బి. కృష్ణమూర్తి

బాలసుబ్రహ్మణ్య అయ్యర్ కృష్ణమూర్తి ఒక కర్టాటక గాత్ర సంగీత విద్వాంసుడు.

బాలసుబ్రహ్మణ్య అయ్యర్ కృష్ణమూర్తి
Balasubramanya ayyar krishnamoorti.png
బి.కృష్ణమూర్తి
వ్యక్తిగత సమాచారం
జననం1932
పదరక్కుడి, రామానాథపురం జిల్లా, తమిళనాడు
సంగీత శైలికర్ణాటక సంగీతం
వృత్తిగాయకుడు

విశేషాలుసవరించు

ఇతడు తమిళనాడు రాష్ట్రం రామనాథపురం జిల్లా, పదరక్కుడి గ్రామంలో 1932లో జన్మించాడు. ఇతడు ముదికొండన్ వెంకట్రామ అయ్యర్ వద్ద పల్లవులు పాడటంలో శిక్షణ తీసుకున్నాడు. ఇతడు త్యాగరాజ కీర్తనలను, ముత్తుస్వామి దీక్షితుల కృతులను, పదాలను, జావళీలను ఆలపించడంలో కర్ణాటక సంగీత గురువులలో ఒక ప్రత్యేక స్థానాన్ని ఆక్రమించాడు. ఇతడు తమిళనాడు ప్రభుత్వ సంగీత కళాశాలలో ప్రొఫెసర్‌గా, ప్రిన్సిపాలుగా పనిచేసి అనేక మంది శిష్యులను సంగీత విద్వాంసులుగా తయారుచేశాడు. ఇతడు అనేక ఆడియో కేసెట్లను, సి.డి.లను రికార్డు చేశాడు. కర్ణాటక సంగీతంలో ఇతడు చేసిన కృషికి గుర్తింపుగా అనేక సంస్థలు ఇతడిని సత్కరించాయి. కేంద్ర సంగీత నాటక అకాడమీ 2007లో ఇతనికి కర్ణాటక సంగీతం గాత్ర విభాగంలో అవార్డును ప్రకటించింది[1].

మూలాలుసవరించు

  1. web master. "B. Krishnamoorti". SANGEET NATAK AKADEMI. SANGEET NATAK AKADEMI. Retrieved 26 February 2021.