు దూరమైంది , ఆమె స్థానంలో నహిదా ఖాన్ ను నియమించారు. ఆమె లేనప్పుడు జావేరియా ఖాన్ జట్టుకు నాయకత్వం వహించింది.[33]

డిసెంబర్ 2020 లో, ఆమెను 2020 పిసిబి అవార్డులు - 'ఉమెన్స్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్' జాబితాలో ఉంచారు[34]. ఏప్రిల్ 2021లో మాతృత్వం కారణంగా తాను క్రికెట్ నుండి నిరవధిక విరామం తీసుకుంటున్నానని మారూఫ్ ప్రకటించింది[35][36]. కాబోయే తల్లులకు, తండ్రులకు ప్రయోజనాలను అందించే పాకిస్తాన్ క్రికెట్ బోర్డు వారి ప్రసూతి విధానమునకు లబ్ధిదారుగా ఉన్న మొదటి పాకిస్తాన్ క్రికెటర్ ఆమె[37].[38][39] 2021 లో ఒక ఆడ శిశువుకు జన్మనిచ్చిన తరువాత , డిసెంబర్లో , మరూఫ్ 2022 ప్రపంచ కప్ కు ముందు పాకిస్తాన్ కోసం తిరిగి అందుబాటులో ఉన్నట్లు ప్రకటించింది[40].[41][42]

జనవరి 2022లో న్యూజిలాండ్ లో జరిగే 2022 మహిళల క్రికెట్ ప్రపంచ కప్ కోసం పాకిస్తాన్ జట్టుకు కెప్టెన్ గా తిరిగి ఎంపికైంది[43].[44] 2022లో ఇంగ్లాండ్, బర్మింగ్హామ్ లో జరిగిన 2022 కామన్వెల్త్ గేమ్స్ క్రికెట్ టోర్నమెంట్ కోసం పాకిస్తాన్ జట్టుకు కెప్టెన్ గా ఎంపికైంది.[45] మహిళా క్రికెట్ జట్టుకు ఆమె చేసిన అద్భుతమైన సేవలకు గౌరవసూచకంగా 2023లో బిస్మా తంఘ - ఎ - ఇంతియాజ్ పురస్కారాన్ని అందుకుంది.[46]

సూచనలు

మార్చు
  1. "Pakistan Women Cricket Team Records & Stats | ESPNcricinfo.com". Cricinfo. Retrieved 2022-06-06.
  2. "Pakistan Women Cricket Team Records & Stats | ESPNcricinfo.com". Cricinfo. Retrieved 2022-06-06.
  3. "Pathmakers – First to 1000 ODI runs from each country". Women's CricZone. Retrieved 29 May 2020.
  4. "The Spin | Pakistan's Bismah Maroof radiates the power to inspire change in cricket". the Guardian (in ఇంగ్లీష్). 2022-03-09. Retrieved 2022-03-22.
  5. "Cricket's mothers have it better now than ever (but not all of them)". Cricinfo (in ఇంగ్లీష్). Retrieved 2022-03-22.
  6. "Pakistan batter Bismah Maroof confirms availability for 2022 World Cup". CricTracker. Retrieved 6 January 2022.
  7. "Player Profile: Bismah Maroof". CricketArchive. Retrieved 6 January 2022.
  8. "Player Profile: Bismah Maroof". ESPNcricinfo. Retrieved 6 January 2022.
  9. "Records | Women's One-Day Internationals | Batting records | Most runs in a career without a hundred | ESPNcricinfo.com". Cricinfo. Retrieved 2022-03-22.
  10. "Babar Azam, Bismah Maroof awarded Pakistan's civilian honours". ESPNcricinfo. 23 March 2023.
  11. "Full Scorecard of IND Women vs PAK Women 1st Match 2006/07 - Score Report | ESPNcricinfo.com". ESPNcricinfo (in ఇంగ్లీష్). Retrieved 2022-03-22.
  12. "Full Scorecard of PAK Women vs Ire Women 2009 - Score Report | ESPNcricinfo.com". ESPNcricinfo (in ఇంగ్లీష్). Retrieved 2022-03-22.
  13. "Final, Asian Games Women's Cricket Competition at Guangzhou, Nov 19 2010". ESPNcricinfo. Retrieved 10 December 2018.
  14. "Pakistan clinch thriller to win gold". ESPNcricinfo. 26 September 2014.
  15. "Pakistan women set to defend cricket title". The Express Tribune. September 11, 2014.
  16. "Maroof named Pakistan Women T20 captain; Mir retains ODI role". ESPNcricinfo (in ఇంగ్లీష్). Retrieved 2022-03-22.
  17. "Injury ends Bismah Maroof's World Cup". ESPNcricinfo (in ఇంగ్లీష్). Retrieved 2022-03-22.
  18. "Mir axed as ODI captain, Maroof to lead side". ESPNcricinfo (in ఇంగ్లీష్). Retrieved 2022-03-22.
  19. "Maroof-led Pakistan squad named for New Zealand series". ESPN Cricinfo. Retrieved 12 October 2017.
  20. "Maroof, Mir seal ODI series for Pakistan". ESPNcricinfo (in ఇంగ్లీష్). Retrieved 2022-03-22.
  21. "Pakistan Women pulverise Sri Lanka, earn praise from PCB Chairman Sethi". Dawn. 24 March 2018.
  22. Aliani, Shahbano (1 June 2018). "Bismah Maroof at the helm: Getting to know the Pakistan women's cricket captain". Dawn.
  23. "Javeria, spinners help Pakistan seal 2-1 series win". ESPNcricinfo (in ఇంగ్లీష్). Retrieved 2022-03-22.
  24. "Pak women beat Sri Lanka women to take T20I series 2-1". The News International. 1 April 2018.
  25. "Women's Twenty20 Asia Cup, 2018, Pakistan Women: Batting and bowling averages". ESPN Cricinfo. Retrieved 9 June 2018.
  26. "Bismah Maroof returns for Women's World T20 but not as captain". ESPN Cricinfo. Retrieved 29 October 2018.
  27. "Bismah Maroof returns to Pakistan squad, Javeria Khan stays on as captain". International Cricket Council. Retrieved 29 October 2018.
  28. "Bismah Maroof reveals she feared for playing career after sinus operation". ESPNcricinfo (in ఇంగ్లీష్). Retrieved 2022-03-22.
  29. "Bismah Maroof takes back captaincy from Javeria Khan". ESPNcricinfo (in ఇంగ్లీష్). Retrieved 2022-03-22.
  30. "Bismah to lead Women's Global Development Squad". International Cricket Council. Retrieved 3 October 2019.
  31. "Pakistan squad for ICC Women's T20 World Cup announced". Pakistan Cricket Board. Retrieved 20 January 2020.
  32. "Pakistan skipper Bismah Maroof out of women's T20 World Cup with injury". Hindustan Times. Retrieved 28 February 2020.
  33. "Bismah Maroof ruled out of ICC Women's T20 World Cup 2020". Pakistan Cricket Board. Retrieved 28 February 2020.
  34. "Short-lists for PCB Awards 2020 announced". Pakistan Cricket Board. Retrieved 1 January 2021.
  35. "Motherhood beckons, taking indefinite break from cricket: Bismah Maroof". CricBuzz. Retrieved 16 April 2021.
  36. "Bismah Maroof takes indefinite maternity leave, as PCB mulls pregnancy provisions in contracts". ESPNcricinfo (in ఇంగ్లీష్). Retrieved 2022-03-22.
  37. Narayanan, Lavanya Lakshmi. "Women's Day 2022 - From Jess Kerr to Bismah Maroof - 22 inspirational women in sports". Sportstar (in ఇంగ్లీష్). Retrieved 2022-03-22.
  38. Raghunandan, Vaibhav (2022-03-09). "The way sport plays when it comes to maternity support policy". Business Standard India. Retrieved 2022-03-22.
  39. "PCB launches parental support policy for all cricketers". ESPNcricinfo (in ఇంగ్లీష్). Retrieved 2022-03-22.
  40. "Pakistan batter Bismah Maroof confirms availability for 2022 World Cup". CricTracker. Retrieved 6 January 2022.
  41. Acharya, Shayan. "Women's World Cup: Stars to watch out for". Sportstar (in ఇంగ్లీష్). Retrieved 2022-03-22.
  42. "Bismah Maroof available for 2022 World Cup; Urooj Mumtaz quits as PCB selection chair". ESPNcricinfo (in ఇంగ్లీష్). Retrieved 2022-03-22.
  43. "Bismah Maroof returns as Pakistan captain for Women's ODI World Cup". ESPNcricinfo (in ఇంగ్లీష్). Retrieved 2022-03-22.
  44. "Bismah Maroof returns to lead Pakistan in World Cup 2022". Women's CricZone. Retrieved 24 January 2022.
  45. "Women squad for Commonwealth Games announced". Pakistan Cricket Board. Retrieved 31 May 2022.
  46. "Bismah Maroof getst Tamgh-e-Imtiaz". Today 24 News. 24 March 2023. Archived from the original on 16 ఏప్రిల్ 2023. Retrieved 16 April 2023.