బి.శివశంకర్ రావు
బులుసు శివశంకర్ రావు భారతదేశానికి చెందిన న్యాయమూర్తి. ఆయన 2019 జనవరి 2న తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టి 2019 ఏప్రిల్ 19న పదవీ విరమణ చేశాడు.[1]
బి.శివశంకర్ రావు | |||
అధికారంలో ఉన్న వ్యక్తి | |||
అధికార ప్రారంభం 2 జనవరి 2019 - 19 ఏప్రిల్ 2019 | |||
నియమించిన వారు | రామ్‌నాథ్ కోవింద్ | ||
---|---|---|---|
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | 29 మార్చి 1959 సాకూరు గ్రామం, అమలాపురం మండలం , తూర్పు గోదావరి జిల్లా , ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం | ||
తల్లిదండ్రులు | గవర్రాజు, సూర్యకాంతం | ||
జీవిత భాగస్వామి | జయలక్ష్మి | ||
సంతానం | లలిత శ్రీజ | ||
పూర్వ విద్యార్థి | నాగార్జున యూనివర్సిటీ |
జననం, విద్యాభాస్యం
మార్చుబి. శివశంకరరావు 1959 మార్చి 29లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, తూర్పు గోదావరి జిల్లా, అమలాపురం మండలం, సాకూరు గ్రామంలో గవర్రాజు, సూర్యకాంతం దంపతులకు జన్మించాడు. ఆయన ఆంధ్రా యూనివర్సిటీ నుంచి లా, కాకతీయ యూనివర్సిటీ నుంచి ఎంఎల్ పూర్తి చేసి అనంతరం నాగార్జున యూనివర్సిటీ నుంచి న్యాయశాస్త్రంలో పీహెచ్‌డీ పట్టా అందుకొని 1984లో న్యాయవాదిగా పేరు నమోదు చేసుకున్నాడు.
వృత్తి జీవితం
మార్చుబి. శివశంకరరావు 1984లో న్యాయవాదిగా పేరు నమోదు చేసుకొని పాలగుమ్మి సూర్య రావు, దువ్వూరి మార్కండేయులు వద్ద జూనియర్‌గా పనిచేశాడు. ఆయన 1996లో జ్యుడీషియల్ సర్వీసుల్లోకి ప్రవేశించి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో జిల్లా, సెషన్స్ కోర్టులలో న్యాయమూర్తిగా, ఖమ్మం జిల్లా అడిషనల్ జిల్లా న్యాయమూర్తిగా, అడిషనల్ మెట్రోపాలిటన్ సెషన్స్ న్యాయమూర్తిగా, ఆంధ్రప్రదేశ్ జ్యుడీషియల్ అకాడమీ, మెట్రోపాలిటన్ సెషన్స్ న్యాయమూర్తిగా ఆంధ్రప్రదేశ్ లో వివిధ కోర్టులలో పనిచేసి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు అడిషనల్ జిల్లా న్యాయమూర్తిగా 2013 అక్టోబరు 17 నుండి 2013 అక్టోబరు 17 వరకు పనిచేసి ఉమ్మడి ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా 2016 మార్చి 02న నియమితుడయ్యాడు. బి. శివశంకరరావు 2019 జనవరి 2న తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టి 2019 ఏప్రిల్ 19న పదవీ విరమణ చేశాడు.[2] బి. శివశంకర రావును ఆంధ్రప్రదేశ్‌లో టెండర్ల ప్రక్రియ న్యాయ పరిశీలన బాధ్యతల ఛైర్మన్‌గా 2019 సెప్టెంబరు 11న నియమితుడయ్యాడు.[3]
మూలాలు
మార్చు- ↑ Sakshi (2 January 2019). "కొలువుదీరిన కొత్త హైకోర్టు". Archived from the original on 19 October 2021. Retrieved 19 October 2021.
- ↑ Telangana High Court (2021). "HONOURABLE Dr. JUSTICE B. SIVA SANKARA RAO". tshc.gov.in. Archived from the original on 20 October 2021. Retrieved 20 October 2021.
- ↑ Sakshi Education (12 September 2019). "ఏపీలో జస్టిస్ శివశంకర్‌రావుకు టెండర్ల బాధ్యతలు". Archived from the original on 20 October 2021. Retrieved 20 October 2021.