బి.ఆర్.నాయుడు

మీడియా సంస్థ అధిపతి, తితిదే ఛైర్మన్
(బి.ఆర్.నాయడు నుండి దారిమార్పు చెందింది)

బొల్లినేని రాజగోపాల్ నాయుడు (బిఆర్ నాయుడు) టీవీ 5 మీడియా హిందూ ధర్మం ఆధ్యాత్మిక ఛానల్ వ్యవస్థాపకుడు. తిరుమల తిరుపతి దేవస్థానం ప్రస్తుత చైర్మన్.[1][2][3] మీడియా సంస్థ యజమానిగా, వ్యాపారవేత్తగా, సామాజిక కార్యకర్తగా సుపరిచితుడైన నాయుడు, టీటీడీ బోర్డు ఛైర్మన్ గా నియమించబడ్దారు.[4]

నాయుడు తల్లిదండ్రులు మునిస్వామి నాయుడు, లక్ష్మిల ఆరుగురు సంతానంలో ఇతను చివరివాడు. వీరిది చిత్తూరు జిల్లా పెనుమూరు మండలం దిగువ పూనేపల్లి. వీరిది వ్యవసాయ కుటుంబం. స్థానికంగా చదువు పూర్తి చేసిన నాయుడు తరువాత సాంకేతిక విద్య నేర్చుకొని హైదరాబాద్ బీహెచ్ఈఎల్ కంపెనీలో ఉద్యోగంలో చేరాడు. యువ ఉద్యోగిగా బీహెచ్ఈఎల్ సాంస్కృతిక, సాహిత్య విభాగాల్లోనూ పనిచేశాడు. 12 వేలమంది ఉద్యోగులు ఉండే బీహెచ్ఇఎల్ సంస్థలో లిటరరీ సెక్రటరీగా, సాంస్కృతిక కార్యదర్శిగా చురుకైన పాత్ర పోషించాడు.[మూలం అవసరం]

నాయుడు తండ్రి మునిస్వామి నాయుడు, అవిభక్త మద్రాసు రాష్ట్ర ఫస్ట్ మినిస్టర్ గా (బ్రిటిషు వారి పాలనలో రాష్ట్ర ముఖ్యమంత్రి తరహా పదవి) 1930-1934 వరకు పదవిని నిర్వహించాడు.

టీటీడీ చైర్మన్‌గా నాయుడు ప్రమాణ స్వీకారం

మార్చు

టీటీడీ నూతన ఛైర్మన్‌ బీఆర్‌ నాయుడుచే 2024 నవంబరు 6న[5] రంగనాయకుల మండపంలో తిరుమల ఇఓ శ్యామలరావు ప్రమాణం చేయించారు.ఛైర్మన్‌ బీఆర్‌ నాయుడుతో పాటు కొత్తపాలకవర్గం సభ్యులు 23 మంది ప్రమాణస్వీకారం చేశారు.[6][7][8]

మూలాలు

మార్చు
  1. "తితిదే ఛైర్మన్‌గా బీఆర్‌ నాయుడు". Eenadu. 31 October 2024. Archived from the original on 11 April 2025. Retrieved 11 April 2025.
  2. "టీటీడీ పాలకమండలి తుది జాబితా ఇదే." Andhrajyothy. 1 November 2024. Archived from the original on 20 March 2025. Retrieved 20 March 2025.
  3. "BR Naidu appointed TTD chairman, Bharat Biotech's Suchitra Ella among 24 board members".{{cite news}}: CS1 maint: url-status (link)
  4. "టిటిడి చైౖర్మన్‌గా బిఆర్‌ నాయుడు ప్రమాణస్వీకారం - Prajasakti". 2024-11-06. Retrieved 2024-11-13.
  5. Rangarajan, A. D. (2024-11-06). "B.R. Naidu to take charge as TTD Chairman on November 6". The Hindu. ISSN 0971-751X. Retrieved 2024-11-13.
  6. "BR Naidu: తితిదే ఛైర్మన్‌గా బీఆర్‌ నాయుడు ప్రమాణ స్వీకారం". EENADU. Retrieved 2024-11-13.
  7. Chandra, Bolleddu Sarath. "TTD Chairman: టీటీడీ ఛైర్మన్‌‌గా ప్రమాణం చేసిన బీఆర్‌ నాయుడు, 54వ ఛైర్మన్‌గా బాధ్యతలు". Hindustantimes Telugu. Retrieved 2024-11-13.
  8. Rangarajan, A. D. (2024-11-06). "B.R. Naidu to take charge as TTD Chairman on November 6". The Hindu. ISSN 0971-751X. Retrieved 2024-11-13.